30, ఆగస్టు 2009, ఆదివారం

కీళ్ళవాతానికి--ఆహారనియమాలు

వ్యాదిపూర్తిగాతగ్గేవరకు పాతబియ్యంతో కాచిన జావలొ గాని
గోధుమనూకతో
కాచిన జావలొ గాని, చిటికెడు కరకపొడి,
చిటికెడు సొంఠిపొడి,నాలుగైదుచిటికెడు సైంధవలవణంపొడి
కలిపితాగాలి
*చేపలు,మాంసం,గడ్లు,ఉలవలు,బెల్లం,పాలు,బచ్చలికూర,
మినుములు,పూర్తిగా నిషేదించాలి
మిగిలిన పదార్దాలు వాడుకోవచ్చు

కీళ్ళవాతానికి

వెల్లుల్లిరేకలు 10గ్రా" సొంఠి10గ్రా",వావిలిచెట్టుబెరడు10గ్రా"
తీసుకుని కొంచెం నలగ్గొట్టి గిన్నెలోవేసి పావులీటరునీళ్ళు
పోసి చిన్నమంటపైన అరపావులీటరు కషాయం మిగిలేవరకూ
మరిగించాలి దించి వడపోసి దాన్ని రెండుభాగాలుగాచేసి
గోరువెచ్చగా వున్నప్పుడు ఒకచెంచాతేనెకలిపి ఆహారం
తరువాత1or2గంటలాగి సేవించాలి
కీళ్ళవాతరోగులు రోజూ రాత్రి నిద్రించేముందు వంటాముదం
10గ్రా"తీసుకుని అందులొ దోరగావేయించిన కక్కాయపొడి
పావుచెంచాకలిపితాగాలి సుఖవిరేచనం జరుతుంది

కీళ్ళవాతానికి

వాము30గ్రా",సొంఠి50గ్రా",కరక్కాయబెరడు120గ్రా"
తీసుకోవాలి ఈ మూడింటినీ దోరగా వేయించి దంచి
పొడిచేసి 200గ్రా"కండచెక్కెరపొడికలిపి నిల్వచేసుకోవాలి
ఈ చూర్ణాన్నిరోజూ2or3 పూటలా ఆహారానికి గంటముందు
అరచెంచా మోతాదుగా గోరువెచ్చని నీటితో సేవిస్తె ముందుగా
ఉదరశుద్ది జరుగుతుంది ఉదరంలోకుళ్ళిన పదార్దాలు
బహిష్కరింపబడి జఠరాగ్ని కలిగిస్తుంది సుఖవిరేచనం
జరుగుతుంది

29, ఆగస్టు 2009, శనివారం

కీళ్ళవాతానికి

వావిలాకులు,చింతాకులు,జిల్లేడాకులు,గుంటగలగరాకులు,
మనగాకులు,దొరికితేపెద్దచెన్నంగి(కసివింద),గానుగాకులు,
ఒక్కొక్కటీ100గ్రా"సేకరించాలి నువ్వులనూనే700గ్రా"
కళాయిలొపొసి మరిగించాలి అదివేడెక్కగానే పైన సేకరించిన
ఆకులన్నిచిన్నముక్కలుగా తరిగివేయాలి ఆకులరసం నూనెలొ
కలిసిపోయేటప్పుడు ఆకులు పగులుతు చిటపటమని శబ్దం
వస్తుంది నూనెబిందువులు పైకిఎగిరి చేతులపై పడే అవకాశం
ఉంది కాబట్టి కొంచెందూరంగా వుండి చేయాలి
ఆకులునల్లగా మాడినూనెమిగిలిన తరువాత దించి బట్టలొ
వడపోసుకోవాలి అందులో దోరగా వేయించి దంచి వస్త్రఘుళ్ళితం
పట్టిన మిరియాలపొడి30గ్రా" పిప్పళపొడి30గ్రా" మెత్తగానూరిన
గడ్డకర్పూరంపొడి40గ్రా"కలిపి మూతపెట్టాలి ఆపదార్దమంతా
నూనెలో కలిసిపోయి చల్లారిన తరువాత ఒకగాజుసీసాలొనిల్వ
ఉంచాలి
ఇలావాడాలి:-కీళ్ళవాతంసంక్రమించినపుడు వేళ్ళగుణుపులవద్ద
చేతులమణికట్టు వద్ద, కాళ్ళచీలమండెలవద్ద,మొచేతులవద్ద,
మోకాళ్ళవద్ద వాచివుంటుంది అక్కడముట్టుకుంటేభరించలేనంత
నొప్పిపుడుతుంది పై తైలాన్ని విడిగా గిన్నెలోకి తీసుకుని
గోరువెచ్చగా వేడిచేసి నిదానంగా మ్రుదువుగా ఆ వాపులపైన
సున్నితంగా రుద్దాలి రోగులు కళ్ళుమూసుకుని బాధను బరించాలి
ఈ నూనె అన్నివాపులకు పట్టించాలి తరువాత పైన తెలిపిన
ఆకులు ఒకఅరకేజీ తీసుకుని రెండు కేజీలనీటిలో వేసికొంచెం
పసుపు వేసిమూతపెట్టి మరిగించాలి పాత్రను దించి సగం
మూతను సగం తీస్తే ఆవిరి పైకి వస్తుంది కీళ్ళవాతంసోకిన
అవయవానికి ఈఆవిరి తగిలేటట్లు చేయాలి దీనివల్ల పైన
పూసిన తైలం లోపలికి ఇంకి లోపలపేరుకుపోయిన వాతం
అనేకుళ్ళిన పదార్దాన్ని కరిగించి చెమట రూపంలొ తోసివేస్తుంది
ఇలా జరిగినపుడు మొదటి 4to5రోజులు రోగికి తీవ్రమైననొప్పి
కలుగుతుంది దాన్నిఓపికగా బరించాలి ఈ విధంగా
ఆవిరిపట్టిన తరువాత ఒక పొడి నూలు బట్టను తీసుకుని
మరిగించిన నీటిలొ ముంచి పిండి ఆబట్టతొ వాపుల పైన
కాపడంపెట్టాలి। ఆతరువాత ఆయాభాగాలకు వ్యాయామంచేయాలి

మూత్రంలొసుద్దపోతొంటే

మిరియాలతొ:-ఒకకప్పు పాలలో అరచెంచామిరియాల
పొడినివేసి ३ సార్లు పొంగించి దించి వడపోసి ఒకచెంచా
కండచెక్కెరపొడి కలిపి २ పూటలాతాగితేమూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది
నీరుల్లితొ:-రెండుపూటలా ఒకపచ్చి నీరుల్లిపాయను
ముక్కలుగాచేసిఅన్నంలోతిన్నా లేక రసంతీసి
అందులొ కండచెక్కెరకలిపి తాగినా
మూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది
కరక్కాయతొ:-కరక్కాయ పై బెరడు చూర్ణాన్ని
పూటకు అరచెంచామోతాదుగా ఒకచెంచాతేనెని
కలిపి రెండుపూటలా సేవిస్తె
మూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది

ముత్రకోశంలొ -రాళ్ళు

ఉలవలతొ:-పెద్దగ్లాసు నీటిలొ50గ్రా"ఉలవలు వేసి
ఒక కప్పుకు మరిగించిన కషాయంగాని ఉడకబెటిన
నీరుగాని ఒక కప్పు మోతాదుగా పవుచెంచా
సైందవలవణం కలిపి రెండుపూటలా ఆహారానికి
గంటముందుసేవిస్తె మూత్రకోశంలొ రాళ్ళు
మెత్తబడి మక్కలై మూత్రద్వారంగుండాపడిపోతాయి
వక్కపొడితొ:-పరిమితిమైన మోతాదుగా వక్కపొడిని
చప్పరిస్తెమూత్రకోశంలొరాళ్ళుపుట్టవు రాళ్ళువున్న
వారికిక్రమీణాతగ్గిపోతాయి
వెంపలిఆకుతొ:-వెంపలిఆకును కడిగి దంచి తీసిన
రసం రెండుచెంచాలమోతాదుగా రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి
పత్తిఆకుతొ:-పత్తిఆకును కడిగి
దంచి తీసిన
రసం రెండుచెంచాలమోతాదుగా రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి
నేలతాడితొ:-
నేలతాడిచెట్టువేళ్ళుమూలికలషాపులలొ
దొరకుతాయి వాటినితెచ్చి శుబ్రంగా కడిగి ఆరబెట్టి
దంచి వస్త్రఘూళితంచేశి నిలువవుంచుకోవాలి
ఒకకప్పునీటిలొ రెండుచెంచాలపొడిని కలిపి
రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి

మూత్రంభంధింపబడితె

*కలబందతొ:-రోజూ రెండుపూటలా30గ్రా"కలబంద
గుజ్జును అరకప్పు పాలలొ కొంచెంనీరుకూడవేసి
చెం
చాతొగిలక్కొట్టితగుమాత్రంగా కండచెక్కరవేసి
సేవిస్తెమూత్రభంధంవిడిపొయిమూత్రందరళంగావస్తుంది
ఉత్తరేణితొ:-ఉత్తరేణి సమూల కషాయం అరకప్పుమోతాదు
గాకండచెక్కర కలిపి సెవిస్తె
మూత్రందరళంగావస్తుంది
ఇంగువతొ:-మంచి ఇంగువను పొంగించి కందిగింజంత
మాత్రమే మాత్రలాగా చేసుకుని మంచినీటితో
రెండుపూటలా
సేవిస్తెమూత్రభంధంవిడిపొయి
మూత్రందరళంగావస్తుంది
దువ్వెనకాయలచెట్టుతొ:-దీనినేఅతిబల ముద్రబెండాంటారు
ఈచెట్టుబెరడును నీటితొ కలిపి దంచి రసంతీసి పూటకు
రెణ్డుచెంచాల మోతాదుగా కొంచెంకండచెక్కర కలుపుకొని
తాగితే
మూత్రందరళంగావస్తుంది
కొబ్బరినీటితొ:-బాగాముదిరిన కొబ్బరికాయలనీరు
పూటకు ఒకగ్లాసు రెండుపూటలా సేవిస్తే
మూత్రందరళంగావస్తుంది

28, ఆగస్టు 2009, శుక్రవారం

మూత్రంలొ తెలుపుపోతుంటె

మామిడిపూతతొ:-కొంతమందికిమూత్రంతోపాటుకఫం
లాగ తెల్లనిపదార్ధంవిసర్జింపబడుతుంది దీనివల్ల వారు
బలహీనపడ్పోతారు మామిడిపూతనుగాలికినీడలొఆరబెట్టి
నిలువచేసుకొవాలిదానినిపొడిచేసుకొని పావుచెంచాపొడిని
అరకప్పునీట్లొకలుపుకొనిసేవిస్తెమూత్రంలోతెలుపునివారించ
బడుతుంది పూతదొరకనిసమయంలొ మామిడిటెంక
లొపొల ఉండె జీడినిచూర్ణంచేసి పై విధంగా ఉపయోగించవచ్చు

మూత్రంలో--వీర్యంపోతుంటె

తిప్పతీగతొ:-50గ్రాములు తిప్పతీగకాడలను పావులిటరు
నీటిలొనలగగొట్టి ఒకకప్పు కషాయానికి మరిగించి వడపొసి
ఒకచెంచా కండచెక్కర కలిపి గోరువెచ్చగాతాగాలి ఇలా
రెండు పూటలూతాగితె మూత్రంలొపొయెఇంద్రియంతగ్గుతుంది
బెండకాయతొ:-లేతబెండకాయ ముక్కలను గ్లాసు నీటిలొవేసి
సగానికి మరిగించి వడపోసిరెండుగావిభజించి పూటకు
సగంకషాయంలొ చెంచా చెక్కరకలిపితాగాలి
పల్లేరుకాయలతొ:-
పల్లేరుకాయలను దంచి చూర్ణంచేసి
జల్లెడపట్టిదానికి సమానంగాపటికబెల్లంపొడి కలుపుకోవాలి
రోజు రెండుపూట్లా ఒకచెంచాపొడి ఒకకప్పు మంచినీటిలో
కలిపితాగితేమూత్రంలొ వీర్యంపోవడంఆగిపోతుంది

27, ఆగస్టు 2009, గురువారం

మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె

(१)*గరికతొ:-ఒకకప్పు పాలగ్లాసులొ20గ్రా"గరిక ముక్కలు
వేసిమరిగించి దించి వడపొసిగోరువెచ్చగా రెండుపూట్లా
తాగాలి
(२)*చింతాకుతొ:-మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె
గుప్పెడుచింతచిగురు తింటెవెంటనేతగ్గిపోతుంది లేదా
రెండుపూటలారెండుచెంచాలచింతాకురసంతాగినా
వెంటనేతగ్గిపోతుంది
(३)*బెండకాయతొ:-బెండకాయచిన్నముక్కలుగాకోసి
గుప్పెడుముక్కలను గ్లాసునీటిలొవేసికప్పునీరుమిగిలే
వరకుమరిగించి దించి వడపోసి అరచెంచాపంచదార
కలిపి పూటకు అరకప్పు మొతాదుగామూడుపూటలా
తాగాలి ఇలరెండులెదామూడురోజులుచేస్తె
మూత్రవిసర్జనలొ ఏవిధమైన బాధవుండదు
మూత్రంచాలాసులువుగావిసర్జింపబడుతుంది
స్త్రీ,పురుఘులకు కూడామర్మావయాలకుచెందిన
మంట,పోటుమొదొలైనసమస్యలన్నితగ్గిపోతాయి

