23, ఆగస్టు 2009, ఆదివారం

వాక్ సౌందర్యానికి

మాటలుపూర్తిగా రాని పిల్లలకు మూగ,చెవిటి,కఫంఅధికంగా
ఉండి మూర్ఛ రోగముండే పిల్లలకు కాళు ,చేతులు చచ్చుబడి
నరాలబలహీనతతో బాధపడెపిల్లలకు,నత్తి,నంగి,స్వరబేధములతో
అవస్తపడె చిన్నారులకు ఈ వాగ్దేవీరసాయనం అద్బుతంగాపనిచేస్తుంది
తయారీవిధానం:-వసకొమ్ములను కావలిసినన్ని తెచ్చి ఒకరోజంతా
మంచినీటిలో నానబెట్టి తీసి తుడిచి మెత్తగానలగగొట్టి దంచి జల్లించి
వస్త్రఘూళితం చేసి అతి మెత్తని వసచూర్ణంతయారుచేసుకోవాలి
ఈచూర్ణాన్నిశుబ్రంచేసిన కొత్తకుండలొపోసి తగినంత తేనె కలిపి పిసికి
ఆముద్దకుపైన రెండు అంగుళాఎత్తుగవుండేటట్లు మరికొంత తేనెపోసి
పైన మట్టిమూకుడు మూసి దళసరి నూలుబట్ట3to4 వరుసలు
మూతపైన పరిచి తాడుతో గట్టిగా గాలిచొరబడకుండా కట్టుకట్టాలి .
ఈ పాత్రను గాలిచొరబడకుండా40రోజులపాటువుంచి తీసి వేరే గాజుపాత్ర
లోనిలువచేసుకోవాలి
దీన్నిపిల్లల వయసునుబట్టి అరగ్రాము నుండి ప్రారంభించి కొద్దికొద్దిగా
పెంచుతూ 1,or 2,గ్రా..మోతాదుగా రెండుపూటలా సెవింపచేస్తుంటె
మంచి ఫలితాలు కలుగుతాయి

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online