27, డిసెంబర్ 2009, ఆదివారం

మూర్చకు మునగవేరు

మునగవేరు పై బెరడును కడిగి ఆరబెట్టి పొడిచేసి నిలువచేసుకోవాలి.
పూటకు వయస్సునుబట్టి అరగ్రాము నుండి మూడుగ్రాముల వరకు ఈపొడిని
నీటిలో కలిపి రెండు పూటలా సేవిస్తుంటే మూర్చ. అపస్మారం తగ్గిపోతాయి.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మగసిరికి --

మగసిరికి --
శీఘ్రస్కలనంతో, నపుంసకత్వంతో, అంగపతనంతో, భాదపడే మగవారు
మునగచెట్టు పూలను తీసుకుని ఒకగ్లాసుపాలను పొయ్యిపై పెట్టి మరిగేటప్పుడు
ఈ పూలను వేసి మూడు పొంగులు పొంగించి దించి వడపోసి తగినంత కండచెక్కెరపొడి
కలిపి ఉదయం పరగడుపునగానీ రాత్రి నిద్రించేముందుగాని త్రాగాలి.
ఇది సేవించేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించి వీర్యాన్ని కాపాడుకోవాలి.దీనివల్ల అపారమైన
వీర్యంచిక్కగా ఉత్పన్నమై పురుఘులకు మగసిరి పెరుగుతుంది.

మునగాకుతో--పట్టు

మునగాకును కఛ్చాపఛ్ఛాగా నలగగొట్టి కొంచెం వంటాముదం వేసి దోరగావేయించి
ఒకబట్టలోవేసి గోరువెచ్చగా వుండేటట్ట్లు నొప్పులపైన వేసి నిద్రించేముందు కట్టుకడుతూవుంటే
అతి తక్కువ కాలంలో ఎంతోకాలంనుండి ఇబ్బంది పెట్టే వాతపట్లు వాపులు తగ్గిపోతాయి.

మునగచెట్టు ఉపయోగాలు

మునగచెట్టు ఉపయోగాలు
మునగచెట్టులేత ఆకులను కూరగా వండి తింటుంటే కొంచెం చిరు చేదుగా,
రుచికరంగాఉండి ఎంతోకాలంగావేధిస్తున్న వాత నొప్పులను హరించివేస్తుంది.
సుఖవిరోచనం కలిగిస్తూ పురుషులకు వీర్యవ్రుధిని, బాలెంతలకు క్షీరవ్రుద్దిని కలిగిస్తుంది.
శరీరంలోని చెడునీరును తీసివేస్తుంది.నేత్రరోగాలు వాతపైత్యదోషాలు,విషాలు హరించిపోతాయి.

స్త్రీలు బహిష్ఠుస్నానం చేయగానే ముందుగా భర్తనే -ఎందుకుచూడాలి...?

స్త్రీలు బహిష్ఠుస్నానం చేయగానే ముందుగా భర్తనే -ఎందుకుచూడాలి...?
స్త్రీలు బహిష్ఠుస్నానంచేసి న నాల్గోరోజున స్నానాలగది నుండి బయటకు రాగానే
ముందుగా భర్త ముఖమే చూడాలి అని శాస్రాకారులు నిర్ణయించారు.
ఆసమయంలో ఎవరి ముఖాన్ని చూస్తారో ఆనెలలో గర్బంధరిస్తే ఆ సంతానానికి
అతని రూపమే ప్రాప్తిస్తుందని తెలియచేసారు.

24, డిసెంబర్ 2009, గురువారం

నియమాలు పాటించని స్త్రీలకు నిష్ఠదరిద్రం - నిండుదరిద్రం.

నియమాలు పాటించని స్త్రీలకు నిష్ఠదరిద్రం - నిండుదరిద్రం.
బహిష్ఠు సమయంలో సంభోగంచేయడం వల్ల గర్భంనిలవకుండాస్రవించిపోతుంది.
బహిష్ఠులో ఏడిస్తే వారికి విక్రుతమైన నేత్రములు కలిగిన సంతానము కలుగుతుంది.
గోళ్ళుకత్తిరిస్తే పిప్పిగోళ్ళుగల సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో నలుగుపెట్టి స్నానంచేస్తే పుట్టేబిడ్డలు కుష్ఠురోగం కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పగటిపూటనిద్రిస్తే నిద్రమొహంగల సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పరుగెత్తడంవల్ల చంచలమైన సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో పెద్దద్వనులువినడంవల్ల చెవిటి సంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో అతిగానవ్వడంవల్ల దవడలు,పళ్ళు, పెదవులు,నాలుక నల్లగాసంతానము కలుగుతుంది.
బహిష్ఠు సమయంలో అతిగా వాగడం,అతిగాశ్రమించడంవల్ల,అతిగా గాలితగలడంవల్ల ఉన్మాదసంతానంకలుగుతుంది.
అని పెద్దలు అనుభవపూర్వకంగాతెలియచేసారు.

మంచి సంతానంకోరే స్త్రీ పాటించవలసిన-బహిష్టు నియమాలు

మంచి సంతానంకోరే స్త్రీ పాటించవలసిన-బహిష్టు నియమాలు
బహిష్టు ప్రారంభమైనరోజునుండి ఆగిపోయే నాలుగోరోజు వరకు స్త్రీలు పూర్తి బ్రహ్మచర్యాన్నిపాటించాలి.
పొరపాటున ఇతరజీవులపైన కాని సాటివారిపైనగాని హింసించకూడదు.దుర్భాషలాడకూడదు.
చాహపైన శయనించండం అవసరం.
ఇంటిలో ఏ పని చేయకూడదు.
భర్తను ముట్టకూడదు.
విస్తరాకులో భోజనంచేయాలి.
ఏకారణాలచేత ఏడవకూడదు.
గోళ్ళుకత్తిరించకూడదు.
వటికి నలుగు పెట్టి స్నానంచేయకూడదు.
పగలు నిద్రించకూడదు.
పెద్దశబ్దంతో మాట్లాడటంగాని, నవ్వటంగాని, చేయ్యకూడదు.
ఆదికంగా శరీరానికి గాలి తగిలేచోట ఉండకూడదు.
పైనియమాలను పాటిస్తే ఉత్తమమైన సంతానంకలుగుతుందని పెద్దలు నిర్దారించారు.

8, నవంబర్ 2009, ఆదివారం

రోగులు,అల్పాయువులైన సంతానం ఎందుకు కల్గుతారు

మనపెద్దలు సూచించిన ప్రకారం స్త్రీవయస్సు.. 16years పురుషునకు 20years నిండివుండాలని ఆఇరువురిశరీరాలువాత, పిత్త, కఫాలచేత దూషించబడనికాలంలో సంభోగం జరిపితే అతిశక్తివంతమైనసంతానంకలుగుతుందని తెలియచేసారు.
అలాకాకుండా తక్కువ వయస్సుగల స్త్రీలేదాపురుషులు సంతానార్దమై సంభోగం జరిపినపుడు అల్పమైన వారిఆర్తవాలసంయోగం వల్ల రోగులు,అల్పాయువులైన సంతానం కల్గుతారు
అయితే కొన్ని సందర్బాలలో చిన్నవయస్సులో పెళి చేసుకున్న దంపతులకు పుట్టినపిల్లలు పూర్ణాయుషువంతులుగావుండటంకూడా ఎక్కడొ కొన్ని చోట్ల మాత్రమేజరుగుతుంది ఎక్కువచోట్లబలహీనమైనసంతానంకలుగుతుంది కాబాట్టి మనపెద్దలు స్త్రీ,పురుషుల వివాహ వయిస్సునిర్దారించిచెప్పారు.

విక్రుతశిశువులుఎందుకుపుడతారు...?

స్త్రీ పురుషులు సంభోగ సమయంలో వారిశరీరంలో వాత, పిత్త, కఫాలు ప్రకోపించి వుండటంవల్లగాని లేదా స్త్రీ,పురుషుల అర్తవ వీర్యాలు బీజంగా ఏర్పడ్డ సమయంలో వాత, పిత్త, కఫాలు ప్రకోపించి వుండటంవల్లగాని ఏదోష ప్రాబల్యంఅధికంగావుంటే ఆదోషానికి ప్రతిరూపంగా అనేకరకాల జంతువుల ఆకారంలొ గల శిశువులుగాని విక్రుతమైనావయవాలుగల శిశువులుగానిజన్మిస్తారని పెద్దల తెలియచేసారు.
అందువల్ల ఉత్తమమైన సంతానాన్నికోరేవారు ప్రశాంతమైన మనస్సుతో సంభోగం జరపాలని పెద్దలు శేలవిచ్చారు

ఆడ, మగ, నపుంసక..సంతాన బేదాలు

స్త్రీ,పురుషులు సంభోగంలో పురుషునియొక్క వీర్యబలం అదికంగా ఉండి స్త్రీయొక్క రేతస్సుతక్కవగావుంటె ఆసమయంలొగర్బంఏర్పడితె మగశిశువు జన్మిస్తాడు.
అదేవిధంగా సంభోగ సమయంలో స్త్రీ యొక్క ఆర్తవం అధికబలంగావుండి పురుషుని శుక్రము తక్కువబలంగావుంటే స్త్రీ శిశువు జన్మిస్తుంది.
అలాకాకుండా స్త్రీ,పురుషులు ఆర్తవాలుసమానంగావుంటే నపుంశకులు పుడతారని కొందరు మహార్షులువిశదీకరించారు
మరికొందరివిశ్లేషణ
స్త్రీ పురుషుల సంభోగసమయంలొ పురుషుడు తనవీర్యాన్ని స్త్రీ కన్నాముందుగావిసర్జించినయెడల వారికి మిక్కిలిబలవంతుడు, ద్రుఢమైన శరీరంకలవాడు వీరుడైన మగశిశువు జన్మిస్తాడు.
అలాకాకుండా సంభోగసమయంలొ పురుషునికన్నాముందుగా స్త్రీ ఆర్తవాన్ని విడచిపెట్టినప్పుడుగర్బం ఏర్పడితేవారికిమిక్కిలి ద్రుఢశరీరంగల సౌందర్యవతిఅయిన ఆడపిల్ల జన్మిస్తుంది

7, నవంబర్ 2009, శనివారం

గర్బంఎలావ్రుద్దిచెందుతుంది

తల్లిభుజించిన ఆహారరసంలోని భూమి, నీరు,అగ్ని, వాయువు, ఆకాశము అనె పంచభూతాల సూక్ష్మమైన అంశాలచేత గర్బంవ్రుద్ది చెందుతూ ఉంటుంది.

గర్బోత్పత్తివిధానం

ఈనాటియౌవ్వనవంతులైన ఆధునిక స్త్రీ పురుషులకు గర్బంఎలఏర్పడుతుంది..?అనేఅంశం పై ఏమాత్రం అవగాహనలేదు
పురుషునికి ఆహారంద్వారాఉత్పన్నమయ్యె ఏడవదాతురూపం వీర్యం. అలాగే స్త్రీలకు ప్రతినెలా ప్రసవమార్గంగుండా
ప్రసరించెరక్తంఆర్తవం.ఈ ఆర్తవం కొంచెంనలుపురంగుతో ఏ వాసనా లేకుండా గర్బాశయంలోని వాయువుచేత ప్రేరేపింపబడి నెలనెలా మూడులేకనాలుగు రోజులపాటు యోనిమార్గంగుండా బహిష్కరింపబడుతుంది.
జీవుడుతాను పూర్వజన్మలోచేసిన శుభాశుబకర్మలచేతప్రేరితుడై తల్లితండ్రులవీర్య ఆర్తవములయందు యుక్తిగా ప్రవేశించి గర్బంలో చేరుతుంటాడు. ఆరణిలొ జమ్మిచెక్క,రావిచెక్క,వీటిని మధించినప్పుడు అక్కడలేని అగ్ని ఎలాపుడుతుందో
అదేవిధంగా స్త్రీ పురుషుల సంభోగ మధనసమయంలో జీవుడు యుక్తిగాప్రెవేశిణ్చి గర్బ రూపాన్నిపొందుతాడు
తల్లి తండ్రుల వీర్యము ఆర్తవము గర్బోత్పత్తికి బీజంవంటిది. ఆరెండు ప్రధానపదార్దాలు వాత, పిత్త, కఫాలచేత చెడిపోకుండా ఉన్నపుడు మాత్రమే జీవుడు అందులో ప్రవేశించడానికి గర్బోత్పత్తి జరగడాని అవకాశంఉంటుంది.ఒకవేళ త్రిదోషాలచేత స్త్రీ పురుషులయొక్కవీర్య, ఆర్తవముగాని చెడగోట్టబడీవుంటే జీవుడుప్రవేశంలేక గర్బోత్పత్తి జరగదు

22, అక్టోబర్ 2009, గురువారం

మర్మాంగబలానికి

ఆలీవ్ తైలంను చుక్కల మోతాదుగా సున్నితంగా లేపనంచేయాలి.
అంగం ముందు బాగాన్నివదిలి వెనుకబాగానికిమాత్రమే నూనె ఇంకేటట్లుగా రుద్ది
ఉదయం స్నానంచేసేటప్పుడు శుబ్రంచేసుకోవాలి.
ఈ విధంగా వరసగా 40 రోజులపాటు చేస్తే అంగబలహీనత, అంగక్రుశత్వం
మొదలైన సమస్యలు హరించుకుపోయి మర్మాంగంద్రుడంగా మారుతుంది

19, అక్టోబర్ 2009, సోమవారం

నీళ్ళవిరోచనాలకు

నీళ్ళవిరోచనాల రోగిని వెల్లకిలాపడుకోబెట్టాలి. ఎండు ఉసిరికాయల పైబెరడు 250gr
తీసుకుని మంచినీటితో మెత్తగా నూరి రోగి బొడ్డు చుట్టూ ఒకచక్రంలాగా పొట్టకు
అతుక్కునేలా అంటించాలి. సిద్దంచేసుకునివున్న అల్లంరసం ఆచక్రం మద్యలో
అనగా నాభి లో ఉండెటట్లు పొయ్యాలి దీనివల్ల లోపలికి ఏ ఔషదం వాడె అవసరం
లేకుండా నీళ్ళవిరోచనాలు కట్టుకుంటాయి