మూత్రద్వారంలొ-మంట

బొప్పయిపండుతొ:-బాగాపండిన బొప్పయిపండుత్చ్చి
పైతోలు తీసి లోపలిగుజ్జును ముక్కలుగాచేసిరెండు
లేదామూడుపూటలాతింటేమూత్రద్వారంలొ-మంట
తగ్గిపొతొంది
రుద్రజడాకులతొ:-సబ్జాచెట్టునేరుద్రజడఅంటారు
దీనిఆకులను20గ్రా॥తీసుకునికొంచెంనీరుపోసి
దంచి రసంతీసి పూటకు2చెంచాలు3పూటలాసేవిస్తె
మూత్రద్వారంలొమంటమూత్రనాళంలొవాపు
తగ్గిపోతాయి

మూత్రద్వారంలొ-మంట

నల్లతుమ్మతొ:-నల్లతుమ్మచెట్టుకువచ్చె జిగురును
చింతగింజంత 2or3కప్పులనీటిలొకలిపి కరిగించి
తాగితే మూత్రద్వారంలొమంట తగ్గిపోతుంది

మూత్రద్వారంలో--మంట

అతిబలాఅకులతొ:-అతిబలఅనగా దువ్వెనకాయలచెట్టు
దీనినె
ముద్రబెండ,తుత్తురబెండఅనికూడాఅంటారు
ఈఆకులను20గ్రా॥మొతాదుగా తీసుకుని కొంచెంనీటిలొ
కలిపి దంచి రసంతీసి ఆరసంలొ ఒకచెంచా కండచెక్కెరకలిపి
2or3సేవిస్తెమూత్రద్వారంలోమంట,వాపు,పోటుత్గ్గటమేకాక

మూత్రంసఫీగాఅవటమేకాకశరీరానికిబలంకలుగుతుంది

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

చేమంతిపూలతొ:-చేమంతిపూలరేకలుతెచ్చిఆరబెట్టి
బాగాఎండినతరువాత దంచి పొడిచేసుకోవాలి
ఈ పొడి పూటకు అరచెంచా మొతాదుగా ఒకచెంచా
తేనెతో చప్పరిస్తె క్రమంగా ముత్రరోగాలు హరించుకుపోతాయి

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

ఉత్తరేణితొ:-ఉత్తరేణిఆకులు,వెన్నులు,వేర్లుసమంగాతెచ్చి
కడిగి నీడలొగాలికి ఆరబెట్టి దంచి పొడిచేసుకోవాలి
ఒకగ్లాసునీటిలొ ఒకచెంచాపొడివేసి ఒకకప్పు కషాయం
మిగిలేవరకు మరిగించి వడపోసి తాగితే అసలు రక్తం
లేనివారికి కూడా రక్తం పుడుతుంది అంటె కాలెయం ప్లీహం
శుద్దిచెంది మంచిరక్తాన్ని పుట్టిస్తుంది మూత్రపిండాలుబాగుపడతాయి

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

జీలకర్రతో:-రెండుకప్పులనీటిలొ ఒకచెంచాజీలకర్ర
నలగ్గొట్టి వేసి అరకప్పుకషాయం మిగిలేవరకు
మరిగించి వడపోసి రెండుపూటలూతాగితే
మూత్రపిండాలు తొందరగా బాగుపడతాయి

26, ఆగస్టు 2009, బుధవారం

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

పల్లెరుకాయలతొ:-పెద్దపల్లేరు లేక చిన్నపల్లేరుకాయలనుతెచ్చి
కడిగి ఆరబెట్టి దంచి జల్లించి మెత్తని పొడిగా చేసి
నిల్వవుంచుకోవాలి ఈ పొడిని అరచెంచానుండిఒకచెంచావరకు
అరగ్లాసునీటిలొ కలిపి రెండుపూటలా తగుతూవుంటే క్రమంగా
మూత్రపిండాలలొ వాపు,మూత్రపిండాలుక్రుశింవిపోవడం,
పోటురావడం,మురికిచేరడం,సమస్యలునివారించబడి
మూత్రంసాఫీగా అవుతుంది

మధుమేహసమస్య

మర్రిచెట్టుకు ఉత్తరం వైపువుండె బెరడుఅలాతీసినచొట
(చెట్టుకు)ఆవుపేడ బాగాఅద్దాలి
చెక్కను ఇంటికితెచ్చి బెత్తుడుపరిమాణంలొ ముక్కలు
కొట్టి కడిగి 4to5రోజులుఎండలొపెట్టి అతరువాత నీడలొ
గాలితగిలేచొట ఆరబెట్టాలి
ఒకప్ద్దగ్లాసునీటిలొ ఒకముక్కవేసి 24గంటలునానబెట్టి
ముక్కతొపాటు పొయ్యిమీదపెట్టిసగం కషాయంమిగిలెవరకు
మరగించాలి వడపొసిరెండుభాగాలుచేసి ఆహారానికి గంట
ముందుగా సేవించాలి దీనినిఒకసంవత్సరం వరకు వాదాలి
ఇలాచేస్తె మధుమేహం అదుపులొకి
రావడమేకకుండా చచ్చుబడిన మాంసకండరాలు కూడా
తిరిగిఅదుపులొకివస్తాయి

వాసనతెలియని--సమస్య

రెండుపూటలా ఆహారానికిఒకగంటముందు
ప్రశస్తమైన
మంచినీటివలెవుండె వేపనూనె3చుక్కలు
ముక్కులొవేసుకోవాలి తరువాత వేడినీటిలొ
పసుపువేసి ఆవిరితీసుకోవాలి ఇలాకొద్దిరోజులుచేస్తుంటే
ముక్కులొ కొయ్యకండరాలు కరిగిముక్కుచీదినపుడు
కొంచెంఎర్రగానీరువస్తుంది అందుకుకంగారుపడక్కరలేదు
కొయ్యకండరం కరిగినపుడుఅలావస్తుంది ఇలాచేస్తుంటే
తిరిగివాసనవస్తుంది

మత్తుపానీయం--మానడంఎలా...?

ప్రయోగం:-అసలైన దేశవాళ్ళి వాము కొత్తది 5కేజీల
తీసుకుని శుబ్రంగాచెరిగి నలగగొట్టి ఒకపాత్రలోపోసి
అందులో80
కేజీలునీరు కలిపిరెండురోజులపాటు నిల్వ
ఉంచాలి మద్యమద్యలొ కలుపుతుండాలిఆపాత్రను
పొయ్యిమీదపెట్టి నలుగోవంతు అనగా 20కేజీల కషాయం
మిగిలె వరకు చిన్నమంటపై మరిగించి దించ వడపోసుకోవాలి
ఈవాము అరుకును సాయంత్రంపూట 20గ్రా॥ మోతాదుగా
కొద్దికొద్దిగా తాగుడుకు బానిస అయిన వారి చేతతాగించాలి
ఇలారోజుకు 2to3సార్లు తగించవచ్చు ఈవిధంగా1or2నెలలు
సేవిస్తె మందగించిన ఆకలి పెరగడం,తొందరగ్గభొజనం
చెయ్యలనిపించడం,కడుపులోకల్మషమంతా విరేచనంద్వారా
పడిపోవడం,మొదలైనమార్పులు జరుగుతూతాగుడుపై
వ్యామోహంతగ్గుతూ ఆదురలవాటునుండి బయటపడగల్గుతారు

హెపటైటీస్-బి

గోమూత్ర ప్రయోగం:-8పొరల నూలుబట్టలొ వడపోసిన
అరకప్పు దేశవాళీ ఆవుమూత్రంలో ఎండుకరకపెచ్చులపొడి
3గ్రా॥కలిపి పరగడుపున సేవించాలి
సొరకాయప్రయోగం:-పైతోలుతీయకుండా సొరకాయను కోసి
ఆముక్కలను దంచితీసిన రసం
బట్టలొవడపొసి అందులొ
5మిరియాలపొడి,5తులసిఆకులపొడి,5పుదీనాకులపొడి
కలిపి సాయంత్రంపూట అరగ్లాసు మోతాదుగా సేవించాలి
పునర్నవాదిచూర్ణప్రయోగం:-తెల్లగలిజేరు సమూలచూర్ణం
గుంటగలర
సమూలచూర్ణం, నేలవేముసమూలచూర్ణం,
తిప్పతీగ
సమూలచూర్ణం,కామంచిసమూలచూర్ణం,
సుఘందపాలవేర్లచూర్ణం సమంగా కలిపి నిల్వవుంచుకోవాలి
ఒకగ్లాసు నీటిలొ ఒకచెంచాచూర్ణంవేసి అరగ్లాసు కషాయానికి
మరిగించి వడపొసి రెండుభాగాలుగాచేసి రెండుపూటలా
పూటకు పావుగ్లాసు కషాయంలో ఒకచెంచాతేనెకలిపి సేవించాలి
ఏమితినకూడదు:-కారం,వేపుడుకూరలు,మాంసం,చేపలు,
గుడ్లు,మసలాకూరలు
తినకూడదు
ఏమితినవచ్చు:- పాతగోదుమలజావ, పాతబియ్యపుజావ,
ముల్లంగి,కొబ్బరి,బొప్పయి,దానిమ్మ
తినవచ్చు

నోటిలోపొక్కులకు

చిన్నకరక్కాయ(పిందె)తీసుకుని సానరయి పై
గంధంలా అరగదీసి ఆగంధాన్నినోటిలొవచ్చె
నంజు పొక్కులపైన లేపనంచేయ్యాలి
ఇలరోజుకు2to3సార్లు లేపనంచెస్తె
నోటిలోపొక్కులు తగ్గిపోతాయి
*నోటిలోపొక్కులకు ఆహారంలోదేశవాళీ
టమొటాలు బాగా వాడాలి*

సీకాకాయ--షాంపు

సీకాకాయపొడి15గ్రా॥,ఉసిరికముక్కలపొడి15గ్రా..
అరలీటరు మంచినీటిలొ వేసి రాత్రినుండిఉదయం
వరకు నానబెట్టాలి
ఉదయంపూట చిన్నమంటపై
అరపావులీటరుకు మరగించి వడపోసిగోరువెచ్చగా
తలవెంట్రుకల కుదుళ్ళుకు సున్నితంగా లేపనంచేసి
10to20నిముషాలు ఆగిస్నానంచేయాలి
ఇలా వారానికి1to2సార్లు చేస్తె వెంట్రుకలుఊడటం
ఆగి కుదుళ్ళు గట్టిపడి జుట్టుఆరోగ్యగా పొడవుగా చిక్కగా
పెరుగుతుంది

చర్మరోగాలకు

వాయింటచెట్టుపూలు రెండురంగులలొదొరకుతాయి
అవి పచ్చన,తెలుపు,
రెండురంగులలొదొరకుతాయి
వీటిని తెచ్చి ముక్కలుచేసి దంచి రసం తీయాలి
ఈ రసంతొ కొబ్బరినూనెగాని,నువ్వులనూనెగాని
కలిపి చిన్నమంట పైన నూనె మిగిలేవరకు మరిగించి
వడపొసి నిల్వ చేసుకొవాలి ఈతైలాన్నిరోజుకు2to3
సార్లుశరిరంపై లేపనంచేస్తె తామర,గజ్జి,చిడుము,దురదలు
పూర్తిగా తగ్గిపోతాయి

మూర్చ--తగ్గుటకు

అవిసెపూలు10గ్రా॥,అవిసెఆకులు10గ్రా॥,మిరియాలపొడి2g..
ఒకేరెబ్బవుండె వెల్లులిపాయ వీటిని పావుకప్పు గోమూత్రంతో
కలిపి మెత్తగా నూరి బట్టలొ వడపోసి రోజూపరగడుపునసేవించాలిదీనినే2to3చుక్కలు
ముక్కులొ వేసుకొని పీల్చాలి।ఇలాచేస్తుంటే
మూర్చా,అపస్మారం,హరించుకుపోతాయి

అతికొవ్వు(లావు)--తగ్గుటకు

తక్కలిచెట్టు పూలరసంగాని,ఆకురసంగాని,ఒకటి,
రెండు,చెంచాలమోతాదుగా సమంగాతేనె కలిపి
రెండుపూటలా ఆహారానికి గంటముందుసేవిస్తే
అతి బలుపు అతివాతం,హరించుకుపోయి
శరీరం సమంగా తయారౌతుంది

25, ఆగస్టు 2009, మంగళవారం

నేలతాడితో--కలరానిర్మూలన

నేలతాడిదుంపలను బియ్యంకడిగిన నీటితో మెత్తగా నూరి
బొడ్డులోపల,బొడ్డుచుట్టూ చిక్కగా పట్టువేస్తుంటె
కలరావ్యాధి నశించిపోతొంది

చింతాకుతో--కలరా--నిర్మూలన

చింతాకురసం పావులీటరు,మిరియాలపొడి5గ్రా..
నువ్వులనూనె 10చుక్కలు తీసుకుని కలిపి
వేడిచేసి దించి చల్లార్చి తగితే అప్పటికప్పుడు
కలరాహరించుకు పోతుంది

