27, డిసెంబర్ 2009, ఆదివారం

మూర్చకు మునగవేరు

మునగవేరు పై బెరడును కడిగి ఆరబెట్టి పొడిచేసి నిలువచేసుకోవాలి.
పూటకు వయస్సునుబట్టి అరగ్రాము నుండి మూడుగ్రాముల వరకు ఈపొడిని
నీటిలో కలిపి రెండు పూటలా సేవిస్తుంటే మూర్చ. అపస్మారం తగ్గిపోతాయి.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మగసిరికి --

మగసిరికి --
శీఘ్రస్కలనంతో, నపుంసకత్వంతో, అంగపతనంతో, భాదపడే మగవారు
మునగచెట్టు పూలను తీసుకుని ఒకగ్లాసుపాలను పొయ్యిపై పెట్టి మరిగేటప్పుడు
ఈ పూలను వేసి మూడు పొంగులు పొంగించి దించి వడపోసి తగినంత కండచెక్కెరపొడి
కలిపి ఉదయం పరగడుపునగానీ రాత్రి నిద్రించేముందుగాని త్రాగాలి.
ఇది సేవించేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించి వీర్యాన్ని కాపాడుకోవాలి.దీనివల్ల అపారమైన
వీర్యంచిక్కగా ఉత్పన్నమై పురుఘులకు మగసిరి పెరుగుతుంది.

మునగాకుతో--పట్టు

మునగాకును కఛ్చాపఛ్ఛాగా నలగగొట్టి కొంచెం వంటాముదం వేసి దోరగావేయించి
ఒకబట్టలోవేసి గోరువెచ్చగా వుండేటట్ట్లు నొప్పులపైన వేసి నిద్రించేముందు కట్టుకడుతూవుంటే
అతి తక్కువ కాలంలో ఎంతోకాలంనుండి ఇబ్బంది పెట్టే వాతపట్లు వాపులు తగ్గిపోతాయి.

మునగచెట్టు ఉపయోగాలు

మునగచెట్టు ఉపయోగాలు
మునగచెట్టులేత ఆకులను కూరగా వండి తింటుంటే కొంచెం చిరు చేదుగా,
రుచికరంగాఉండి ఎంతోకాలంగావేధిస్తున్న వాత నొప్పులను హరించివేస్తుంది.
సుఖవిరోచనం కలిగిస్తూ పురుషులకు వీర్యవ్రుధిని, బాలెంతలకు క్షీరవ్రుద్దిని కలిగిస్తుంది.
శరీరంలోని చెడునీరును తీసివేస్తుంది.నేత్రరోగాలు వాతపైత్యదోషాలు,విషాలు హరించిపోతాయి.

స్త్రీలు బహిష్ఠుస్నానం చేయగానే ముందుగా భర్తనే -ఎందుకుచూడాలి...?

స్త్రీలు బహిష్ఠుస్నానం చేయగానే ముందుగా భర్తనే -ఎందుకుచూడాలి...?
స్త్రీలు బహిష్ఠుస్నానంచేసి న నాల్గోరోజున స్నానాలగది నుండి బయటకు రాగానే
ముందుగా భర్త ముఖమే చూడాలి అని శాస్రాకారులు నిర్ణయించారు.
ఆసమయంలో ఎవరి ముఖాన్ని చూస్తారో ఆనెలలో గర్బంధరిస్తే ఆ సంతానానికి
అతని రూపమే ప్రాప్తిస్తుందని తెలియచేసారు.

24, డిసెంబర్ 2009, గురువారం

నియమాలు పాటించని స్త్రీలకు నిష్ఠదరిద్రం - నిండుదరిద్రం.

నియమాలు పాటించని స్త్రీలకు నిష్ఠదరిద్రం - నిండుదరిద్రం.
బహిష్ఠు సమయంలో సంభోగంచేయడం వల్ల గర్భంనిలవకుండాస్రవించిపోతుంది.
బహిష్ఠులో ఏడిస్తే వారికి విక్రుతమైన నేత్రములు కలిగిన సంతానము కలుగుతుంది.
గోళ్ళుకత్తిరిస్తే పిప్పిగోళ్ళుగల సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో నలుగుపెట్టి స్నానంచేస్తే పుట్టేబిడ్డలు కుష్ఠురోగం కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పగటిపూటనిద్రిస్తే నిద్రమొహంగల సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పరుగెత్తడంవల్ల చంచలమైన సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పెద్దద్వనులువినడంవల్ల చెవిటి సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో అతిగానవ్వడంవల్ల దవడలు,పళ్ళు, పెదవులు,నాలుక నల్లగాసంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో అతిగా వాగడం,అతిగాశ్రమించడంవల్ల,అతిగా గాలితగలడంవల్ల ఉన్మాదసంతానంకలుగుతుంది.
అని పెద్దలు అనుభవపూర్వకంగాతెలియచేసారు.

మంచి సంతానంకోరే స్త్రీ పాటించవలసిన-బహిష్టు నియమాలు

మంచి సంతానంకోరే స్త్రీ పాటించవలసిన-బహిష్టు నియమాలు
బహిష్టు ప్రారంభమైనరోజునుండి ఆగిపోయే నాలుగోరోజు వరకు స్త్రీలు పూర్తి బ్రహ్మచర్యాన్నిపాటించాలి.
పొరపాటున ఇతరజీవులపైన కాని సాటివారిపైనగాని హింసించకూడదు.దుర్భాషలాడకూడదు.
చాహపైన శయనించండం అవసరం.
ఇంటిలో ఏ పని చేయకూడదు.
భర్తను ముట్టకూడదు.
విస్తరాకులో భోజనంచేయాలి.
ఏకారణాలచేత ఏడవకూడదు.
గోళ్ళుకత్తిరించకూడదు.
వటికి నలుగు పెట్టి స్నానంచేయకూడదు.
పగలు నిద్రించకూడదు.
పెద్దశబ్దంతో మాట్లాడటంగాని, నవ్వటంగాని, చేయ్యకూడదు.
ఆదికంగా శరీరానికి గాలి తగిలేచోట ఉండకూడదు.
పైనియమాలను పాటిస్తే ఉత్తమమైన సంతానంకలుగుతుందని పెద్దలు నిర్దారించారు.

About

shotmix


ShoutMix chat widget

online