వ్రషణాలకు లేపనం

వెర్రిపుచ్చ చెట్టు వేరు తెచ్చి ఆరబెట్టి దాన్ని సానరాయి పై అరగదీసి
ఆ గంధాన్ని వాచిన వ్రుషణాలపై (బుడ్డ) పట్టులాగావేస్తే తొందరగా వాపు తగ్గుతుంది

అండవ్రుద్దికి

ఆముదపు చెట్టు వేరును కడిగి ముక్కలు చేసి ఆరబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి.
ఈ పొడిని వేడిపాలలో 4gr మోతాదుగా కలిపి అందులో ఒకచెంచా వంటాముదంకూడా
కలిపి ఉదయం పరగడుపున సేవించాలి.
దీనివల్ల అదనంగా 2or3 సార్లువిరోచనమైనా కంగారుపడనవసరంలేదు.
ఇలా15days పాటిస్తే అండకోశాల వ్రుద్ధి(బుడ్డ),పోటు, వాపు, తగ్గిపోయి సమానంగా తయారౌతాయి

LOw BP అల్పరక్తపోటు

అల్పరక్తపోటు ఉన్నవారికి రక్తహీనత సమస్య ఉంతుంది.
కాబట్టి రక్తంవ్రుద్ది చేసుకోడానికి ప్రయత్నించాలి
తయారీవిధానం:-1)రాత్రినీటిలో నానబెట్టిన 32 కిస్ మిస్ పండ్లను ఉదయం పరగడుపునఒక్కొక్కటిగాతిని
ఆనానిన నీరుతాగాలి.
2)రెండు పూటలా ఆహారానికి ముందు ఒకచెంచా అల్లంరసం, ఒకచెంచాతేనె.కలిపితాగాలి
3)సాయంత్రం ఒకకప్పునుండి ఒకగ్లాసు వరుకూ క్యారెట్ రసంలో ఒకచెంచాతేనె.కలిపితాగాలి
4)నిద్రించే ముందు ఒకతీపి దానిమ్మపండు తినాలి
*ఇలాచేస్తే అల్పరక్తపోటు హరించుకుపోతుంది*

BP అధికరక్తపోటు

మనం కూరగా వండుకునే ఆనబకాయ (సొరకాయ) ముక్క 150gr తీసుకుని ముక్కలుగా తరిగి
మెత్తగానూరి కూరలువండె కుక్కర్ లో వేసి అందులో అరలీటరు నీరు పోసి బాగాకలపాలి.
ఆతరవాత మూతపెట్టి మంటపెట్టాలి. ఒకసారి విజిల్ రాగానె దించి మూతతీసి పదార్దాన్ని గ్లాసులో
పోసుకోవాలి
వాడెవిధానం సొరకాయ పానీయాన్ని రోజూ పరగడుపున ఒకమోతాదుగా సేవించాలి.
సాధారణ రక్తపోటు గలవారు 4to7days, అధికరక్తపోటుగలవారు7to10days తాగితే
రక్తపోటు అద్రుశ్యమౌతుంది
ఆహారనియమాలు....మాంసం,మద్యం,అతిఉప్పు,అతికారం,అరగనిపదార్దాలు,అతివేడిపదార్దాలు,
ఆవకాయ,ఐస్ క్రీములు, శీతలపానీయాలు, పెరుగు.మానుకోవాలి.
చలవచేసేపదార్దాలు,తొందరగాజీర్ణమయ్యే పదార్దాలు, వేళదాటకుండా సేవించాలి
అనవసర ఆవేశాలు ఆందోళనలు అణుచుకోవాలి.
ఇలాచేస్తే ఏ మందులు అవసరంలేకుండా రక్తపోటు అణుగుతుంది

17, అక్టోబర్ 2009, శనివారం

తేలు కాటు చికిత్స

బొప్పాయి పాలు తేలు కుట్టినచోట వేసి రుద్దితే వెంటనే విషం దిగిపోతుంది

తేలు కాటు చికిత్స

తిప్పతీగముక్క అంగుళంపరిమాణంగా నోటిలో వేసుకుని
నములుతూ ఆరసం మింగితే విషంబాధ తగ్గిపోతాయి

తేలు కాటు చికిత్స

మోదుగ గింజలని జిల్లేదుపాలతొ అరగదీసిన గంధం కుట్టినచోట రాస్తే
వెంటనే విషం విరిగిపోతుంది

తేలు కాటు చికిత్స

తేలు కుట్టినచోట ఒకచుక్కజిల్లేడుపాలువేసిరుద్దితే విషం విరిగిపోతుంది

తేలు కాటు చికిత్స

ముల్లంగి ఆకుల లేదా దుంపలరసం తేలు పైన పిండితె తేలు వెంటనేచచ్చిపోతుంది.
ముల్లంగిని ఉప్పుతో నూరి తెలు కుట్టినచోట వేసి కట్టుకడితె క్షణంలోవిషం విరిగి పోతుంది

ఎలుకకాటు చికిత్స

కామంచి ఆకుల దంచి తీసినరసం కాటు పై వేసి రుద్దుతుతువున్నా
(లేక)
రెండుచెంచాల మోతాదుగా లోపలికి సేవిస్తూవున్నా
ఎలుక విషం విరిగిపోతుంది

ఎలుకకాటు చికిత్స

వెంపలాకురసం రెండుచెంచాల మోతాదుగా తీసుకుని సమంగా
చెక్కెర కలిపి సేవిస్తే ఎలుకవిషం విరిగిపోతుంది

ఎలుకకాటు చికిత్స

పత్తిఆకులను తెచ్చి మెత్తగ్గా దంచి తీసినరసం నాలుగు చెంచాల మోతాదుగా
లోపలికి సేవిస్తూ పత్తిఆకు నూరునముద్ద కాటుపైన వేసి కట్టుకడుతూవుంటె
క్రమంగా ఎలుకు విషం విరిగిపోతుంది

16, అక్టోబర్ 2009, శుక్రవారం

ఉడుత కాటు చికిత్స

గానుగచెట్టు కాయలలోని విత్తనాలు, ఆవాలు, నల్లనువ్వులు, ఈ మూడింటిని
సమబాగాలుగా తీసుకుని మంచినీటితో మెత్తగానూరి ఉడుత కాటువేసిన
చోట పట్టులాగావేస్తుంటె విషం విరిగిపోతుంది
(లేదా)
మేలిరకమైన ఆముదం మాటమాటకి కాటుపైన రుద్దుతూవునా
విషం విరిగిపోతుంది

పాముకాటు ప్రధమచికిత్స


పాముకరచిన వెంటనే నెమలిపించాన్ని మెత్తగానూరి బియ్యంకదిగిన నీళ్ళతో
కలిపితాగాలి (లేదా)

నెమలిపించాన్ని కాల్చి చేసిన బూడిదమెత్తగానూరి బియ్యంకదిగిన నీళ్ళతో కలిపి
తాగినా సమస్త సర్ప విషాలు బలహీనపడతాయి

పాముకాటు ప్రధమచికిత్స

తెల్లగలిజేరు చెట్టు వేరున తెచ్చి బియ్యంకడిగిన చిక్కటినీరు తోదంచి
ముద్దచేసి బట్టలొ వేసి పిండినరసం పావుకప్పు మోతాదుగా తాగితే
వెంటనే విషంబలహీనపడుతుంది

పాముకాటు ప్రధమచికిత్స

వసకొమ్ములు, ఇంగువ సమబాగాలుగా తీసుకుని మంచినీటితొ గంధంలాగా
మెత్తగానూరిఅరికాళకు అరిచేతులకు పట్టులాగా వేస్తె విషం బలహీనపడుతుంది

పాముకాటు ప్రధమచికిత్స

పాము కరచిన వెంటనే గుప్పెడు కాకరాకులను నమలడం లేదాఅరకప్పు కాకరాకు రసం తాగడంఛేస్తె
మరుక్షణమే వాంతి జరిగి విషంవిరుగుతుంది.

పాముకాటు ప్రధమచికిత్స

ఉత్తరేణిఆకులు,వేర్లు కలిపి కడిగి దంచి తీసినరసం అరకప్పు మోతాదుగా తీసుకుని అందులో
ఒకచెంచా మిరియాలపొడి కలిపి తాగితే విషంబలహీనపడతాది అలాగే ఉత్తరేణి ఆకులరసం
ముక్కులలోను చెవులలోను 4to5 చుక్కలను పిండాలి అలాగే కళ్ళలోరెండుచుక్కలువెయ్యాలి.

పాముకాటు విషలక్షణాలు

పాముకాటువేసినత్రువాత అతని శరీరంలొ కలిగే మార్పులను బట్టీ విష వేగాన్ని తెలుసుకోవచ్చు
తలబరువెక్కడం, ముఖం, కళ్ళు, గోళ్ళు నల్లబడటం , సందులలో శూలపుట్టడం, స్వరంక్షీణించడం
ఆయాసంలాగాఎగశ్వాసరావడం, గొంతుఆరిపోవడం, శరీరమంతా చెమటపుట్టడం, వేపాకు,మిరియాలు
నమిలినాచేదు,కారపు, రుచుల చెప్పలేకపోతే విషం ఎక్కినదని తెలుసుకోవాలి

పిచ్చికుక్క విషానికి

కలబందగుజ్జు50graదేశవాళీ ఆవునెయ్య30graకలిపి చెంచాతో రసంలాగా గిలక్కొట్టి చిన్నమంటపైన గోరువెచ్చగా
వేడిచేసి అందులో సైందవలణంపొడి5grకలిపి పగడుపున సేవిస్తె పిచ్చికుక్క విషం విరిగిపోతుంది

15, అక్టోబర్ 2009, గురువారం

పిచ్చికుక్క--కరిస్తె

పిప్పంటఆకులనుబాగాకడిగి రోటిలొవేసి నీళ్ళుకలపకుండాముద్దలా దంచి బట్టలొ వేసి పిండీనరసం100gr
to150grతీసుకుని అందులొమెత్తగా ముద్దలాగానూరిన ఆవపిండి10graకలిపి పరగడుపున తాగించాలి
ఈవిధంగా మూడురోజులకు ఒకసారి చేయాలిఈమూడురోజులు గేదెపెరుగుతో కలిపిన ఆహారం
మాత్రమే సేవించాలి. ఇతరపదార్దాలు తినకుడదు.
ఈ ఔషదాని సేవించినతరువాత ఆరుమాసలవరకు స్త్రీ సంభోగం పనికిరాదు కఠిన బ్రహ్మచర్యం
పాటీంచాలి

12, అక్టోబర్ 2009, సోమవారం

తీవ్ర జ్వరానికి

కరక్కయబెరడు, వేపచెట్టుబెరడు, వాకుడుచెట్టువేర్లు, నేలవేము, చేదుపుచ్చవేర్లు, తిప్పతీగ ముక్కలు,
క్రిష్ణతులసిఆకులు, గానగచెట్టుఆకులు, వాము, ఇవి ఒక్కొకటి 50gచప్పున తీసుకునిమెత్తగా నలగగొట్టి
ఒకపాత్రలో వేయాలి అందులొ3600gramమంచినీరు కలిపి చిన్నమంటపైన మరిగిస్తూరెందోవంతు
అనగా900graa కషాయం మిగిలేవరకు మరిగించి దించివడపోసుకోవాలి ఆకషాయంలో పంచదార300gr
కలిపిచిన్నమంటపైన తేనెలాగాపాకం వచ్చేవరకు మరిగించి దించి చలార్చుకుని గాజుపాత్రలో నిల్వచేసుకోవాలి.
ఈఔషదాన్ని పూటకు 5grమోతాదుగా ఒకకప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తే
తీవ్రమైన జ్వరం కూడా హరించుకు పోయొ మంచి ఆరోగ్యం కలుగుతుంది

స్వైన్ ప్లూ తులసిమాత్రలు

క్రిష్ణతులసి ఆకులు 50g..దోరగా వేయించి దంచిన మిరియాలపొడి 50g దోరగా వేయించి దంచిన వాముపొడి50g
నేలవేముపొడి 50g..తిప్పతీగపొడి 50g..అల్లంరసం తగినంత తీసుకోవాలి. ఆకులను చూర్ణాలను రోటిలోవేసి ఆల్లం
రసం అందులోపోస్తూ పదార్దాలన్ని బాగా కలిసి గుజ్జులాగా గోళీ కట్టడానికిఅనుకూలంగా మారేవరకూ నూరాలి
ఆతరువాత ఆముద్దను పెద్దలకు బఠాణీగింజంత పిల్లలకు శెనగగింజంత పరిమాణంలోనూ గోళీలు చేసి
నీడలో గాలిబాగా తగిలేచోట పూర్తిగా ఎండె వరకూ ఆరబెట్టి నిలువచేసుకోవాలి
ముందుజాగ్రత్త గా రాత్రినిద్రించే ముందు ఒకమాత్ర గోరువెచ్చని నీటితో వేసుకుంటే ఏ విధమైన జ్వరానైనా
ఎదించగల సక్తి వస్తుంది అంతేకాక శరిరంలొ చెరిన వివిద అవయవాలలో చేరిన చెడు పదార్దాలు బహిష్కరింపబడతాయి
జలుబు, దగ్గు, పడిశం, తుమ్ములు, పడిశం వాతనొప్పులు , కీళ్ళలొ నీరుచేరడం వంటి సమస్యలు ఉన్నవారుకూడా
రెండు పూట్లా ఆహారానికి అరగంటముందు ఒకమాత్ర వేసుకోవచ్చు

స్వైన్ ప్లూ జాగ్రత్తలు

త్రాగనీటి నియమాలు--మంచినీటిని శుబ్రమైన పాతలో పోసి చిన్నమంటపైన వేడిచెయ్యాలి.
చేసినతరువాత మూతపెట్టి పాతలో నీరు సహజంగా చల్లబడెవరకు మూతతీయకుండా ఉంచాలి
ఈ విధంగాకాచి చల్లార్చిన నీటిని మాత్రమేవాడాలి
గొరువెచ్చని నీటిని రోగులకు త్రాగించడంవల్ల జఠరాగ్ని దెబ్బతినకుండా ప్రజ్వరిల్లుతుంది
శరీరంవ్యాది పెరగకుండా అణిగిపోతుంది.అంతేకాకుండా ఉదరంలో చేరిన కఫం వేడినీటి వల్ల ముక్కలుముక్కలుగా
చేదింపబడి విరేచనం ద్వారా బహిష్కరింపబడుతుంది దనితోపాటు విషమించబోయే ఉదరగతమైన పిత్తము, వాతము
అనులోమగతికి చేరతాయి.రోగులకు దప్పికి కూడా తీరుతుంది.
ఇలావేడినీరు తాగకుండా రోగులు చల్లనీరు సేవిస్తే పైన చెప్పిన సుగుణాలకు వ్యతిరేకంగా శరీరంలోదుర్గుణాలు
సంభవిస్తాయి అంతేకాకుండా చల్లనీటివల్ల జ్వరం అతిత్వరగా వ్రుద్దిచెందుతుంది
ఆహారనిమాలు--రోగికి సహజంగా ఆకలి లేనప్పుడు ఆహారం ఇవ్వకూడదు.అలాగే ఆకలి పుట్టినప్పుడు ఆజీర్ణకరమైన
ఆహారంఇవ్వకూడదు.పలుచగా కాచినగంజి పై తేటను వంచితాగితె ఏరకమైన జ్వరాలు కలుగకుండా, ప్రాణశక్తి
క్షీణించకుండా కాపాడుతుంది

స్వైన్ ప్లూ ఎవరికి వస్తుంది.....?