కలరా,వాంతులు--నిర్మూలన

బాగాశుబ్రంచేసిన సోపుగింజలు30గ్రా..రోటిలోవేసి
తగినంత కలబంద గుజ్జురసం కలిపి ఒకరోజంతా బాగా
నూరి రసంఇగిరిపొతె మరలా రసంపొసి నూరుతూ
24గంటలు తరవాత ఆముద్దను బఠాణీగింజంతగోళీలుగా
చేసి నీడలొ బాగా గాలితగిలేలాఎండబెట్టి నిల్వవుంచుకోవాలి
ఈ మాత్రలు పూటకు ఒకటి చొప్పున రెండు పూటలూసేవిస్తే
వాంతులు తగ్గిపొతాయి

చలువమిరియాలతొ--కలరానిర్మూలన

చలువమిరియాలురెండున్నరగ్రాములు,మామూలుమిరియాలు
2గ్రా..,వేపపువ్వు
రెండున్నరగ్రాములు,సైందవలవణం10గ్రా..
కలిపి కొంచెం నలగ్గొట్టి ఒకలీటరు నీటిలొవేసి అరలిటరు కషాయానికి
మరిగించి వడపోయాలి
ఈ కషాయాని అరగంఅటకు ఒకసారి50గ్రా..పెద్దలకు తాగించాలి.
ఈవిధంగా కషాయం అంతా అయిపొయేవరకు ప్రతి
అరగంఅటకు ఒకసారి
సెవిస్తే కలరారోగం నిమిషాల మీద తగ్గిపోతుంది

24, ఆగస్టు 2009, సోమవారం

ఎండుమిరపకాయలతొ--కలరానిర్మూలన

ఎండుమిరపకాయల్ని రోటిలోవేసి తగినన్ని నీరుపోసిమెత్తటి
ముద్దలానూరాలి ఈముద్దను బఠానీగింజంత మోతాదుగాపెద్దలకు
సెనగగింజంత
మోతాదుగా పిల్లలకు జొన్నగింజంతమోతాదుగా
పసిపిల్లలకు తయారుచేసినీడలొ గలికిఆరబెట్టి నిల్వ వుంచుకోవాలి
ఆపదసమయంలొ తయారుచేసినవెంట్నేకూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ మాత్రలను గంటకు ఒకటిచ్చొప్పున మింగి అనుపమానంగా
లవంగకషాయం పెద్దలకు50గ్రా..పిల్లలకు25గ్రా..
పసిపిల్లలకు10గ్రా..
మోతాదుగా తాగించాలి.ఇలా రోగస్తాయినిబట్టి 5మాత్రలు మింగితే
ప్రాణాలపై ఆశవదులుకున్న ఆఖరిసమయంలొకూడా ఈమాత్రలు
కలరా రోగులను కాపాడతాయని పెద్దలుసెలవిచ్చారు.
లవంగకషాయంతయారీవిధానం:-ఒకగ్లాసులొ 3to4లవంగాలు
వేసి సగానికి మరిగించి వడపోసుకోవాలి ఈకషాయాన్ని చల్లగా
చేసిపైన తెలిపినట్లు ఉపయోగించుకోవాలి

సొంటితో

సొంటి దోరగావేయించిదంచినపొడి3గ్రా..
ప్రత్తిగింజలపొడి3గ్రా..,నల్లనువ్వులపొడి3గ్రా..వీటిని
నాటు ఆవుమూత్రంతో మెత్తగానూరి ఆముద్దను వాచివున్న
వ్రుషణంపై పట్టులాగవేసి బట్టతోకడుతూవుంటేనాలుగైదుపట్లు
వేసేటప్పటికి అండకోశాలవాపు,పోటు హరించుకుపోతాయి

ఆముదంతో--విరేచనం

4చెంచాల వంటాముదం,2చెంచాలతేనె,2చెంచాలఅల్లంరసం
కలిపి 3సార్లుపొంగించి దించి గోరువెచ్చగా అయిన తరువాత
తెల్లవారుఝామున అండవ్రుద్ది(బుడ్డ)రోగులుసేవించాలి.
దీనివల్లసుఖవిరోచనంజరిగి అండవాయువు ఉపశమనం కల్గుతుంది

ఒరిబీజ(బుడ్డ)నివారణ--ఆహారనియమాలు

పాటించవల్సినవి:-సుఖవిరోచనం,లేక ఇనేమాచేసుకోవడం
చెమతరప్పించడం,ఆహారంలొఆముదంవాడటం,
రోజూగోమూత్రం సేవించడం,మునక్కాయ,పొట్లకాయ,
గలిజేరుకూర,ఉల్లిగడ్డ,వెల్లుల్లి,తేనె,మజ్జిగ,గోరువెచ్చనినీరు,
కుండలొకాచిననేయ్యివాడటం,తాంబూలంవేసుకోవడం ,వంటివిపాటించాలి
పాటించకూడనివి:-మాంసం,పెరుగు,మినుములు,
ఉడకని,చల్లని,అన్నము
బచ్చలికూర,త్వరగా అరగని పదార్దాలు సేవించరాదు.

కరక్కాయతొ---ఒరిబీజ(బుడ్డ)నివారణ

కరకబెరడు,సొంటి,గసగసాలు,తెగడ,వీటినిసమబాగాలుగా
తీసుకుని దంచిపొడిచేసి ఆపొడిని మేలిరకమైన వంటాముదంతొ
కలిపి మెత్తగానూరి లేహ్యంలాగా తయారుచేసుకుని నిల్వుచేసుకొవాలి
ఈలేహ్యాన్ని రోజూపరగడుపున 5గ్రా..మోతాదుగా తింటూవుంటే
అన్నిరకాల అండవ్రుద్దులు అద్రుశ్యమైపోతాయి

వాకుడుతో---ఒరిబీజ(బుడ్డ్)నివారణ

వాకుడుచెట్టువేర్ల పై తోలు10గ్రా..మిరియాలు7,కలిపిమెత్తగానూరి
దీన్ని ఒకమొతాదుగా పరగడున మంచినీటితొ 7రోజులు సెవిస్తె
ఒరిబీజ(బుడ్డ్)నివారణమౌతాయి

ఒరబీజం--నివారణ

కరక్కాయముక్కలు 3గ్రా..దోరగావేయించినపిప్పళ్ళు3గ్రా..
సైంధవలవణం3గ్రా.. వీటిని దంచి చూర్ణంచేసి ఒకచెంచా
వంటాముదంతో కలిపి పరగడుపునసేవిస్తే బుడ్డలు హరించుకుపోతాయి

ఒరబీజ-లేపనాలు,కట్లు

  • ఈతచెట్టుబొర్రలొ ఉండె గుజ్జును మెత్తగా నూరి ఒరబీజంపైనకట్టుకట్టాలి
.లేతకొబ్బరిని మెత్తగతురిమి కొంచెంవేడిచేసి బట్టలొపరిచి వాచిన
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.గోగూర గానిబంతిఆకులుగానినీటిఆవిరిపైఉడకబ్బెట్టితొక్కిగోరువెచ్చగా
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.ఏకట్టు కటినా రోజుకునాల్గుగైదు కట్లుమార్చాలి.
ఈవిధంగా చెస్తే క్రమంగావాపు పోటు తగ్గిపోతాయి

గర్బస్రావం జరకుండా--ఏంచేయ్యాలి

దానిమ్మచెట్టువేర్లు,ఆకులు,మానుపైబెరడు,పువ్వు,కాయ
వీటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా దంచి ఆపదార్దానికి
నాలుగురెట్లు నీరుపోసి ఒకవంతుకషాయం మిగిలేవరకూ
మరగబెట్టాలి వడపోసి శుబ్రమైన పాత్రలొపోసి దానికి రెండురెట్లు
కండచెక్కెర కలిపి చిన్నమంటపై తేనెపాకం వచ్చేవరకూ మరిగించి
దించి చల్లార్చి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ దానిమ్మపాకాన్ని
రోజుకు నాల్గుగైదు సార్లు5గ్రా...మోతాదుగా ఒకకప్పు మంచినీటితో
కలిపి తాగితే గర్బస్రావం జరగదు*ఈపాకం రక్తవిరేచనాల సమస్య కూడా
పోగొడుతుంది

23, ఆగస్టు 2009, ఆదివారం

వాక్ సౌందర్యానికి

మాటలుపూర్తిగా రాని పిల్లలకు మూగ,చెవిటి,కఫంఅధికంగా
ఉండి మూర్ఛ రోగముండే పిల్లలకు కాళు ,చేతులు చచ్చుబడి
నరాలబలహీనతతో బాధపడెపిల్లలకు,నత్తి,నంగి,స్వరబేధములతో
అవస్తపడె చిన్నారులకు ఈ వాగ్దేవీరసాయనం అద్బుతంగాపనిచేస్తుంది
తయారీవిధానం:-వసకొమ్ములను కావలిసినన్ని తెచ్చి ఒకరోజంతా
మంచినీటిలో నానబెట్టి తీసి తుడిచి మెత్తగానలగగొట్టి దంచి జల్లించి
వస్త్రఘూళితం చేసి అతి మెత్తని వసచూర్ణంతయారుచేసుకోవాలి
ఈచూర్ణాన్నిశుబ్రంచేసిన కొత్తకుండలొపోసి తగినంత తేనె కలిపి పిసికి
ఆముద్దకుపైన రెండు అంగుళాఎత్తుగవుండేటట్లు మరికొంత తేనెపోసి
పైన మట్టిమూకుడు మూసి దళసరి నూలుబట్ట3to4 వరుసలు
మూతపైన పరిచి తాడుతో గట్టిగా గాలిచొరబడకుండా కట్టుకట్టాలి .
ఈ పాత్రను గాలిచొరబడకుండా40రోజులపాటువుంచి తీసి వేరే గాజుపాత్ర
లోనిలువచేసుకోవాలి
దీన్నిపిల్లల వయసునుబట్టి అరగ్రాము నుండి ప్రారంభించి కొద్దికొద్దిగా
పెంచుతూ 1,or 2,గ్రా..మోతాదుగా రెండుపూటలా సెవింపచేస్తుంటె
మంచి ఫలితాలు కలుగుతాయి

ముఖకాంతికి

కలువరేకులపొడి ,అతిమధురంపొడి, మంచిపసుపుకొమ్ములపొడీ,
వేపాకులపొడీ. సంమంగా కలిపి నిలువచేసుకోవాలి ఈమిశ్రమాన్ని
తగినంత తేనెతొ మెత్తగా నూరి ముఖానికి రాసుకుని ఆరినతరువాత
కడుగుకుంటే ముఖసౌందర్యంపెరుగుతుంది

22, ఆగస్టు 2009, శనివారం

బొల్లిమచ్చలు

ఒకపాత్రలొ అరలీటరు మంచినీరు పోసి అందులొ ఉసిరికాయ పెచ్చులు
10.గ్రా..,కాచు10.గ్రా.. వేసి చిన్నమంటపైన పావులీటరు కషాయం
మిగిలే వరకు మరిగించాలి.వడపోసి ఆకషాయాన్ని రెండుభాగాలుగాచేసి
రెండూపూటలా సగం సగం కషాయం తాగేముందు అందులో పావుచెంచా
బావంచాలపొడి కలిపి తాగాలి ఈవిధంగా రోజూచేస్తెబొల్లిమచ్చలు తగ్గి
మామూలు చర్మం లా అవుతుంది

మనోసౌందర్యానికి

కొంతమందికి శరీరంలొ పైత్యం అతిగా ప్రకోపించి తనచుట్టూ వున్నవాళతో
గొడవలు పడుతు ఇబ్బందులు సృష్ఠిస్తుంటారు వారికి
పుచ్చకాయ తెచ్చి సగానికి కోసి లోపలున్న గుజ్జునుకొంతవరకు
తీసి తలకు టోపీ లాగా అమర్చాలి ఇలా15 నిముషాలు పాటుచేస్తే
పుచ్చకాయలొని చలువగుణం తలలోకి ప్రవేశించి పైత్యాన్ని తగ్గించటంతొ
పాటూ మనోసౌందర్యాన్నిపెంపొందిస్తుంది
పుచ్చకాయ దొరకకపోతే ముడిపెసలు నీటిలొ నానబెట్టి ఉడకబెటి
మెత్తగా పప్పులాగ రుబ్బి ఆముద్దను చల్లగా అయిన తరువాత
తలపైన పట్టులాగావేయాలి ఇలాచేయడంవల్ల తలలోని పైత్యం
తగ్గిమామూలు మనుషులౌతారు

మొటిమలు--నివారణ

(1).మంజిష్ఠ,తేనె కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
(2).మద్దిచెట్టు బెరడు,తేనే
కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
(3).జాజికాయ,చందనం
కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకుని ఉదయం
గోరువెచ్చని నీటితోకడుగుతూ వుంటే మొటిమలు తగ్గి
ముఖసౌందర్యంపెరుగుతుంది

21, ఆగస్టు 2009, శుక్రవారం

చుండ్రు-నివారణ

మందారపూలు మెత్తగాదంచి బట్టలోవేసి పిండినరసం పావుకేజి
నువ్వులనూనె
పావుకేజి కలిపి చిన్నమంటపైన నూనె మత్రమే
మిగిలే వరకు మరిగించి వదపోసి నిలువవుంచుకోవాలి
రోజూ ఈ తైలాన్ని తలకు రాస్తుంటె క్రమంగా చుండ్రు తగ్గిపోతుంది

అతిచెమత,అతిదుర్వాసన--తగ్గుతకు

కరక్కాయలపొడి,తులసిఆకులపొడి,వేపాకుపొడి,
మారేడుఆకులపొడి,తగినన్నినీరు కలిపి మెత్తగానూరి
స్నానానికి గంటముందు శరీరమంతా నలుగుపెట్టుకోవాలి
ముఖ్యంగా చంకలు,తొడలు,గజ్జలు,పిరుదులు,గొంతు,మెడ,
పొట్ట ఈభాగాలలో బాగారుద్ది అదిపూర్తిగా ఆరినతరువాత
గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే క్రమంగాఅతిచెమత,అతిదుర్వాసన
తగ్గిపోయి చర్మసౌందర్యం పెరుగుతుంది

మంచి వెంట్రుకలకు -మంచి నియమాలు

అతికారం,అతిఉప్పు, వెంట్రుకలను పాడుఛేస్తుంది.
బాగా తగ్గించి వాడాలి.షాంపులను,సబ్బులను,తలకు,రుద్దవద్దు.
రోజూ కూరలతయారీలో నువ్వులనూనె వాడండి.బెల్లం,నువ్వులతో
చేసిన లడ్లు,కొబ్బరిలడ్లు,మినుపసున్నుండలు,పాతబెల్లంతయారు
చేసినవి.రెండుపూటలా బిడ్డలతో తినిపించండి.తలస్నానంచేసినప్రతిసారి
దువ్వెన శుబ్రంచేయాలి దిండ్లపైకవర్లు మారుస్తుండండి

దంత రోగాలకు-ధారుడ్యమైన పండ్ల పొడి.

పొంగించిన పటికపొడి 50గ్రాములు , మెత్తగా నూరి జల్లించని తుమ్మ బొగ్గుల పొడి 50గ్రాములు తీసుకుని ఈ మూడింటినీ కలిపి మరొకసారి జల్లించుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ పండ్ల పొడితో రోజూ పళ్ళు తోమి పావుగంట ఆగి కడుగుతూ వుంటే కదిలే పళ్ళు కూడా గట్టి పడతాయి.పళ్ళ పై ఉండే గారా , పాచి పూర్తిగా తొలగిపోతాయి మరియూ దాంతాలకు మెరుపు వస్తుంది.

రక్తపోటుకు - రంజైన పానీయం....


కావలసిన పదార్దాలు :- అల్లంరసం రెండు చెంచాలు,ధనియాల రసం రెండుచెంచాలు,నిమ్మరసం రెండు చెంచాలు,నీరు ఒక గ్లాసు..
తయారీ విధానం :-అల్లాన్ని మంచినీటితో దంచి రసం తీసి గాజు పాత్రలో పోసి కొంచెం సేపు నిలవ ఉంచాలి.అడుగున ముద్దలాగా పేరుకుని అసలైన రసం పైకి తెలుతుంది.అలా పైకి తేలిన ఆ నిజ రసాన్ని జాగ్రత్తగా వుంచుకొని రెండు చెంచాల మోతాదుగా గ్రహించాలి.అలాగే ధనియాలు,మంచినీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి రెండు చెంచాల రసం తీసుకోవాలి.అదే విధంగా నిమ్మ పండును పిండి విత్తనాలు లేకుండా రెండు చెంచాల రసం తీసుకోవాలి.ఈ మొత్తాన్ని మంచినీటితో కలపాలి.
వాడే విధానం :- రక్తపోటు తక్కువగా ఉన్నవారు పై మోతాదులో సగం మోతాదుగా రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అధికంగా ఉన్నవారు పూర్తిమోతాదుగా రెండుపూటలా తాగాలి.ఇలా నలభై రోజులు సేవిస్తూ కారం,ఉప్పు,ఆహారంలో బాగా తగ్గించి మనసును ప్రసాంతంగా ఉంచుకుని జాగ్రత్తగా ఉంటే రక్తపోటు పూర్తిగా అదుపులోకి వస్తుంది...

కొవ్వును తగ్గించే - గో మూత్రం

ఏడు సార్లు వడపోసిన ఆవు మూత్రం లేదా ఆవు మూత్రంతో వండిన గోమూత్ర ఆర్కం 20 గ్రాములు,మంచితేనె 10గ్రాములు,త్రిఫలకల్పం పొడి 10గ్రాములు కలిపి రోజూ పరగడుపున సేవిస్తుంటే శరీరంలో అతిగా అనవసరంగా పెరిగిన కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది...............

అందమైన, ఆరోగ్యమైన-

నీదలో ఎండించిన లేతతుమ్మ ఆకులపొడి 100గ్రా;
తామరగింజలపప్పుపొడి 20గ్రా;కండచెక్కరపొడి 120గ్రా..
కలిపివుంచుకోవాలి.గర్బిణీ స్త్రీలకు మూడునెలలునిండీ
నాల్గోనెల మొదలైనరోజునుండి 40రోజులపాటుపావుచెంచా
పొడి ఒకకప్పు వేడిపాలలొ కలిపిగోరువెచ్చగా తాగితె అందమైన
సంతానంతానం కల్గుతుంది

గర్బిణీ స్త్రీ లకు -ఆకలితగ్గితే

ఓమ 50గ్రా;సొంటి50గ్రా; పిప్పళ్ళు50గ్రా;జీలకర్ర50గ్రా;
సైంధవలవణం 25గ్రా" తీసుకుని దోరగా వేయించిజల్లించి
నిలువచేసుకొవాలి పూటకు పావుచెంచాపొడి మోతాదుగా
ఒకచెంచా తేనెతొ కలిపి ఆహారానికి గంటముందు తీసుకుంటే
బాగా ఆకలి పుడుతుంది

20, ఆగస్టు 2009, గురువారం

గర్బిణీస్త్రీల--వాంతులకు

40గ్రా..ధనియాలు నలగగొట్టి ఒకగ్లాసు బియ్యం కడిగిన నీటిలొవేసి ఒకకప్పు
కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి అందులో ఒకచెంచా
కండచెక్కరపొడి కలిపి తాగితె వాంతులు వికారం తగ్గిపోతాయి

మలబద్దకానికి--మంచి చిట్కాలు

(1)* రాత్రిపూట నిద్రించేముందు బాగా వేడిగా వున్న మంచినీటిలో 3చెంచాలు
నేయ్యివేసి గిలకొట్టాలి .ఆనీటిని తాగితె ఉదయం సులువుగా విరొచనం అవుతుంది
(2)*
నిద్రించేముందు పావులీటరు వేడిపాలుతాగితె ఉదయం సులువుగా విరొచనం అవుతుంది
నిద్రకూడాసుఖంగా పడుతుంది
(3)* అతిమలబద్దకంతో బాధపడేవారు 3పూటలా 2నిమ్మకాయలరసం అరకప్పునీటిలొ కలిపి
తాగితె రాళ్ళలాగ గట్టిపడ్డ మలం కూడా కరిగి సులువుగా విరొచనం అవుతుంది అయితె,
కొత్తగా మొదలు పెట్టెటపుడు ఒకేసారి 2నిమ్మకాయలు కాకుండా 1కాయతో ప్రారంబించి
సులువుగా విరొచనం అవుతుంటే 2వ కాయ అవసరం వుండదు. అవసరమైతేనె 2వకాయ
ఉపయోగించాలి

కాలినగాయాలకు

గుంతలలొకాని, చెరువులలోగాని నిలువవున్న నీటిఅడుగున పేరుకునివుండే
మెత్తనిమట్టిని తీసుకువచ్చి అందులొ కొంచెంమెత్తగా నూరిన ఉప్పును కలిపి
పైన పట్టిస్తూ ఉంటే కాలినమంటలు వెంటనే శాంతిస్తాయి.

తగ్గిన మగతనాన్ని-పెంచేయోగం

రోజూ రెండుపూటలా ఒకనీరుల్లిగడ్డను చిన్నిచిన్నిముక్కలుగా తరిగి కల్తీలేని
ఆవునేతిలో వేయించి ఆ ముక్కలను రొట్టెతొ గాని అన్నం తో గాని కలిపితినాలి
ఈ విధంగా 40to60 రోజుల పాటుతింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తె
తగ్గిన మగతనం మరలా పెరుగుతుంది

అన్నంతినగానేవచ్చే-కడుపునొప్పికి

అల్లంరసం ఒకచెంచా, నువ్వులపొడి ఒకచెంచా, బెల్లం10గ్రా.. కలిపి
ముద్దలాగా నూరి బుగ్గనపెట్టుకొని చప్పరించాలి
ఇలా రెండుపూటలా చేస్తుంటె బొజనం చేయగానే వచ్చే కడుపునొప్పితగ్గుతుంది

సుఖవిరోచన-గుటికలు

రేవలచిన్ని ,సొంటి ,మూసాంబరం ఈ మూడు సమభాగాలుగా తీసుకోవాలి.
సొంటిని వేయించి పొడిచేసుకోవాలి
ముసాంబరం,రేవలచిన్ని విడివిడిగా దంచి పొడిచేసుకోవాలి తరువాత
మూడు చూర్ణాలను కలిపి తగినన్ని మంచినీటితో మెత్తగాదంచి సెనగగింజలంత
గోల్లీలుచేసి నీడలొ గాలికి ఆరబెట్టాలి
బాగాఎండిన తరవాత నిలువచేసుకుని రోజూ నిద్రించేముందు మంచినీటితో ఒకమాత్రవేసుకుని
అరకప్పుపాలు గాని గొరువెచ్చని నీరు గాని తాగుతుంటే ఉదయం లేవగానే సుఖవిరేచనం అవుతుంది

విషంతాగినవారికి-ప్రధమచికిత్స

పొరపాటు గాగాని కవాలనిగాని విషాన్ని తాగినవారికి వెంటనే ప్రధమచికిత్స చేయాలి
వసచూర్ణం, ఉప్పుచూర్ణం, కలిపి 3to5గ్రాము మోతాదుగా అరలీటరు వేడినీటిలో కలిపి
తాగగలిగినంత వేడిగా బలవంతంగానైనా తాగించాలి ఇది లోపలికి వెళ్ళగానే క్షణాల్లోనే
వాంతిరూపంలొ కడుపులోవున్న విషాన్నికూడాలక్కుని బయటకు వస్తుందిఈవిధంగా
ప్రాణాపాయస్ఠితిని తప్పించవచ్చు

గుండెదడ,దుడుకుతగ్గుటకు

ప్రశస్తమయిన పొంగించిన ఇంగువ 20గ్రా
కల్తీలేని హారతికర్పూరం 20గ్రా ,,.తీసుకుని కొంచెం మంచినీటి తొ ఈ రెండు పదార్ధాలు
బాగా కలిసిపోయి ముద్ద అయ్యేవరకు నూరి చిన్నచిన్న శనగగింజలంత గోలీలు గా తయారుచేసి
నీడ లో గాలి తగిలేచోట ఆరబెట్టి రెండుపూటలా పూటకు ఒక మాత్ర మంచినీటితో వేసుకోవాలి
అనుపానంగా రెండుకప్పుల మంచినీటిలో రెండుగ్రాముల జటామాంసి వేసి ఒక కప్పుకు మరిగించి
వదపోసి ఆ కసాయాన్ని గోరువెచ్చగా తాగాలి ఈ విధంగా రెండుపూటలా సేవిస్తే పై సమస్యలుపరిస్కరమౌతాయి

19, ఆగస్టు 2009, బుధవారం

వృద్దాప్యానికి-విరుగుడు

వృద్దాప్యానికి-విరుగుడు...
పండిన మేడిపండ్ల లొని గింజలను సేకరించుకుని కడిగి ఎండబెట్టి దంచి జల్లించి
పలుచని నూలుబట్టతో వస్త్రఘుళితం చేసి నిలువవుంచుకొవలి
ఈచూర్ణాన్ని ఉదయం పరగడుపున రాత్రి ఆహారానికి రెండుగంటల ముందు ఒకసారి
మూడుగ్రాములు మోతాదుగా రెండు చెంచాల ఆవునేతి తో కలిపి తింటూవుండలి
ఈ విధంగా 100 రోజులు పాటు చేస్తే ఖచ్చితం గా వృధులకు కూదా యవ్వనం ప్రాప్తిస్తుంది

17, ఆగస్టు 2009, సోమవారం

ఎప్పుడు ఆరోగ్యంగా వుండటానికి

ఎప్పుడు ఆరోగ్యంగా వుండటానికి
అరగ్లాసు పాలలో సుగందపాలవేర్ల పొడి;6గ్రా"
దొరగా వేయించిన ధనియాలపొడి..;4గ్రా'
దంచిజల్లించిన సొంటిపొడి ...2గ్రా కలిపి
మూడు పొంగులు వచేవరకు మరిగించి దించివడపోసి అందులో తగినంత కండచెక్కర
పొడి కలిపి ప్రతీరోజూ పరగడుపున సేవిస్తే శరీరం లొని వాత,పిత్త,కఫాలు రక్తం సమంగా పరిశుదంగా వుండి
వ్యాది నిరోదక శక్తిని పెంచుతూ ఎల్లప్పుడు ఆరోగ్యంగా వుంటారు

వడదెబ్బ-చిట్కాలు

వడదెబ్బ తగిలినవారికి నీరుల్లి గడ్డలను దంచి తీసినరసం
ముఖం పైన రెండు కణతలకు గుండెకు రాసి సున్నితంగా
మర్దనాచేస్తే వడదెబ్బ తగిలినవారు ఉపశమనం పొందగలరు

About

shotmix


ShoutMix chat widget

online