21, ఆగస్టు 2009, శుక్రవారం

రక్తపోటుకు - రంజైన పానీయం....


కావలసిన పదార్దాలు :- అల్లంరసం రెండు చెంచాలు,ధనియాల రసం రెండుచెంచాలు,నిమ్మరసం రెండు చెంచాలు,నీరు ఒక గ్లాసు..
తయారీ విధానం :-అల్లాన్ని మంచినీటితో దంచి రసం తీసి గాజు పాత్రలో పోసి కొంచెం సేపు నిలవ ఉంచాలి.అడుగున ముద్దలాగా పేరుకుని అసలైన రసం పైకి తెలుతుంది.అలా పైకి తేలిన ఆ నిజ రసాన్ని జాగ్రత్తగా వుంచుకొని రెండు చెంచాల మోతాదుగా గ్రహించాలి.అలాగే ధనియాలు,మంచినీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి రెండు చెంచాల రసం తీసుకోవాలి.అదే విధంగా నిమ్మ పండును పిండి విత్తనాలు లేకుండా రెండు చెంచాల రసం తీసుకోవాలి.ఈ మొత్తాన్ని మంచినీటితో కలపాలి.
వాడే విధానం :- రక్తపోటు తక్కువగా ఉన్నవారు పై మోతాదులో సగం మోతాదుగా రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అధికంగా ఉన్నవారు పూర్తిమోతాదుగా రెండుపూటలా తాగాలి.ఇలా నలభై రోజులు సేవిస్తూ కారం,ఉప్పు,ఆహారంలో బాగా తగ్గించి మనసును ప్రసాంతంగా ఉంచుకుని జాగ్రత్తగా ఉంటే రక్తపోటు పూర్తిగా అదుపులోకి వస్తుంది...

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online