తరచుగా దగ్గు, రొమ్ముపడిశం, ఆయాసం, ఉబ్బసం, శ్వాస కోససమస్యలు తీవ్రంగాఉండి వ్యాధినిరోదకశక్తి
తగ్గినవారిక ఈ వ్యాది త్వరగావ్యాపిస్తుంది

7, అక్టోబర్ 2009, బుధవారం

స్వైన్ ప్లూలక్షణాలు

ఈజ్వరం సోకినవారికి దగ్గు, పడిశం, గొంతుబొంగురుపోవడం, ముక్కుదిబ్బడవేయడం లక్షణాలు కనిపిస్తాయి
కొదరిలో వాతులు, విరోచనాలు,తలనొప్పి, ఆయసం, శరీరంవణకడం కూడా తరచుగా కనిపిస్తాయి
వ్యాదితీవ్రమైనదశలొ ఊపిరితిత్తులు పనిచేయనిస్థితికిచేరి ప్రాణాలకే ప్రమాదం కలుగును

6, అక్టోబర్ 2009, మంగళవారం

స్వైన్ ప్లూఅంటే ఏమిటి

ఇదిఒకరమైన వైరస్ స్వైన్ఇన్ ప్లూయంజఎ(h1,n1)అనిపిలువబడె ఈవ్యాది వైరస్ మెక్సికో నగరంలొ
మొదలైందని పందులద్వారా మనుషులకు అంటుకుని వ్యాపిస్తుందని శాస్రవెత్తలు చెబుతున్నారు

పొట్ట తగ్గటానికి

సొంఠి , పిప్పళ్ళు , మిరియాలు, ఈమూడింటిని సమభాగాలుగా తీసుకుని దోరగా వేయించి జల్లించి
అందులో తగినంత సైందవలవణపొడి కలిపి నిలువౌంచుకోవాలి
రోజూ రాత్రినిద్రించేముందు పావు చెంచా పొడితో ప్రారంభించి క్రమంగాశరీర స్తితినిబట్టి అరచెంచావరకు
పెంచుకుంటూ ఒకచెంచా తేనెతో కలిపి రోజూ పరగడుపున సేవించాలి

పొట్ట తగ్గటానికి

రోజూనిద్రించే ముందు ఒకచెంచా త్రిఫలకల్పచూర్ణం ఒకగ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి
నియమంతప్పకుండా ఏఊరువెళ్ళినా ఎన్ని ఆటంకాలు వచ్చినాఈచూర్ణాన్నివాడటం మరచిపోకూడదు

పొట్ట తగ్గటానికి

శరత్ కాలంలొ వర్షపునీటిని పాత్రలద్వార పట్టుకుని కనీసం 10 బిదెలుఐనా నిలువచేసుకోవాలి.
రోజూ అరగ్లాసు నీటీలొ ఇంటిలో కొట్టుకున్న మేలిరకమైన పసుపు అరచెంచా కలుపుకుని రోజూ పరగడుపున సేవిచాలి
ఇలాకనీసం100 రోజులు పాటు చేస్తే మంచి ఫలితాలు కనబతాయి

పొట్ట తగ్గటానికి

పసుపు పొడి,. పల్లేరుకాయలపొడి, తుంగగడ్డలపొడి, దోరగావేయించిన సొంఠి పొడి దోరగావేయించినఆవలపొడీ
ఈపదార్దాలు ఒక్కొక్కటి 20gతీసుకోవాలి. అందులో ఎర్రచందనంపొడి40gలవంగాలపొడి 100g సారపప్పుపొడి
100g కలపాలి ఈమోత్తంమిశ్రమాన్ని ఒకడబ్బా లోనిలువచేసుకోవాలి.
ఉత్తరేణి తైలంతో మర్ద్నాచేసినతరువాత ఈ చూర్ణాన్ని తగనంత తీసుకుని అందులో కొద్దిగానువ్వులనూనె
కలిపి అతిగా కొవ్వుపెరిగిన అన్ని చోట్లా నలుగు పెట్టినట్లుగారుద్ది ఒకగంట ఆగి స్నానంచేయాలి

పొట్ట తగ్గటానికి

ఉత్తరేణి ఆకులను కడిగి దంచి తీసిన రసంఒకలిటరు నువ్వులనూనె ఒకలీటరు కలిపి ఒకపాత్ర లో పోసి
చిన్నమంటపైన రసము ఇగిరి నూనెమాత్రమే మిగిలేవరకూ మరిగించి వడపోసి నిలువ ఉంచుకోవాలి
ఈ తైలాన్ని రెండుపూటలా స్నానానికి గంటముందుగా తగినంత అతైలాన్ని గోరువెచ్చగా వేడి
చేసిఅతిగాపెరిగిన పొట్టపైన ఇరుప్రక్కలా నిదానంగా లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి
ఉత్తరేణి రసం లోపలికి ఇంకిపోతి అతి కొవ్వు ను అణిచివేయడమే కాక చర్మవ్యాదులను
అణిచి వేస్తుంది

అశ్వగంధతో--అనంతశక్తి

బలంగాఉన్న అశ్వగంధ దుంపలను తెచ్చి ఒకమట్టిపాత్రలో పోసి అవి మునిగేవరకు దేశవాలీ ఆవుపాలు పోసి
చిన్నమంటపై పాలు ఇగిరేవరకు మరిగించాలి ఆతరువాత ముక్కలను తీసి బాగా ఎండబెట్టలి ఈవిధంగా14సార్లు
చేశి పూర్తిగా ఎండినతరువాత దంచి జల్లించి ఆ చూర్ణంలొ సమంగా పటికబెల్లంపొడి కలిపి నిలువ ఉంచుకోవాలి
రోజూ సయంత్రం పొట్టకాళి గా వున్నప్పుడు రెండు చెంచాలపొడిని ఒకగ్లాసు వేడి పాలలో కలిపి తాగాలి
ఈ విధంగాశరీరంలో సంపూర్ణ శక్తి ఉత్పన్నమయ్యెవరకు ఆపకుండా వాడుకోవాలి

29, సెప్టెంబర్ 2009, మంగళవారం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం
క్రితంలో తెలిపిన పద్దతులు పాటించి శరీరాన్ని క్రమబద్దం చేసుకున్న తరువాత ప్రయోగాలు ప్రారంభించాలి.నల్ల తుమ్మచెట్టుకు పూజచేసి చెట్టునుండి దాని లేత ఆకులు లెతకాయలూ పూలూ బంక పై బెరడు సమభాగాలుగాసేకరించాలి.వాటిని శుభ్రంచేసి ఆరబెట్టి దంచి చూర్ణాలు చేసుకుని అయిదుభాగాలు సమానంగా కలపాలి.తరువాత మొత్తంపొడిని పలుచని నూలు బట్టలో వస్త్రఘాళితం పట్టి మొత్తంతో సమంగా కండ చక్కెర పొడి కలిపి నిలువవుంచుకోవాలి.రోజూ ఉదయం పరగడుపును ఆవుమూత్రం సేవించిన గంట తరువాత చూర్ణం ఒక టీ స్పూన్ మోతాదుగాఅరచేతిలో వేసుకుని కొద్దికొద్దిగా చప్పరించి ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా పటిక బెల్లం కలిపి తాగాలి.ఇది పూర్తిగాజీర్ణమైన తరువాతే ఆహారం సేవించాలి.

బొటన వ్రేలిలో బోలెడంత శక్తి.

బొటన వ్రేలిలో బోలెడంత శక్తి.
హస్తప్రయోగ భాదితులైన యువకులంతా ముందుగా ప్రతిరోజూ రెండుపూటలా ఆహారానికి ముందు ఒక చేతిని మోచేతివద్ద వంకర లేకుండా చాచి పెట్టుకుని ఆ చేతి బొటనవేలును అడుగునుండి పై వరకు రెండవచేతి వేళ్ళతో వందసార్లు నొక్కి వదలాలి.తరువాత రెండవ చేతి బొటనవేలిని లూడా అలాగే నొక్కి వదలాలి.ఈ చిన్న ప్రక్రియ వల్ల అంతులేనంత మానసిక శక్తి పెరగడం మీరు గమనించవచ్చు.
బొటనవేలు నొక్కితే మనోశక్తి ఎలా పెరుగుతుంది ? అని మీకు సందేహం కలగవచ్చు .తలలో ఉండే దైవశక్యులకు ప్రతిరూపమైన భ్రుకుటిలోని అజ్గాచక్రం తలలోని సహస్రార చక్రం.ఈ రెండింటి మూలస్తానాలూ బొటనవేళ్ళలో దాగివుంటాయ్.అందువల్ల వాటిని నొక్కి వదలడం ద్వారా ఆ రెండు చక్రాలు చైతన్యవంతమై మనసులోని భయాలనూ ఆందోళనలను తొలగించి క్రమంగా అంతులేని మనో శక్తిని మనకందిశ్తాయి..ఇది చదివినప్పటికన్నా చేసిన తరువాత స్వానుభవం ద్వారా ఇది యధార్దమని మీరు తెలుసుకొనగలుగుతారు.
ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి మనోశక్తిని పెంచుకుంటే తద్వారా శారీరక శక్తిని పొందవచ్చు.

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు
(1)*ఈ ప్రక్రియ ప్రారంబించినరోజు నుండి 100రోజులు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి.
(2)*రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాలి. రాత్రి నిద్ర పోయేముందు ఒక రాగిచెంబులో పెద్దగ్లాసు నీరుపోసి
ఉదయంలేవగానే వేరే నీటితో నోరు పుక్కిలించి తరువాత ఆచెంబు లోనినీటిలొఒక టీస్పూను త్రిఫల రసాయనచూర్ణం కలిపి తాగాలి మీఅరిచేతులలోని అరికాళ్ళలోని 8 గ్రంధులపైన 10 నిమిషాలపాటు ఒత్తిడి కలిగించాలి
(3)*మర్రిఊడ,పుల్లల తో గాని మర్రికొమ్మల పుల్లలతో గాని పండ్లు తోమకోవాలి.
(4)*తూర్పుముఖంగా కూర్చుని ఆసనాలు,ముద్రలు, ప్రాణాయామము,ద్యానముచేయాలి.
(5)*5గంటలకులోహపానీయము ఒకగ్లాసు మోతాదుగా గోరువెచ్చగా సేవించాలి
లొహపానీయం తయారీవిధానము--మేలిమి బంగారం15గ్రా"..(999)వెండి30గ్రా"..చిలుములేని
స్వచ్చమైనరాగి60గ్రా"..ఈమూడు లోహాలను ఆరుగ్లాసుల మంచినీటిలో20ఎండు కిస్ మిస్ పండ్లు 2 అంజురుముక్కలను ఒకఎండుఖర్జూరము వేసి ఉదయము వరకు నానబెట్టి ఈపండ్లు తిని ఆనీళ్ళుతాగాలి.
(6)*6-15to6-30నువ్వులనూనెతో గోరువెచ్చగా శరీరమంతా మర్ద్నాచేయాలి
(7)*7-00గంటలకు సుఘంద స్నానచూర్ణంతో స్నానంచేయాలి.
(8)*శతావరీ లేహ్యము ఒకచెంచామోతాదుగా తిని తరువాత రెండు కప్పుల ఆవుపాలలొ అశ్వగంధ,శిలాజిత్ కలిపినపొడిఒకచెంచాకలిపి ఉదయం8-00గంటలకు తాగాలి
(9)*1-00to10-00గంటలమద్యఎవరి అరుగుదలను బట్టి వారు భొజనము చేయవచ్చు
***భోజనములోవాడవలసినపదార్దాలు***
పాలిష్ తక్కువగా ఉన్నబియ్యం,ఆవుపాలు , ఆవునెయ్యి , ఉసిరికాయ, కొబ్బరిపచ్చడి, క్యారెట్, బీట్ రూట్,
దోసకాయ, నీరుల్లి, నువ్వులపొడి, నువ్వులనూనె, గంగపాయిలకూర, బచ్చలికూర, బూడిదగుమ్మడికాయ,
అరటికాయ, పాలకూర,నేతిలో వేయించిన మినపవడియాలు,అప్పడాలు, మిరియాలు, మునగపువ్వు
మునగాకు, మునగకాయల కూర, నేతిలో వేయించిన వెల్లులి, అల్లంసుఖనాముఖి చారు , సైంధవలవణం
మజ్జిగ, గేదెనెయ్యి, లేతబెండకాయలు, బార్లీపాయసం, గోధుమపాయసం, బియ్యంపాయసం,మినపసునుండలు
నేతి మినపగారెలు, మొదలైనపదార్దాలతో లబ్యమయ్యేవి అనుకూలమయ్యేవి, సేవించవచ్చు.
** ఆహారంతరువాత అరచెంచా హింగ్వాష్టక చూర్ణం నీటితో వేసుకోవాలి**
*ఉదయం8-00to8-10గంటలమద్యలో టెన్నిస్ రబ్బరుబంతిని తీసుకుని దాని ఆసనమునకు వ్రుషణములకు
మద్యన ఉండెటట్లు పెట్టి 10నిముషాలపాటు ఒక కుర్చిపైకూర్చోవాలి కుర్చునేటప్పుడు వదులుగావుండెబట్టలు
ధరించాలి. ఈబంతి ఆసనము, మరియు ,వ్రుషణములు మద్యభాగములో ఒత్తిడి కలిగించడంవలనవీర్య ప్రసరణ
సక్రమంగా జరుగుతుంది
మద్యాహ్నం ఒంటిగంటకు__ఆకలిని జీర్ణశక్తినిబట్టి ఆక్రోపళ్ళు, అరిటిపళ్ళు, ఆపిల్ పళ్ళు, ద్రాక్సపళ్ళు, దానిమ్మపళ్ళు, నేరేడు పళ్ళు, మర్రిపళ్ళు, రావిపళ్ళు, మేడిపళ్ళు, మామిడిపళ్ళూ నేరుగాకాని రసం
తీసుకునిగాని తాగవచ్చు.
కూరగాయలు__క్యారెట్ బీట్ రూట్ టొమేటో కలిపి తీసినరసం ఒకచెంచాతేనె కలిపి తాగాలి.
* సాయంత్రం4-00గంటలకు శతావరి రసాయంతినాలి అశ్వగంధ సేవించాలి
*సాయంత్రం5-00గంటలకు ఏదో ఒక పాయసం తాగాలి లేక రెండు నేతి గారెలు తినాలి.
*సాయత్రం6-45నిముశాలకు అరిచేతులకు అరిపాదాలకు ఒత్తిడి కలిగించాలి
*రాత్రి7-00గంటలకు పైనతెలిపినపదార్దాలతో ఆహారం సేవించాలి
*10-00గంటలకు నిద్రపోయే ముందు బాధంపాలు తాగాలి
***********

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

జలుబు

వాము10గ్రా, పాతబెల్లము40గ్రా, ఈరెండూ కలిపి మెత్తగా దంచి అరలీటరు మంచినీటిలో వేసి,పావులీటరుమిగిలేవరకు
మరిగించి దించి వడగట్టుకోవాలి. అదిచల్లరిన తరువాత ఒకమోతాదుగా ఉదయంతాగాలి అదేవిధముగాకచుకుని
సాయంత్రం కూడా తాగాలి. ఈ విధముగా తాగితే జలుబు, పడిశము, గొంతులో శ్లేషము పూర్తిగా తగ్గటమేకాక
అగ్నిదీప్తి కలిగి బాగా ఆకలి పుట్టి జీర్ణశక్తి పెరుగుతుంది

జలుబు

మంచి పసుపు, పటికబెల్లం సమభాగాలుగా తీసుకుని నిప్పులమీద వేసి ఆపొగను పీల్చాలి
రోజూ రెండు లేక మూడు సార్లు చేస్తె ఎంత తీవ్రమైన జలుబైనాతగ్గిపోతుంది

తుమ్ములు

దెశవాళీగులాబీ పూలరేకలు100గ్రా
నువ్వులనూనె...........................100గ్రా
తీసుకుని నూనె పొయ్యి మీద పెట్టి మరిగిస్తు గులాబి రేకలను అందులో వేస్తూ మొత్తము రేకలు
నల్లగామాడిపోయి నూనెమత్రమే మిగిలినతరువాత దించి వడపోసి నిలువచేసుకోవాలి
ఈతైలము రెండుపూటలా రెండు చుక్కలు ముక్కుల్లొ వేస్తూవుంటే అధికముగా వచ్చె తుమ్ములు
నివారించబడతాయి

23, సెప్టెంబర్ 2009, బుధవారం

ధూపం

స్త్రీలు యోనిని ముందుగా గోరువెచ్చని నీటితో కడిగి తరువాత మంచి గంధంకలిపిన నీటితోకడిగి
తరువాత సాంబ్రణి పొగ వేస్తూ వుంటె యోని యెల్లపుడు మంచి వాసనతో గుభాళి స్తూ
సంభోగంలో బర్తకు ఇంపుగా రతి ప్రేరకంగా ఉంటుంది

రజస్వల కాని ఆడపిల్లలకు

ప్రతీ రోజూ మామిడిచెట్టు బెరడుతో తీసిన రసం వడపోసి ప్రతీరోజూ 20గ్రా మోతాదుగా ఆవుపాలు తోకలిపి
తాగిస్తే గర్బదోషం తొలగిపోయి రజస్వల అవుతారు

స్త్రీ ల సమస్యలు

ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం స్నానంచేయడానికి ఒకగంట ముందుగా పెరుగుతో యోనిని కడుగుకుంటూవుంటె
క్రమంగా వదులుగా వున్న యోని బిగువుగా వుంటుంది

బూరుగు జిగురు సంపాదించి దాన్ని మెత్తటి చూర్ణం లా దంచి జల్లెడపట్టి వస్త్రఘుళితం చేసి తరువాత సుతిమెత్తని
చూర్ణంలో నీరు కలిపి గంధంలా నూరి ఆగంధాన్ని యోని పై లేపనం చేయ్యాలి

ఇలా కొద్దిరోజులు చేస్తే పదిసార్లు ప్రసవించిన స్త్రీ కైన యోని గట్టిపడి కన్యక యోనిలా అవుతుంది

21, సెప్టెంబర్ 2009, సోమవారం

అన్ని నొప్పులకూ - అర్జునాంజనము

వాజలైన్ ఒక పౌను,ఫైరాఫిన్ మైనము మూడు ఔన్సులు,మెంతాల్ రెండు ఔన్సులు,కర్పూరము రెండు ఔన్సులు,కాజీపుట్ తైలము రెండు ఔన్సులు,మొరాస్టిక్ తైలము రెండు ఔన్సులు,యూకలిప్టస్ తైలము రెండు ఔన్సులు,ఓమ పువ్వు ఒక ఔన్సు,పిప్పరమెంట్ పువ్వు రెండు ఔన్సులూ తీసుకోవాలి.

ఒక పెద్ద పాత్రలో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్ళు బాగా మరిగిన తరువాత వేరొక ఖాలీ అల్యూమినియమ్ పాత్రను మరుగుచున్న నీటి పాత్ర మీద పెట్టి దానిలో మైనపు ముక్కలను వేసి,నీటి ఆవిరికి మైనమును కరిగించాలి.తరువాత దానిలో వాజలైన్ కలపాలి.ఆ రెండూ కలిపిన తరువాత ఆ మిశ్రములో కర్పూరమూ,మెంతాల్ పొడి వేసి కలిపి పాత్రను కిందికి దించి మిగిలిన వస్తువులను ఒక్కొక్కటిగా చేర్చి వేడిగా వుండగానే సీసాలో పోసి నిల్వ వుంచుకోవాలి.

దీనిని తల,నుదురు,మెడ,మోకాళ్ళూ,నడుములు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూస్తూ వుంటే పూసిన పది నిమిషాలలో నొప్పులు మాయమైపోతాయి.

తలనొప్పి తైలము

పిప్పింటాకు రసము ఒక కేజీ(నీళ్ళు కలపకుండా తీసినది),మంచి నువ్వుల నూనె ఒక కేజీ,ఈ రెండింటినీ ఒక పాత్రలో కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపైన నిదానముగా ఆకు రసమంతా ఇరిగిపోయి నూనె మిగిలే వరకూ మరిగించాలి.
తరువాత,పాత్రను దించి చల్లార్చిన తరువాత వడపోసుకుని ఈ తైలమును కొంచెము గోరువెచ్చగా తలకు రుద్దుకుని స్నానము చేస్తూ ఉంటే తలపోటు,తలదిమ్ము త్వరగా తగ్గిపోతాయి.

పిచ్చి వ్యాధులకు

పాల సుగంధి వేళ్ళ మీది బెరడు చూర్ణం 40గ్రాములు,అశ్వగ్రంధ చూర్ణం 20గ్రాములు,పటిక బెల్లం చూర్ణం 60గ్రాములు కలిపి వస్త్రఘాలితం చేసి అతి మెత్తటి చూర్ణంగా తయారు చేసుకోవాలి.ఈ చూర్ణాన్ని పూటకు రెండున్నర గ్రాముల చొప్పున ఒక కప్పు పాలు అనుపానంగా రెండు పూటలా సేవిస్తూ వుంటే మతిభ్రమణం,పిచ్చి,ఉన్మాదం తగ్గిపోయి నిద్ర బాగా పట్టి ఆరోగ్యం చేకూరుతుంది.

నిద్రపట్టనివాళ్ళకు

ఇనుప పాత్రలో యాభై గ్రాములు నువ్వుల నూనె పోసి బాగా మరిగించాలి.అందులో 10గ్రాములు హారతి కర్పూరం వేసి కరిగిన తరువాత,పొయ్యి మీద నుంచి దింపాలి.నూనె చల్లారిన తరువాత రోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్ళకు మర్ధనా చేయించుకుంటే , సుఖమైన నిద్ర పడుతుంది.

అతినిద్రతగ్గటానికి

ఆముదపు చెట్టు పూవుల్ని పాలతో మెత్తగానూరి, కణతలకు పట్టువేసి తలపై కూడాపట్టు వేస్తూ వుంటె
క్రమముగా అతినిద్ర తగ్గిపోతుంది

సరస్వతీతైలము

తయారీవిధానము:- సరస్వతీసమూలం 100గ్రా
గుంటగలగరసమూలం 100గ్రా
పొన్నగంటికూర...............100గ్రా
ఉసిరికాయలరసం............100గ్రా
తెల్లగలిజేరుఆకురసం.......100గ్రా
తీసుకుని ఒక పాత్రలో వేసి దానిలో500గ్రా మంచినీరు,500గ్రానువ్వులనూనె కలిపి చిన్నమంటపైన నూనెమాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి నిలువ వుంచుకోవాలి
వాడేవిధానము:-ఈతైలాన్ని రోజూ తలకు మర్దనా చేసుకుంటు వుంటె తలలో వేడి, విషవాయువులుఅతిచల్లదనము హరించి మెదడు ప్రశాంతమౌతుంది. దీనివలన తలవెంట్రుకలు అందముగా,ఆరోగ్యముగాపెరుగుతాయి

తులసి ( టి )

తులసి ఆకులపొడి 100గ్రా"
పుదీనాఆకులపొడి 100గ్రా"
సుగంధపాలవేళ్ళపొడి100గ్రా"
సొంఠిపొడి......................20గ్రా
దాల్చినచెక్కపొడి.........20గ్రా
ధనియాలపొడి.............20గ్రా
ఆకుపత్రిపొడి................20గ్రా
మిరియాలపొడి............20గ్రా
జాపత్రి పొడి...................20గ్రా
తీసుకుని అన్ని కలుపుకుని నిలువవుంచుకోవాలి
వాడెవిధానము :-ఒక గ్లాసు పాలలొ ఒకచెంచా పొడి కలిపి మరగబెట్టి వడపోసుకుని తగినంత చెక్కెర,మదుమెహరోగులైతేతగినంత తాటిబెల్లం కలుపుకుని రెండు పూటలా తాగాలి

ఉపయోగములు:-ఈ తులసి టీ ప్రతి రోజూ తగితే సర్వ శిరో రోగాలుతగ్గి నరాలకు శక్తి కలుగుతుంది.మెదడుకు
శక్తి వస్తుంది. మనసిక ఆందోళనలు , అనవసర ధుఖము,పాత తలనొప్పులు, తుమ్ములు జ్వరము,దగ్గు,ఆయాసము క్రమముగా తగ్గి పోతాయి

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

పార్శ పు తలనొప్పికి

రాత్రి నిద్దురపోయేముందు 60గ్రా పంచదారగాని కండచెక్కరపొడి గాని
పావులీటరు నీటిలో వేసి కరిగించి మూతపెట్టి మంచంకిందపెట్టుకుని
పడుకోవాలి తెల్లవారుఝామున 5గంటలకు నిద్రలేచి ఆపంచదారనీళ్ళని
ఒకసారి కలుపుకుని తాగాలి ఒక గంటవరకూ మరేమీ తాగకుడదు
తినకూడదు ఈవిధంగా 4to5రోజులు చేస్తె పార్శపు నొప్పి (అరతలనొప్పి)
తగ్గిపోతుంది

తలనొప్పికి

తులసిఆకులను నీడలో ఆరబెట్టి దంచి జల్లించి వస్త్ర్ఘుళ్ళితంచేసి అతిమెత్తని చూర్ణాన్నితయారుచేసి నిలువ చేసుకోవాలి
రోజూ రెండు లేకమూడుపూటలా చిటికెడు పొడిని ముక్కులతో లోపలికి పీలుస్తువుండాలి ఈ చిన్నప్రయోగం వల్ల
ఎంతకాలంనుంచి వేధిస్తున్న జలుబు, దగ్గు, పడిశము, తుమ్ములు, తలనొప్పి, తగ్గిపోతాయి

తలరోగాలకు(తలనొప్పి)

రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నువ్వులనూనె రెండుచుక్కలు చెవులలొను
రెండుచుక్కలు ముక్కులలోను వేయాలి. గుక్కెడునూనెను నోటిలోను వేసుకునిఐదునిమిషాలు పుక్కిలించాలి
ఇలాచేయడంవల్ల ఈతైలము తలలొ సర్వశిరో భాగాలకు చేరి మలిన,వ్యర్ద పదార్దాలు,మలినవయువులు,ఉష్ణవయువులు
నిలువ వుండకుండావాటిని కరిగిస్తు శిరస్సు ను పరిశుభ్రంగా ఉంచుతుంది ఖర్చులెని కష్టంలేనిఈ ఒక్క సులువైన
యోగంతొ భవిష్యత్తులొ రక్తపోటు,గుండెపోటు,పక్షపాతం,మూర్చ,అపస్మారము,కండరాలక్షయం మొదలైన నరముల
సంబందిత రోగాలు దరిచేరకుండా తమనుతాము కాపాడుకోవచ్చు

17, సెప్టెంబర్ 2009, గురువారం

స్ఠనాల గట్టితనానికి

దానిమ్మ కాయ పై బెరడును ఆవనూనెలో కలిపి నాన బెట్టి మెత్తగానూరి,ఆ రసాన్ని పలుచటి గుడ్డలో వడపోసుకుని , ఆ రసంతో చన్నుల మీద లేపన చేస్తూ వుంటే , వాలుపోయిన చన్నులు కూడా గట్టిగా మారతాయి.

లింగ దృఢత్వానికి

సైంధవ లవణం,తేనే,పావురముల రెట్ట ఈ మూడూ సమభాగాలుగా కలిపి మెత్తగా నూరి లింగం(పురుషుని మర్మావయవం) మీద ముందు మణి భాగాన్ని వదలి,వెనుక భాగమంతా పట్టిస్తూ వుంటే క్రమంగా లింగ బలహీనత హరించి లింగం దృడంగా,లావుగా మారుతుంది.

నవ యౌవనానికి - సురతరు తైలం

ఆవుపాలు 10గ్రాములు , ఆవు నెయ్యి 10గ్రాములు,ఉసిరిక కాయల రసము 10గ్రాములు ,దేవదారు పట్ట నుంచి తీసిన నూనె 20గ్రాములు,ఇవన్నీ కలిపి , బాగా చిలకారించి,ప్రతిరోజూ ఉదయమే తాగాలి.ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వ్రుద్ది కలిగి శరీరం బంగారు చాయతో ప్రకాశిస్తుంది.బుద్ది బ్రుహస్పతి వలే అభివ్రుద్ది చెందుతుంది.రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి అనగా 100గ్రాములు మోతాదులో తాగిన యెడల ,వాత , పిత్త ,కఫ,అనే త్రిదోషాలు,సర్వనేత్ర వ్యాధులూ హరించి పోతాయి.

మూడవ నెలలో రెండవ నెలలో రెండవ నెలకన్నా రెట్టింపు చేసి అనగా 200గ్రాములు,మోతాదులో తాగిన యెడల నవ యౌవనము ప్రాప్తిస్తుంది.సూర్యుడి వంటి కాంతిటో ,దేవతలతో సమానమైన శరీరంతో ప్రకాశిస్తారు.ఇది సులభమైన అధిక ఫలము నిచ్చే దివ్య రసాయన తైలము.

సంభోగ శక్తి కోసం

  • బురుగు బంకను మెత్తటి చూర్ణంగా తయారుచేసి పూటకు రెండున్నర గ్రాములు మోతాదుగా,రెంుపూటలా మేక పాలతో కలిపి తాగుతూ ఉంటే ,రోజుకు ఎన్ని సార్లైనా సంభోగం చేసే శక్తి కలుగుతుంది.
  • అశ్వగంధ రెండున్నర గ్రాములు.యష్టి మధుకం రెండున్నర గ్రాములు , కలిపి పాలు,పటిక బెల్లంతో రెండుపూటలా తీసుకుంటే ప్రతిరోజూ సంభోగం చేసే శక్యి చేకూరుతుంది.
  • బార్లీ గింజలు 20గ్రాములు తీసుకుని అరలీటరు నీళ్ళలో పోసి పొయ్యి మీద పెట్టి పావు లీటరు నీరు మిగిలే వరకూ సన్న మంట మీద మరగబెట్టాలి.తరువాత ఆ కషాయాన్ని వడపోసుకుని నలభై రోజుల పాటు తాగుతూ ఉంటే,శరీరంలోని అమిత వేడి హరించి,వీర్యం గట్టి పడి సంభోగ శక్తి పెరుగుతుంది.

వీర్య స్తంభనకు

కుసుమ నూనెను లింగానికి(ముందు భాగం వదిలి)లేపనం చేస్తూ వుంటే నరాలకి శక్తి కలిగి,ఎక్కువ సేపు వీర్యాన్ని స్తంభింపజేసే అవకాశం ఏర్పడుతుంది.
ఎర్ర గన్నేరు వేరు తెచ్చి,నెయ్యిలో వేసి వేయించాలి.వేరు తీసివేసి నెయ్యిని వడపోసుకోవాలి.ఆ నేయిని లింగానికి(ముందు భాగాన్ని వదలి)రోజూ లేపనం చేస్తూ వుంటే , లింగం బలమూ,వీర్య స్తంభనా కలుగుతాయి.
  • రేగిచెట్టు జిగురు సంపాదించి , సంభోగ సమయంలో,బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంభన జరిగి ఎక్కువ సేపు రతిలో పాల్గొనవచ్చు.
  • ప్రతిరోజూ,అతిమధురం 5గ్రా,తేనె 5గ్రా,కలిపి సేవింి వెంటనే ఆవుపాలు ఒక గ్లాసు తాగుతుంటే విశేషంగా వీర్య స్తంభన జరుగుతుంది.

14, సెప్టెంబర్ 2009, సోమవారం

పేనుకొరుకుడు

*చేదు పొట్లాకు రసం వెంట్రుకలు రాలిపోయిన చోట రెండుపూటలా రుద్దుతూ వుంటె 3to7రోజులలో
తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*కొబ్బరినూనెలొ ఎండు పొగాకు చితగ్గొట్టి వేశి నానబెట్టి తరువాత బాగా పిసికి వడకట్టి ఆనూనెను
రోజు తలకు రాస్తూవుంటె వెంట్రుకలు మొలుస్తాయి
*నేలములక వేరు తేనెతొ కలిపి మెత్తగా నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా రుద్దుతూ వుంటె
తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*పల్లేరుపూలు, నువ్వులపూలు, తేనె, నెయ్యి, సమంగా కలిపి నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా
రుద్దుతూ వుంటె తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*మందారపూలు నల్ల ఆవుమూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా
రుద్దుతూ వుంటె తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి

తెల్లవెంట్రుకలు నల్లగాచేసుకోండి

బోడసరం చెట్టు పూలు తెచ్చి నీడలొ ఎండబెట్టి దంచి చూర్ణంచేసుకోవాలి
దానితో సమానంగా కండచెక్కెర పొడి కలిపి ఉంచుకొని ఆచూర్ణాన్ని రోజు
ఉదయం రెండున్నర గ్రాముల మోతాదుగా వుంటే ఆరునెలల నుండి
సంవత్సరం లోపు తెల్ల వెంట్రుకలన్ని శాశ్వతంగా నలుపెక్కుతాయి
అంతేగాకుండా యౌవ్వనం స్థిరంగా నిలిచివుంటుంది కంటిద్రుష్టి అమోఘంగా పెరుగుతుంది

*ఈ యోగం వాడెటప్పుడు స్త్రీ పురుషులు అమిత శ్రంగారాన్ని విడిచిపెట్టాలి
ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన విధంగా చలికాలంలొ ప్రతిరోజు ఒకసారి
వర్షాకాలంలొ వారానికి ఒకసారి వేసవికాలంలో పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే ఆరోగ్యవంతులైన
వారు శ్రుంగారంలో పాల్గొనాలి ఈనియమాన్ని పాటిస్తు ఆహారంలో చింతపండు నిషేదించాలి దానికి బదులుగా
ఉసిరికాయల ముక్కలను వేసుకోవచ్చు ఇంకా ఆవుపాలు, ఆవునేయ్యి, ఆవుపెరుగు, ఆవువెన్న, పుష్కలంగా
వాడుకోవచ్చు*

*ఇదివాడిన స్త్రీ తో పురుషుడు సంభోగించినా పురుషుడితో స్త్రీ సంభోగించినా జీవితాంతం వారిని మరిచిపోలేనంత
అమరసౌక్యం కలుగుతుంది

కలబంద తైలం

కలబందగుజ్జు 100గ్రా
గుంటగలరాకురసం100గ్రా
నువ్వులనూనె (లేక) మంచి కొబ్బరినూనె 300గ్రా
తీసుకుని అన్ని కలిపి మెత్తగా పిసికి గుజ్జులాగా చేసి చిన్న మంటపైన
నూనె మాత్రమేమిగిలేటట్లు మరగబెట్టాలి .
పొయ్యి మీదనుండి దించడానికి పావుగంటముందు
100గ్రా. గంధ కచ్చూరాల పొడి వేసి తరువాత దించుకోవాలి చల్లబడిన తరువాత
పలచని బట్టలో వడ పోసుకుని నిలువచేసుకోవాలి
వాడేవిధానము::- ఈ తైలాన్ని ప్రతీరోజు తగినంత మోతాదుగా తల వెంట్రుకల కుదుళ్ళుకు
ఇంకేటట్లుగా మర్దనా చేసుకోవాలి ఇలాచేస్తూవుంటే తలలో దురద, పుండ్లు, జిడ్డు తగ్గిపోయి
వెంట్రుకులక మంచి బలము, రంగు సంక్రమిస్తాయి

చుండ్రు నివారణకు

మంచికబ్బరినూనె అరకిలొ అందులో 5 నిమ్మపండ్లరసంకలిపి, పొయ్యి మీద పెట్టి సన్నటి సెగ మీద మరిగించాలి
రసము ఇగిరి నూనె మాత్రమే మిగిలిన తరువాత పాత్రను దించి చల్లార్చి వడపోసుకోవాలి

రోజు ఉదయం గాని సాయంత్రం గాని ఈతైలాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత కుంకుడుకాయపౌడర్
తొ తలస్నానం చేయ్యాలి తరువాత ఎట్టిపరిస్తితులలోనూ నూనె రాయకూడదు

ఈవిధంగాచేస్తూవుంటె చుండ్రు , వెంట్రుకలు రాలిపోవడం తలలో దురద,పేలు,ఇలాంటివన్ని పోయి,
వెంట్రుకలు నల్లగా బలంగా పెరుగుతాయి

తలవెంట్రుకల రక్షణకు

కరకచూర్ణము100గ్రా"
ఉసిరిక
చూర్ణము100గ్రా"
తాడికాయల
చూర్ణము100గ్రా"
లోహభస్మం
100గ్రా"
వీటన్నింటినీ నీళ్ళతో మెత్తగానూరి ౩౦౦ గ్రా"రసంతీయాలి.
ఆ రసాన్ని ఒక కుండలో పోసి అందులొ ౩౦౦ గ్రా"నువ్వులనూనె పోసి
౩౦౦ గ్రా"గుంటగలగర రసము కలిపి బాగా గిలక్కొట్టి పొయ్యి మీద పెట్టాలి
సన్నటిమంట మీదమరిగిస్తు గరిటతో కలియబెడుతువుండాలి కుండలొ నీరంతా ఇంకిపోయి నూనె మాత్రమే మిగులుతుంది పొయ్యి మీదినుంచి దించి చల్లార్చిన తరువాత వడబోసి నూనెను వేరుచెయ్యాలి.
ఈ నూనెను మళ్ళి కొత్తకుండలో పోసి కుండపైన మూతపెట్టి గుడ్డతోచుట్టి భూమి లో5 అడుగులు గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి.
ఈవిధంగా నెలరోజు లపాటు భూమిలోనే వుంచి 31వ రోజు కుండను బయటకుతీయ్యాలి
ఈతైలాన్ని ప్రతీరోజు తలకు బాగామర్దనాచెసి అరటిఆకు తో తలకు కట్టుకట్టి
3గంటలపాటు అలాగే వుంచాలి
ఆ తరువాత ఆకు తీసివేసి ,కరక ,ఉసిరి ,తాని కాయలతో తయారుచేసిన
కషాయంతో తలంటుకుని స్నానంచేయాలి
ఈ విధంగా వారంరోజులు చేసెటప్పటికి తెల్లవెంటృకలు నల్లగా అవుతాయి
*ఎప్పటికీతెల్లబడవు*

ఊడినవెంట్రుకలు తిరిగి మొలుచుటకు

కానుగపూవుల రసాన్నిగాని ఉల్లిగడ్డల రసాన్నిగాని ముల్లంగిదుంపల రసాన్నిగాని ప్రతీ రోజూ రాత్రి నిద్రించే ముందు వెంట్రుకలు ఊడిపోయిన చోటబాగాఇంకిపోయేలాగా రుద్దాలి ఉదయం పైన తెలిపిన కషాయంతో
కడుగుతూ ఉండాలి దీనితోపాటు ఫార్మసీలో దొరికే కేశామ్రుతము,
కేశవ్రుద్దీకర లేపనము వాడుతూ వుంటే క్రమక్రమం గా వెంటృకలు
ఊడినచోట తిరిగి మొలుస్తాయి

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

హస్తప్రయోగపీడితులకు

పెన్నెరుదుంపలు,నువ్వులు,మినుములు,ఎనుగుపల్లేరు కాయలు,
పిల్లిపీచర దుంపలు ఒక్కొక్కటి50 గ్రా"తీసుకుని ఒక మయ్యిపాత్రలొవేసి ఆపదార్దాలు మునిగేవరకు ఆవుపాలుపోసి చిన్నమంటపైన ఆపాలన్నీ ఉడికిపోయేవరకూ మరిగించాలి తరువాత ఆపదార్దాలను తీసిఎండలొ ఎండబెట్టాలి ఈవిధంగాకనీసం7సార్లు చేసి బాగాఎండించి దంచి పొడిచేసుకోవాలి పలుచని బట్టలొ వస్రఘూళితంచెయాలి తరువాత 2లీటర్ల ఆవుపాలు తిసుకుని పొయ్యిమీద పెట్టి ఈపాలలొ పై చూర్ణాన్ని పోసి చిన్నమంటపై మరిగిస్తూ గరిటతో కలియబెడుతూవుండాలి పాలు చూర్ణం రెండూకలిసిపోయి కోవాలా ఐనతరువాత క్రిందకి దించాలి తరువాత వేరే కళాయి పాత్రలొ 450గా"ఆవునేయ్యి వేసి చిన్నమంటపైన మరగబెడుతూ పైన తయారైన కోవా ముద్దను ఆనేతిలో వేసిదోరగా వేయించాలి తరువాత పాత్రను దింపి చల్లారినతరువాత ఆకోవాఎంత తూకం ఉందో దానికి రెండు రెట్లు పటికబెల్లంపొడిని కలిపి మొత్తంపదార్దాన్ని బాగా కలిపి ఆముద్దను20గ్రా"తూకం ఉండెలా చిన్నచిన్ని లడ్లు మాదిరిగా తయారుచేసి నిలువ ఉంచుకోవాలి రోజూ ఉదయం సాయంత్రం ఆహారానికి రెండు గంటలముందు ఒక లడ్డు తిని ఒక కప్పు గోరువెచ్చిని ఆవుపాలు తాగుతూ ఉండాలి ఈవిధంగా చేస్తూకనీసం40to60రోజులు బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళి కాని హస్తప్రయోగ పీడితులు వివాహా పర్యాంతం కనీసం ఆరు నెలలు లడ్లు సేవిస్తూ పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి ఇలాచేస్తె అమితమైన వీర్య పటుత్వం దేహ దారుడ్యంకలిగి యవ్వనము,కాంతి, తేజస్సుపెరుగుతాయి

10, సెప్టెంబర్ 2009, గురువారం

చెముడువుంటే...?

మారేడు పండులో ఉన్న గుజ్జుని తీసుకొని ఆవు మూత్రంలో వేసి బాగా పిసకాలి।దానికి సమానమ్గా,నువ్వుల నూనెను మేక పాలను కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి సెగ మీద వండాలి।పాత్రలో ఉన్న నీళ్ళు ,మేకపాలు,నూనెలో ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలిన తరువాత దించి,చల్లార్చిన తరువాత,పలచటి కాటన్ గుడ్డలో వడకట్టి,జాగ్రత్త చేసుకోవాలి.ఆ నూనెని ప్రతిరోజూ మూడు , నాలుగు చుక్కలు చొప్పున చెవుల్లో వేసుకుంటే క్రమక్రమంగా చెముడు తగ్గిపోతుంది.

చెవిరోగాలకు

ఉమ్మెత్తాఅకులరసం100గ్రా" నువ్వులనూనె200గ్రా" కలిపి
పొయ్యిమీదసన్నటి మంట మీద వండాలి వండేటప్పుడు అందులొ ఏడుజిల్లేడుఆకులు వేయాలి

క్రమంగా పాత్రలోని ఉమ్మెత్తరసం,జిల్లేడుఆకులరసం ఇగిరిపోయి
నూనె మాత్రమే మిగులుతుంది దీనిని చల్లార్చినతరువాత వడపొసుకోవాలి
దీన్ని అవసరంవచ్చినప్పుడు చెవిలొ రెండు చుక్కలు మాత్రమే వేయాలి
దీనివల్ల సమస్త చెవి వ్యాదులు నిస్సందేహంగా తగ్గిపోతాయి

చెవిరోగాలకు

ఉత్తరేణి చెట్టు సమూల రసం 100గ్రా"ఉత్తరేణి చెట్టును అకాల్చిన బూడిద 100గ్రా" మంచి నువ్వులనూనె200గ్రా" మంచినీరు200గ్రా:
ఇవన్ని కలిపి పొయ్యి మీదపెట్టి తైలంమాత్రమే మిగిలేవరకు చిన్నమంట
పైన మరిగించి వడపోసి నిల్వ చేసుకొవాలి
ఈతైలాన్ని రోజు రెండుపూట్లా చెవులలొనాలుగైదు చుక్కలవేస్తె
చెవిలో ఏ సమస్య ఐనాతగ్గిపోతాయి

చెవిరోగాలకు

సన్నరాష్ట్రము,తిప్పతీగ,ఆముదమువేరు,దేవదారుచెక్క,సొంఠి,
ఈ ఐదు సమభాగాలుగా తీసుకుని దంచి,చూర్ణం చేసి నిల్వవుంచుకోవాలి
ఈ చూర్ణాన్ని పూటకు రెండు గ్రాములు మోతాదుగా రెండుపూటలా
ఆహారానికి అరగంట ముందు లేక గంట తరువాత ఒక చెంచా తేనెతొ
కలిపి సేవిస్తూ వుంటె చెవిపోటు,హోరు చెవిలోకురుపులు,చీము
చెముడు సమస్యలు తగ్గిపోతాయి

చెవిరోగాలకు

లేతవేపాకులను30గ్రా" తీసుకుని మెత్తగానలుగకొట్టి దానిలో20గ్రా"
మంచి తేనె ను కలిపి ఈరెండింటినీ రోటిలొవేసి మెత్తగా నూరి ఆముద్దను
పలుచని బట్టలో వేశి రసం పిండుకుని సీసాలోపోసి నిలువవుంచుకోవాలి
ఈరసాన్ని చీము కారుతూ వున్నచెవిలో రోజుకు మూడుసార్లు పెద్దలకు
నాలుగైదుచుక్కలు,పిల్లలకు రెండు,మూడు చుక్కలు వేస్తూవుంటె
వారంరోజులలొ చెవి నుండికారే చీము సమస్య పూర్తిగాతగ్గుతుంది

చెవిరోగాలకు

ముల్లంగిదుంపలను మెత్తగా దంచి ఆముద్దను పలుచని బట్టలోవేసి
పిండి తీసిన రసం100గ్రా" పరిశుద్దమైన ఆవాలనూనె100గ్రా"
తీసుకుని కలిపి మట్టిపాత్రలొ పొయ్యిమీదపెట్టి చిన్న మంటపైన
నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించి దించి చల్లార్చి నిలువవుంచుకోవాలి
ఈద్రవాన్ని చుక్కలువేసే సిసాలోపొసి ఏచెవి సమస్య ఉన్నవారైనా
ఉదయం రాత్రి సమయాలలో ప్రతిరోజూ నాలుగైదు చుక్కలు వేసుకుని
దూది పెట్టుకొంటూవుంటే క్రమముగా చెవిపోటు,చెవిలొచీము,చెవినొప్పి
చెవిలోహోరు,చెవిఎండిపోవడం,చెవుడు సమస్యలు నివారించబడతాయి

చెవిరోగాలకు

వర్షాకాలంలోను,చలికాలంలోను పరిశుబ్రమైన గోరువెచ్చని నువ్వులనూనె
ఎండాకాలంలో
పరిశుబ్రమైన వంటాముదం ప్రతీరోజూ క్రమంతప్పకుండా
నిద్రలేచిన తరువాత రెండు,మూడుచుక్కలువేసుకుని చెవి తమ్మెలను
కదిలించాలి ఈఅలవాటు వల్ల పెద్దపెద్ద చెవి రోగాలు రాకుండాకాపాడుకోవచ్చు

9, సెప్టెంబర్ 2009, బుధవారం

వెంట్రుకలురాలకుండా

గోరింటపూలు,ఆకులు దంచి రసం తీసికొబ్బరినూనెతొ
కాచి వడపోసి ఆనూనెను తలకు రాసుకుంటూవుంటే
వెంట్రుకల కదుళ్ళు గట్టిపడి ఊడిపోవడం ఆగుతుంది
*తెల్లవెంట్రుకలు కూడా నల్లగానిగనిగలాడుతూ అందంగాఉంటాయి

నల్లవెంట్రుకలుకావాలా.....?

కరక్కాయ,ఉసిరికాయ,తాడికాయ,లోహచూర్ణం ఈ వస్తువులను
సమానభాగాలుగా మంచినీళ్ళతొ నూరి రసం తయారుచేయాలి
ఈరసానికి సమానంగా నల్లనువ్వులునూనె కలపాలి తరువాత
ఈరసంఎంతతూకం ఉంటుందొ అంతతూకంగా పచ్చిగుంటగలిజేరు
ఆకు రసం కలిపి బాగా కలియతిప్పాలి ఆపదార్దమంతా మట్టికుండలో
పోసి కట్టెలపొయ్యి మీద సన్నటి మంటమీద మరిగించాలి క్రమంగా
కుండలొ నీరంతాఇంకిపోయి నూనె మత్రమే మిగులుతుంది
ఈనూనెను దించి చల్లారిన తరువాత వడపోసి,ఆనూనెకుండకు
4to5వరుసలు బట్టవేసి గట్టిగాతాడుతొ కట్టి ఆకుండ మూతిచుట్టూ
బంకమట్టితో మెత్తి బంధనము చేసి అదిఆరినతరువాత దానిని
నెలరోజులపాటు భూమిలో పాతిపెట్టాలి నెలతరువాత ఆతైలాన్ని
తలకు బాగామర్దనాచేసి తలకు అరటిఆకును కట్టాలి 3గంటల
తరువాత ఆ ఆకును తీసి త్రిఫల కషాయంతో తలంటుకుని
స్నానంచేయాలి ఇలాచేస్తె క్రమంగా తెల్లవెంట్రుకలు నల్లబడ్తాయి
నల్లవెంట్రుకలు నెరవకుండా నిగనిగలాడతాయి

లిక్విడ్ హెర్బల్ షాంపు

కుంకుడుకాయలపొడి,గుంటగలగరాకు,నిమ్మకాయచెక్కలు,టీపొడి
వీటిని గుప్పెడు తీసుకుని ఒకగ్లాసు వేడినీటిలోవేయాలి
తరువాత బాగా గిలక్కొట్టి వడపోసుకుని షాంపులాగావాడుకోవచ్చు

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

గమనిక


మన బ్లాగులొని కొన్ని ఫొటొలను అప్ లోడ్ చేసాను
ఇదికేవలం సరదాకొసంమాత్రమే ఎవరికైనా
అబ్యంతరంఉన్నయెడల సూచిస్తే తొలగించబడును
మీ
నాగబ్రహ్మారెడ్డి

మూలికలషాంపు*


*ఉసికకాయతొక్కలపొడి,వేపాకులపొడి,తెల్లచందనంపొడి,బాదంపప్పుపొడి,
యష్ఠిమధుకంపొడి, వీటినిసమభాగాలుగా తీసుకుని అన్నికలిపి గాలిచొరబడని డబ్బాలొ బద్రపరుచుకోవాలి స్నానానికి వెళ్ళెముందు
జుట్టును పాయలుగా విడదీసి ఈ పొడిని జుట్టుకుదుళ్ళమద్య చల్లాలి
10నిముషాలతరువాత సన్నటిపళ్ళుకలిగిన దువ్వెనతొ దువ్వెయ్యాలి
అప్పుడు ఈ పొడితోపాటు వెంట్రుకలను అంటిపెటుకున్న జిడ్డు మురికి
బయటకువచ్చేస్తుంది తర్వాత కుంకుడుకాయరసంతో తలారాస్నానం
చేయవచ్చు

ఆయుర్వేదషాంపు


కొత్తకుంకుడుకాయలపైపెచ్చులపొడి100గ్రా"శీకాకాయలపొడి100గ్రా"
ఉసిరికకాయలపొడి100గ్రా"
మారేడుపండుగుజ్జుపొడి100గ్రా"వీటిని విడివిడిగాపొడిచేసి అన్నికలిపి నిలువచేసుకోవాలి
వాడేవిధానము:-ఒకపెద్దగ్లాసువేడినీటిలొ మగవారికి౩చెంచాలు,ఆడవారికి6చెంచాలుపొడివేసి దానిలొ ఒకనిమ్మపండురసంపిండిమూతపెట్టి౩గంటలునిల్వ ఉంచి ఆతరువాతమూతతీసిచెంచాతొ కలిపితె మంచివాసన,నురుగువస్తుంది దీన్నికొద్దికొద్దిగాచేతులలోతీసుకుని తలకురుద్దుకుంటూ స్నానముచెయ్యాలి వారానికి ఒకటి లేదారెండుసార్లు ఈ విధంగాచేస్తె పైపదార్దాల జీవగుణము కేశమూలల్లొకి చొచ్చుకుపోయి వెంట్రుకులకుదుళ్ళనుగట్టిపరుస్తుందిఅంతేగాకతలలో కురుపులు,పుండ్లు,దురదలు చుండ్రు సమస్యలను నివారిస్తుంది వెంట్రుకులుకు చక్కటినునుపు,నిగారింపు,ద్రుడత్వము,ఇస్తుంది
వెట్రుకలను సంపూర్ణ ఆరొగ్యముగా కాపాడుతుంది

వెంట్రుకలాఅరోగ్యానికి

ఒకగ్లాసు నీటిలొ ఒకచెంచాత్రి ఫల కల్పచూర్ణమునుకలిపిరాత్రినుండిఉదయంవరకునానబెట్టి ఉదయం ఆనీటిని నాలుగోవంతు మిగిలేవరకు చిన్నమంటపై మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత తలపైన ఆకషాయాన్నిసున్నితంగా మర్దనా చేస్తూలోపలికి ఇంకిపోయెటట్లుచేయాలిదీనివల్లవెంట్రుకలుకుదుళ్ళు గట్టిపడి తల పరిశుబ్రమైచక్కటికేశసంపద కలుగుతుంది
*దీనితీపాటు లోపలికిసేవించడానికి కేశామ్రుతము,త్రిఫల రసాయనము,తలస్నానాకి కేశవ్రుధీకర లేపనము ఫార్మసీలోతయారైనవివాడుతూవుంటేక్రమంగామంచిపలితాలుపొందవచ్చు

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

రెడ్డివారినానుబాలు ఇదిఎరుపు తెలుపు రంగుల్లొ చాలాచిన్నదిగా
ఉండెరకంఒకటి అర అడుగుఎత్తు పెరిగెరకంఒకటి అన్నిప్రాంతాల్లొ
దొరకుతుందిదీన్ని పచ్చిదిగాతెచ్చి కడిగి దంచి రసంపిండి
పావుకప్పుమోతాదుగా ఒకచెంచా కండచెక్కెరపొడి కలిపి రెండుపూట్లా
సేవిస్తే సకల మూత్రావయాలుబలపడడమేకాక వీర్యవ్రుద్ది కల్గుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

తెల్లగలిజేరుఆకుకూరలాగా వండుకుతింటే లేదా
పప్పులొవేసి కూరలాగా వండుకు తిన్నా
మూత్రావయాలుబలపడడమేకాకవీర్యవ్రుద్దికలగుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

కొండపిండికూర దీని ఆకులను కూరలాగ వండుకుని
తింటే మూత్రావయాలుబలపడటమేకాక వీర్యవ్రుద్దికలుగుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

చిన్నలేకపెద్దపల్లేరుఔషాదులను సమూలంగాతెచ్చిశుబ్రంచేసి
ముక్కలుగా తరిగి నీడలొ గాలి తగిలేచొట ఆరబెట్టి నిల్వుచేసుకోవాలి
నెలకు ఒకసారి తగినంత పదార్దాన్ని తీసుకుని దంచి పొడి
చేసుకోవాలి
ఒకగ్లాసు నీటిలో ఒకచెంచా పొడివేసి ఒకకప్పు కషాయానికిమరిగించి
వడపోసి గోరువెచ్చగాఉన్నప్పుడుఒకచెంచామంచితేనెకలిపిసేవించాలి
దీనివలన మూత్రావయాలు బలపడటమేకాక హస్తప్రయోగపీడితులు
కోల్పోయినవీర్యం కూడా పునరుద్దరించబడుతుంది

3, సెప్టెంబర్ 2009, గురువారం

మన ముఖ్యమంత్రి ఇకలేరు


మన ముఖ్యమంత్రి శ్రీ రాజశెఖర్ రెడ్డి గారి అకాలమరణానికి చింతిస్తూ
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతుని ప్రార్ధిస్తూ.....
మీ
నాగబ్రహ్మారెడ్డి

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించాలంటారు ఎందుకు?

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించినా, పూజించక పోయినా తులసిమొక్కని మాత్రము తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే తులసి యొక్క ఔషధ గుణములను ద్రుష్టిలో ఉంచుకుని మన పెద్దలు పెరటిలో తులసి మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తులసి నుండి వచ్చే గాలి పీల్చినట్లయితే కలరా వంటి వ్యాధులు దరి చేరవు.
ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్శణం తులసికి వుంది. అందుకే అన్ని రకముల అవకాశములు ప్రయత్నించిన
తరువాత ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్ధము నోటిలో పోస్తారు.

30, ఆగస్టు 2009, ఆదివారం

కీళ్ళవాతానికి--ఆహారనియమాలు

వ్యాదిపూర్తిగాతగ్గేవరకు పాతబియ్యంతో కాచిన జావలొ గాని
గోధుమనూకతో
కాచిన జావలొ గాని, చిటికెడు కరకపొడి,
చిటికెడు సొంఠిపొడి,నాలుగైదుచిటికెడు సైంధవలవణంపొడి
కలిపితాగాలి
*చేపలు,మాంసం,గడ్లు,ఉలవలు,బెల్లం,పాలు,బచ్చలికూర,
మినుములు,పూర్తిగా నిషేదించాలి
మిగిలిన పదార్దాలు వాడుకోవచ్చు

కీళ్ళవాతానికి

వెల్లుల్లిరేకలు 10గ్రా" సొంఠి10గ్రా",వావిలిచెట్టుబెరడు10గ్రా"
తీసుకుని కొంచెం నలగ్గొట్టి గిన్నెలోవేసి పావులీటరునీళ్ళు
పోసి చిన్నమంటపైన అరపావులీటరు కషాయం మిగిలేవరకూ
మరిగించాలి దించి వడపోసి దాన్ని రెండుభాగాలుగాచేసి
గోరువెచ్చగా వున్నప్పుడు ఒకచెంచాతేనెకలిపి ఆహారం
తరువాత1or2గంటలాగి సేవించాలి
కీళ్ళవాతరోగులు రోజూ రాత్రి నిద్రించేముందు వంటాముదం
10గ్రా"తీసుకుని అందులొ దోరగావేయించిన కక్కాయపొడి
పావుచెంచాకలిపితాగాలి సుఖవిరేచనం జరుతుంది

కీళ్ళవాతానికి

వాము30గ్రా",సొంఠి50గ్రా",కరక్కాయబెరడు120గ్రా"
తీసుకోవాలి ఈ మూడింటినీ దోరగా వేయించి దంచి
పొడిచేసి 200గ్రా"కండచెక్కెరపొడికలిపి నిల్వచేసుకోవాలి
ఈ చూర్ణాన్నిరోజూ2or3 పూటలా ఆహారానికి గంటముందు
అరచెంచా మోతాదుగా గోరువెచ్చని నీటితో సేవిస్తె ముందుగా
ఉదరశుద్ది జరుగుతుంది ఉదరంలోకుళ్ళిన పదార్దాలు
బహిష్కరింపబడి జఠరాగ్ని కలిగిస్తుంది సుఖవిరేచనం
జరుగుతుంది

29, ఆగస్టు 2009, శనివారం

కీళ్ళవాతానికి

వావిలాకులు,చింతాకులు,జిల్లేడాకులు,గుంటగలగరాకులు,
మనగాకులు,దొరికితేపెద్దచెన్నంగి(కసివింద),గానుగాకులు,
ఒక్కొక్కటీ100గ్రా"సేకరించాలి నువ్వులనూనే700గ్రా"
కళాయిలొపొసి మరిగించాలి అదివేడెక్కగానే పైన సేకరించిన
ఆకులన్నిచిన్నముక్కలుగా తరిగివేయాలి ఆకులరసం నూనెలొ
కలిసిపోయేటప్పుడు ఆకులు పగులుతు చిటపటమని శబ్దం
వస్తుంది నూనెబిందువులు పైకిఎగిరి చేతులపై పడే అవకాశం
ఉంది కాబట్టి కొంచెందూరంగా వుండి చేయాలి
ఆకులునల్లగా మాడినూనెమిగిలిన తరువాత దించి బట్టలొ
వడపోసుకోవాలి అందులో దోరగా వేయించి దంచి వస్త్రఘుళ్ళితం
పట్టిన మిరియాలపొడి30గ్రా" పిప్పళపొడి30గ్రా" మెత్తగానూరిన
గడ్డకర్పూరంపొడి40గ్రా"కలిపి మూతపెట్టాలి ఆపదార్దమంతా
నూనెలో కలిసిపోయి చల్లారిన తరువాత ఒకగాజుసీసాలొనిల్వ
ఉంచాలి
ఇలావాడాలి:-కీళ్ళవాతంసంక్రమించినపుడు వేళ్ళగుణుపులవద్ద
చేతులమణికట్టు వద్ద, కాళ్ళచీలమండెలవద్ద,మొచేతులవద్ద,
మోకాళ్ళవద్ద వాచివుంటుంది అక్కడముట్టుకుంటేభరించలేనంత
నొప్పిపుడుతుంది పై తైలాన్ని విడిగా గిన్నెలోకి తీసుకుని
గోరువెచ్చగా వేడిచేసి నిదానంగా మ్రుదువుగా ఆ వాపులపైన
సున్నితంగా రుద్దాలి రోగులు కళ్ళుమూసుకుని బాధను బరించాలి
ఈ నూనె అన్నివాపులకు పట్టించాలి తరువాత పైన తెలిపిన
ఆకులు ఒకఅరకేజీ తీసుకుని రెండు కేజీలనీటిలో వేసికొంచెం
పసుపు వేసిమూతపెట్టి మరిగించాలి పాత్రను దించి సగం
మూతను సగం తీస్తే ఆవిరి పైకి వస్తుంది కీళ్ళవాతంసోకిన
అవయవానికి ఈఆవిరి తగిలేటట్లు చేయాలి దీనివల్ల పైన
పూసిన తైలం లోపలికి ఇంకి లోపలపేరుకుపోయిన వాతం
అనేకుళ్ళిన పదార్దాన్ని కరిగించి చెమట రూపంలొ తోసివేస్తుంది
ఇలా జరిగినపుడు మొదటి 4to5రోజులు రోగికి తీవ్రమైననొప్పి
కలుగుతుంది దాన్నిఓపికగా బరించాలి ఈ విధంగా
ఆవిరిపట్టిన తరువాత ఒక పొడి నూలు బట్టను తీసుకుని
మరిగించిన నీటిలొ ముంచి పిండి ఆబట్టతొ వాపుల పైన
కాపడంపెట్టాలి। ఆతరువాత ఆయాభాగాలకు వ్యాయామంచేయాలి

మూత్రంలొసుద్దపోతొంటే

మిరియాలతొ:-ఒకకప్పు పాలలో అరచెంచామిరియాల
పొడినివేసి ३ సార్లు పొంగించి దించి వడపోసి ఒకచెంచా
కండచెక్కెరపొడి కలిపి २ పూటలాతాగితేమూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది
నీరుల్లితొ:-రెండుపూటలా ఒకపచ్చి నీరుల్లిపాయను
ముక్కలుగాచేసిఅన్నంలోతిన్నా లేక రసంతీసి
అందులొ కండచెక్కెరకలిపి తాగినా
మూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది
కరక్కాయతొ:-కరక్కాయ పై బెరడు చూర్ణాన్ని
పూటకు అరచెంచామోతాదుగా ఒకచెంచాతేనెని
కలిపి రెండుపూటలా సేవిస్తె
మూత్రంలొసుద్ద
పోవడం ఆగుతుంది

ముత్రకోశంలొ -రాళ్ళు

ఉలవలతొ:-పెద్దగ్లాసు నీటిలొ50గ్రా"ఉలవలు వేసి
ఒక కప్పుకు మరిగించిన కషాయంగాని ఉడకబెటిన
నీరుగాని ఒక కప్పు మోతాదుగా పవుచెంచా
సైందవలవణం కలిపి రెండుపూటలా ఆహారానికి
గంటముందుసేవిస్తె మూత్రకోశంలొ రాళ్ళు
మెత్తబడి మక్కలై మూత్రద్వారంగుండాపడిపోతాయి
వక్కపొడితొ:-పరిమితిమైన మోతాదుగా వక్కపొడిని
చప్పరిస్తెమూత్రకోశంలొరాళ్ళుపుట్టవు రాళ్ళువున్న
వారికిక్రమీణాతగ్గిపోతాయి
వెంపలిఆకుతొ:-వెంపలిఆకును కడిగి దంచి తీసిన
రసం రెండుచెంచాలమోతాదుగా రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి
పత్తిఆకుతొ:-పత్తిఆకును కడిగి
దంచి తీసిన
రసం రెండుచెంచాలమోతాదుగా రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి
నేలతాడితొ:-
నేలతాడిచెట్టువేళ్ళుమూలికలషాపులలొ
దొరకుతాయి వాటినితెచ్చి శుబ్రంగా కడిగి ఆరబెట్టి
దంచి వస్త్రఘూళితంచేశి నిలువవుంచుకోవాలి
ఒకకప్పునీటిలొ రెండుచెంచాలపొడిని కలిపి
రెండుపూటలా
సేవిస్తే రాళ్ళుకరిగిపోతాయి

మూత్రంభంధింపబడితె

*కలబందతొ:-రోజూ రెండుపూటలా30గ్రా"కలబంద
గుజ్జును అరకప్పు పాలలొ కొంచెంనీరుకూడవేసి
చెం
చాతొగిలక్కొట్టితగుమాత్రంగా కండచెక్కరవేసి
సేవిస్తెమూత్రభంధంవిడిపొయిమూత్రందరళంగావస్తుంది
ఉత్తరేణితొ:-ఉత్తరేణి సమూల కషాయం అరకప్పుమోతాదు
గాకండచెక్కర కలిపి సెవిస్తె
మూత్రందరళంగావస్తుంది
ఇంగువతొ:-మంచి ఇంగువను పొంగించి కందిగింజంత
మాత్రమే మాత్రలాగా చేసుకుని మంచినీటితో
రెండుపూటలా
సేవిస్తెమూత్రభంధంవిడిపొయి
మూత్రందరళంగావస్తుంది
దువ్వెనకాయలచెట్టుతొ:-దీనినేఅతిబల ముద్రబెండాంటారు
ఈచెట్టుబెరడును నీటితొ కలిపి దంచి రసంతీసి పూటకు
రెణ్డుచెంచాల మోతాదుగా కొంచెంకండచెక్కర కలుపుకొని
తాగితే
మూత్రందరళంగావస్తుంది
కొబ్బరినీటితొ:-బాగాముదిరిన కొబ్బరికాయలనీరు
పూటకు ఒకగ్లాసు రెండుపూటలా సేవిస్తే
మూత్రందరళంగావస్తుంది

28, ఆగస్టు 2009, శుక్రవారం

మూత్రంలొ తెలుపుపోతుంటె

మామిడిపూతతొ:-కొంతమందికిమూత్రంతోపాటుకఫం
లాగ తెల్లనిపదార్ధంవిసర్జింపబడుతుంది దీనివల్ల వారు
బలహీనపడ్పోతారు మామిడిపూతనుగాలికినీడలొఆరబెట్టి
నిలువచేసుకొవాలిదానినిపొడిచేసుకొని పావుచెంచాపొడిని
అరకప్పునీట్లొకలుపుకొనిసేవిస్తెమూత్రంలోతెలుపునివారించ
బడుతుంది పూతదొరకనిసమయంలొ మామిడిటెంక
లొపొల ఉండె జీడినిచూర్ణంచేసి పై విధంగా ఉపయోగించవచ్చు

మూత్రంలో--వీర్యంపోతుంటె

తిప్పతీగతొ:-50గ్రాములు తిప్పతీగకాడలను పావులిటరు
నీటిలొనలగగొట్టి ఒకకప్పు కషాయానికి మరిగించి వడపొసి
ఒకచెంచా కండచెక్కర కలిపి గోరువెచ్చగాతాగాలి ఇలా
రెండు పూటలూతాగితె మూత్రంలొపొయెఇంద్రియంతగ్గుతుంది
బెండకాయతొ:-లేతబెండకాయ ముక్కలను గ్లాసు నీటిలొవేసి
సగానికి మరిగించి వడపోసిరెండుగావిభజించి పూటకు
సగంకషాయంలొ చెంచా చెక్కరకలిపితాగాలి
పల్లేరుకాయలతొ:-
పల్లేరుకాయలను దంచి చూర్ణంచేసి
జల్లెడపట్టిదానికి సమానంగాపటికబెల్లంపొడి కలుపుకోవాలి
రోజు రెండుపూట్లా ఒకచెంచాపొడి ఒకకప్పు మంచినీటిలో
కలిపితాగితేమూత్రంలొ వీర్యంపోవడంఆగిపోతుంది

27, ఆగస్టు 2009, గురువారం

మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె

(१)*గరికతొ:-ఒకకప్పు పాలగ్లాసులొ20గ్రా"గరిక ముక్కలు
వేసిమరిగించి దించి వడపొసిగోరువెచ్చగా రెండుపూట్లా
తాగాలి
(२)*చింతాకుతొ:-మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె
గుప్పెడుచింతచిగురు తింటెవెంటనేతగ్గిపోతుంది లేదా
రెండుపూటలారెండుచెంచాలచింతాకురసంతాగినా
వెంటనేతగ్గిపోతుంది
(३)*బెండకాయతొ:-బెండకాయచిన్నముక్కలుగాకోసి
గుప్పెడుముక్కలను గ్లాసునీటిలొవేసికప్పునీరుమిగిలే
వరకుమరిగించి దించి వడపోసి అరచెంచాపంచదార
కలిపి పూటకు అరకప్పు మొతాదుగామూడుపూటలా
తాగాలి ఇలరెండులెదామూడురోజులుచేస్తె
మూత్రవిసర్జనలొ ఏవిధమైన బాధవుండదు
మూత్రంచాలాసులువుగావిసర్జింపబడుతుంది
స్త్రీ,పురుఘులకు కూడామర్మావయాలకుచెందిన
మంట,పోటుమొదొలైనసమస్యలన్నితగ్గిపోతాయి

మూత్రద్వారంలొ-మంట

బొప్పయిపండుతొ:-బాగాపండిన బొప్పయిపండుత్చ్చి
పైతోలు తీసి లోపలిగుజ్జును ముక్కలుగాచేసిరెండు
లేదామూడుపూటలాతింటేమూత్రద్వారంలొ-మంట
తగ్గిపొతొంది
రుద్రజడాకులతొ:-సబ్జాచెట్టునేరుద్రజడఅంటారు
దీనిఆకులను20గ్రా॥తీసుకునికొంచెంనీరుపోసి
దంచి రసంతీసి పూటకు2చెంచాలు3పూటలాసేవిస్తె
మూత్రద్వారంలొమంటమూత్రనాళంలొవాపు
తగ్గిపోతాయి

మూత్రద్వారంలొ-మంట

నల్లతుమ్మతొ:-నల్లతుమ్మచెట్టుకువచ్చె జిగురును
చింతగింజంత 2or3కప్పులనీటిలొకలిపి కరిగించి
తాగితే మూత్రద్వారంలొమంట తగ్గిపోతుంది

మూత్రద్వారంలో--మంట

అతిబలాఅకులతొ:-అతిబలఅనగా దువ్వెనకాయలచెట్టు
దీనినె
ముద్రబెండ,తుత్తురబెండఅనికూడాఅంటారు
ఈఆకులను20గ్రా॥మొతాదుగా తీసుకుని కొంచెంనీటిలొ
కలిపి దంచి రసంతీసి ఆరసంలొ ఒకచెంచా కండచెక్కెరకలిపి
2or3సేవిస్తెమూత్రద్వారంలోమంట,వాపు,పోటుత్గ్గటమేకాక

మూత్రంసఫీగాఅవటమేకాకశరీరానికిబలంకలుగుతుంది

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

చేమంతిపూలతొ:-చేమంతిపూలరేకలుతెచ్చిఆరబెట్టి
బాగాఎండినతరువాత దంచి పొడిచేసుకోవాలి
ఈ పొడి పూటకు అరచెంచా మొతాదుగా ఒకచెంచా
తేనెతో చప్పరిస్తె క్రమంగా ముత్రరోగాలు హరించుకుపోతాయి

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

ఉత్తరేణితొ:-ఉత్తరేణిఆకులు,వెన్నులు,వేర్లుసమంగాతెచ్చి
కడిగి నీడలొగాలికి ఆరబెట్టి దంచి పొడిచేసుకోవాలి
ఒకగ్లాసునీటిలొ ఒకచెంచాపొడివేసి ఒకకప్పు కషాయం
మిగిలేవరకు మరిగించి వడపోసి తాగితే అసలు రక్తం
లేనివారికి కూడా రక్తం పుడుతుంది అంటె కాలెయం ప్లీహం
శుద్దిచెంది మంచిరక్తాన్ని పుట్టిస్తుంది మూత్రపిండాలుబాగుపడతాయి

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

జీలకర్రతో:-రెండుకప్పులనీటిలొ ఒకచెంచాజీలకర్ర
నలగ్గొట్టి వేసి అరకప్పుకషాయం మిగిలేవరకు
మరిగించి వడపోసి రెండుపూటలూతాగితే
మూత్రపిండాలు తొందరగా బాగుపడతాయి

26, ఆగస్టు 2009, బుధవారం

మూత్రపిండాలు--సమస్యలు--నివారణ

పల్లెరుకాయలతొ:-పెద్దపల్లేరు లేక చిన్నపల్లేరుకాయలనుతెచ్చి
కడిగి ఆరబెట్టి దంచి జల్లించి మెత్తని పొడిగా చేసి
నిల్వవుంచుకోవాలి ఈ పొడిని అరచెంచానుండిఒకచెంచావరకు
అరగ్లాసునీటిలొ కలిపి రెండుపూటలా తగుతూవుంటే క్రమంగా
మూత్రపిండాలలొ వాపు,మూత్రపిండాలుక్రుశింవిపోవడం,
పోటురావడం,మురికిచేరడం,సమస్యలునివారించబడి
మూత్రంసాఫీగా అవుతుంది

మధుమేహసమస్య

మర్రిచెట్టుకు ఉత్తరం వైపువుండె బెరడుఅలాతీసినచొట
(చెట్టుకు)ఆవుపేడ బాగాఅద్దాలి
చెక్కను ఇంటికితెచ్చి బెత్తుడుపరిమాణంలొ ముక్కలు
కొట్టి కడిగి 4to5రోజులుఎండలొపెట్టి అతరువాత నీడలొ
గాలితగిలేచొట ఆరబెట్టాలి
ఒకప్ద్దగ్లాసునీటిలొ ఒకముక్కవేసి 24గంటలునానబెట్టి
ముక్కతొపాటు పొయ్యిమీదపెట్టిసగం కషాయంమిగిలెవరకు
మరగించాలి వడపొసిరెండుభాగాలుచేసి ఆహారానికి గంట
ముందుగా సేవించాలి దీనినిఒకసంవత్సరం వరకు వాదాలి
ఇలాచేస్తె మధుమేహం అదుపులొకి
రావడమేకకుండా చచ్చుబడిన మాంసకండరాలు కూడా
తిరిగిఅదుపులొకివస్తాయి

వాసనతెలియని--సమస్య

రెండుపూటలా ఆహారానికిఒకగంటముందు
ప్రశస్తమైన
మంచినీటివలెవుండె వేపనూనె3చుక్కలు
ముక్కులొవేసుకోవాలి తరువాత వేడినీటిలొ
పసుపువేసి ఆవిరితీసుకోవాలి ఇలాకొద్దిరోజులుచేస్తుంటే
ముక్కులొ కొయ్యకండరాలు కరిగిముక్కుచీదినపుడు
కొంచెంఎర్రగానీరువస్తుంది అందుకుకంగారుపడక్కరలేదు
కొయ్యకండరం కరిగినపుడుఅలావస్తుంది ఇలాచేస్తుంటే
తిరిగివాసనవస్తుంది

మత్తుపానీయం--మానడంఎలా...?

ప్రయోగం:-అసలైన దేశవాళ్ళి వాము కొత్తది 5కేజీల
తీసుకుని శుబ్రంగాచెరిగి నలగగొట్టి ఒకపాత్రలోపోసి
అందులో80
కేజీలునీరు కలిపిరెండురోజులపాటు నిల్వ
ఉంచాలి మద్యమద్యలొ కలుపుతుండాలిఆపాత్రను
పొయ్యిమీదపెట్టి నలుగోవంతు అనగా 20కేజీల కషాయం
మిగిలె వరకు చిన్నమంటపై మరిగించి దించ వడపోసుకోవాలి
ఈవాము అరుకును సాయంత్రంపూట 20గ్రా॥ మోతాదుగా
కొద్దికొద్దిగా తాగుడుకు బానిస అయిన వారి చేతతాగించాలి
ఇలారోజుకు 2to3సార్లు తగించవచ్చు ఈవిధంగా1or2నెలలు
సేవిస్తె మందగించిన ఆకలి పెరగడం,తొందరగ్గభొజనం
చెయ్యలనిపించడం,కడుపులోకల్మషమంతా విరేచనంద్వారా
పడిపోవడం,మొదలైనమార్పులు జరుగుతూతాగుడుపై
వ్యామోహంతగ్గుతూ ఆదురలవాటునుండి బయటపడగల్గుతారు

హెపటైటీస్-బి

గోమూత్ర ప్రయోగం:-8పొరల నూలుబట్టలొ వడపోసిన
అరకప్పు దేశవాళీ ఆవుమూత్రంలో ఎండుకరకపెచ్చులపొడి
3గ్రా॥కలిపి పరగడుపున సేవించాలి
సొరకాయప్రయోగం:-పైతోలుతీయకుండా సొరకాయను కోసి
ఆముక్కలను దంచితీసిన రసం
బట్టలొవడపొసి అందులొ
5మిరియాలపొడి,5తులసిఆకులపొడి,5పుదీనాకులపొడి
కలిపి సాయంత్రంపూట అరగ్లాసు మోతాదుగా సేవించాలి
పునర్నవాదిచూర్ణప్రయోగం:-తెల్లగలిజేరు సమూలచూర్ణం
గుంటగలర
సమూలచూర్ణం, నేలవేముసమూలచూర్ణం,
తిప్పతీగ
సమూలచూర్ణం,కామంచిసమూలచూర్ణం,
సుఘందపాలవేర్లచూర్ణం సమంగా కలిపి నిల్వవుంచుకోవాలి
ఒకగ్లాసు నీటిలొ ఒకచెంచాచూర్ణంవేసి అరగ్లాసు కషాయానికి
మరిగించి వడపొసి రెండుభాగాలుగాచేసి రెండుపూటలా
పూటకు పావుగ్లాసు కషాయంలో ఒకచెంచాతేనెకలిపి సేవించాలి
ఏమితినకూడదు:-కారం,వేపుడుకూరలు,మాంసం,చేపలు,
గుడ్లు,మసలాకూరలు
తినకూడదు
ఏమితినవచ్చు:- పాతగోదుమలజావ, పాతబియ్యపుజావ,
ముల్లంగి,కొబ్బరి,బొప్పయి,దానిమ్మ
తినవచ్చు

నోటిలోపొక్కులకు

చిన్నకరక్కాయ(పిందె)తీసుకుని సానరయి పై
గంధంలా అరగదీసి ఆగంధాన్నినోటిలొవచ్చె
నంజు పొక్కులపైన లేపనంచేయ్యాలి
ఇలరోజుకు2to3సార్లు లేపనంచెస్తె
నోటిలోపొక్కులు తగ్గిపోతాయి
*నోటిలోపొక్కులకు ఆహారంలోదేశవాళీ
టమొటాలు బాగా వాడాలి*

సీకాకాయ--షాంపు

సీకాకాయపొడి15గ్రా॥,ఉసిరికముక్కలపొడి15గ్రా..
అరలీటరు మంచినీటిలొ వేసి రాత్రినుండిఉదయం
వరకు నానబెట్టాలి
ఉదయంపూట చిన్నమంటపై
అరపావులీటరుకు మరగించి వడపోసిగోరువెచ్చగా
తలవెంట్రుకల కుదుళ్ళుకు సున్నితంగా లేపనంచేసి
10to20నిముషాలు ఆగిస్నానంచేయాలి
ఇలా వారానికి1to2సార్లు చేస్తె వెంట్రుకలుఊడటం
ఆగి కుదుళ్ళు గట్టిపడి జుట్టుఆరోగ్యగా పొడవుగా చిక్కగా
పెరుగుతుంది

చర్మరోగాలకు

వాయింటచెట్టుపూలు రెండురంగులలొదొరకుతాయి
అవి పచ్చన,తెలుపు,
రెండురంగులలొదొరకుతాయి
వీటిని తెచ్చి ముక్కలుచేసి దంచి రసం తీయాలి
ఈ రసంతొ కొబ్బరినూనెగాని,నువ్వులనూనెగాని
కలిపి చిన్నమంట పైన నూనె మిగిలేవరకు మరిగించి
వడపొసి నిల్వ చేసుకొవాలి ఈతైలాన్నిరోజుకు2to3
సార్లుశరిరంపై లేపనంచేస్తె తామర,గజ్జి,చిడుము,దురదలు
పూర్తిగా తగ్గిపోతాయి

మూర్చ--తగ్గుటకు

అవిసెపూలు10గ్రా॥,అవిసెఆకులు10గ్రా॥,మిరియాలపొడి2g..
ఒకేరెబ్బవుండె వెల్లులిపాయ వీటిని పావుకప్పు గోమూత్రంతో
కలిపి మెత్తగా నూరి బట్టలొ వడపోసి రోజూపరగడుపునసేవించాలిదీనినే2to3చుక్కలు
ముక్కులొ వేసుకొని పీల్చాలి।ఇలాచేస్తుంటే
మూర్చా,అపస్మారం,హరించుకుపోతాయి

అతికొవ్వు(లావు)--తగ్గుటకు

తక్కలిచెట్టు పూలరసంగాని,ఆకురసంగాని,ఒకటి,
రెండు,చెంచాలమోతాదుగా సమంగాతేనె కలిపి
రెండుపూటలా ఆహారానికి గంటముందుసేవిస్తే
అతి బలుపు అతివాతం,హరించుకుపోయి
శరీరం సమంగా తయారౌతుంది

25, ఆగస్టు 2009, మంగళవారం

నేలతాడితో--కలరానిర్మూలన

నేలతాడిదుంపలను బియ్యంకడిగిన నీటితో మెత్తగా నూరి
బొడ్డులోపల,బొడ్డుచుట్టూ చిక్కగా పట్టువేస్తుంటె
కలరావ్యాధి నశించిపోతొంది

చింతాకుతో--కలరా--నిర్మూలన

చింతాకురసం పావులీటరు,మిరియాలపొడి5గ్రా..
నువ్వులనూనె 10చుక్కలు తీసుకుని కలిపి
వేడిచేసి దించి చల్లార్చి తగితే అప్పటికప్పుడు
కలరాహరించుకు పోతుంది

కలరా,వాంతులు--నిర్మూలన

బాగాశుబ్రంచేసిన సోపుగింజలు30గ్రా..రోటిలోవేసి
తగినంత కలబంద గుజ్జురసం కలిపి ఒకరోజంతా బాగా
నూరి రసంఇగిరిపొతె మరలా రసంపొసి నూరుతూ
24గంటలు తరవాత ఆముద్దను బఠాణీగింజంతగోళీలుగా
చేసి నీడలొ బాగా గాలితగిలేలాఎండబెట్టి నిల్వవుంచుకోవాలి
ఈ మాత్రలు పూటకు ