8, నవంబర్ 2009, ఆదివారం

రోగులు,అల్పాయువులైన సంతానం ఎందుకు కల్గుతారు

మనపెద్దలు సూచించిన ప్రకారం స్త్రీవయస్సు.. 16years పురుషునకు 20years నిండివుండాలని ఆఇరువురిశరీరాలువాత, పిత్త, కఫాలచేత దూషించబడనికాలంలో సంభోగం జరిపితే అతిశక్తివంతమైనసంతానంకలుగుతుందని తెలియచేసారు.
అలాకాకుండా తక్కువ వయస్సుగల స్త్రీలేదాపురుషులు సంతానార్దమై సంభోగం జరిపినపుడు అల్పమైన వారిఆర్తవాలసంయోగం వల్ల రోగులు,అల్పాయువులైన సంతానం కల్గుతారు
అయితే కొన్ని సందర్బాలలో చిన్నవయస్సులో పెళి చేసుకున్న దంపతులకు పుట్టినపిల్లలు పూర్ణాయుషువంతులుగావుండటంకూడా ఎక్కడొ కొన్ని చోట్ల మాత్రమేజరుగుతుంది ఎక్కువచోట్లబలహీనమైనసంతానంకలుగుతుంది కాబాట్టి మనపెద్దలు స్త్రీ,పురుషుల వివాహ వయిస్సునిర్దారించిచెప్పారు.

విక్రుతశిశువులుఎందుకుపుడతారు...?

స్త్రీ పురుషులు సంభోగ సమయంలో వారిశరీరంలో వాత, పిత్త, కఫాలు ప్రకోపించి వుండటంవల్లగాని లేదా స్త్రీ,పురుషుల అర్తవ వీర్యాలు బీజంగా ఏర్పడ్డ సమయంలో వాత, పిత్త, కఫాలు ప్రకోపించి వుండటంవల్లగాని ఏదోష ప్రాబల్యంఅధికంగావుంటే ఆదోషానికి ప్రతిరూపంగా అనేకరకాల జంతువుల ఆకారంలొ గల శిశువులుగాని విక్రుతమైనావయవాలుగల శిశువులుగానిజన్మిస్తారని పెద్దల తెలియచేసారు.
అందువల్ల ఉత్తమమైన సంతానాన్నికోరేవారు ప్రశాంతమైన మనస్సుతో సంభోగం జరపాలని పెద్దలు శేలవిచ్చారు

ఆడ, మగ, నపుంసక..సంతాన బేదాలు

స్త్రీ,పురుషులు సంభోగంలో పురుషునియొక్క వీర్యబలం అదికంగా ఉండి స్త్రీయొక్క రేతస్సుతక్కవగావుంటె ఆసమయంలొగర్బంఏర్పడితె మగశిశువు జన్మిస్తాడు.
అదేవిధంగా సంభోగ సమయంలో స్త్రీ యొక్క ఆర్తవం అధికబలంగావుండి పురుషుని శుక్రము తక్కువబలంగావుంటే స్త్రీ శిశువు జన్మిస్తుంది.
అలాకాకుండా స్త్రీ,పురుషులు ఆర్తవాలుసమానంగావుంటే నపుంశకులు పుడతారని కొందరు మహార్షులువిశదీకరించారు
మరికొందరివిశ్లేషణ
స్త్రీ పురుషుల సంభోగసమయంలొ పురుషుడు తనవీర్యాన్ని స్త్రీ కన్నాముందుగావిసర్జించినయెడల వారికి మిక్కిలిబలవంతుడు, ద్రుఢమైన శరీరంకలవాడు వీరుడైన మగశిశువు జన్మిస్తాడు.
అలాకాకుండా సంభోగసమయంలొ పురుషునికన్నాముందుగా స్త్రీ ఆర్తవాన్ని విడచిపెట్టినప్పుడుగర్బం ఏర్పడితేవారికిమిక్కిలి ద్రుఢశరీరంగల సౌందర్యవతిఅయిన ఆడపిల్ల జన్మిస్తుంది

7, నవంబర్ 2009, శనివారం

గర్బంఎలావ్రుద్దిచెందుతుంది

తల్లిభుజించిన ఆహారరసంలోని భూమి, నీరు,అగ్ని, వాయువు, ఆకాశము అనె పంచభూతాల సూక్ష్మమైన అంశాలచేత గర్బంవ్రుద్ది చెందుతూ ఉంటుంది.

గర్బోత్పత్తివిధానం

ఈనాటియౌవ్వనవంతులైన ఆధునిక స్త్రీ పురుషులకు గర్బంఎలఏర్పడుతుంది..?అనేఅంశం పై ఏమాత్రం అవగాహనలేదు
పురుషునికి ఆహారంద్వారాఉత్పన్నమయ్యె ఏడవదాతురూపం వీర్యం. అలాగే స్త్రీలకు ప్రతినెలా ప్రసవమార్గంగుండా
ప్రసరించెరక్తంఆర్తవం.ఈ ఆర్తవం కొంచెంనలుపురంగుతో ఏ వాసనా లేకుండా గర్బాశయంలోని వాయువుచేత ప్రేరేపింపబడి నెలనెలా మూడులేకనాలుగు రోజులపాటు యోనిమార్గంగుండా బహిష్కరింపబడుతుంది.
జీవుడుతాను పూర్వజన్మలోచేసిన శుభాశుబకర్మలచేతప్రేరితుడై తల్లితండ్రులవీర్య ఆర్తవములయందు యుక్తిగా ప్రవేశించి గర్బంలో చేరుతుంటాడు. ఆరణిలొ జమ్మిచెక్క,రావిచెక్క,వీటిని మధించినప్పుడు అక్కడలేని అగ్ని ఎలాపుడుతుందో
అదేవిధంగా స్త్రీ పురుషుల సంభోగ మధనసమయంలో జీవుడు యుక్తిగాప్రెవేశిణ్చి గర్బ రూపాన్నిపొందుతాడు
తల్లి తండ్రుల వీర్యము ఆర్తవము గర్బోత్పత్తికి బీజంవంటిది. ఆరెండు ప్రధానపదార్దాలు వాత, పిత్త, కఫాలచేత చెడిపోకుండా ఉన్నపుడు మాత్రమే జీవుడు అందులో ప్రవేశించడానికి గర్బోత్పత్తి జరగడాని అవకాశంఉంటుంది.ఒకవేళ త్రిదోషాలచేత స్త్రీ పురుషులయొక్కవీర్య, ఆర్తవముగాని చెడగోట్టబడీవుంటే జీవుడుప్రవేశంలేక గర్బోత్పత్తి జరగదు

About

shotmix


ShoutMix chat widget

online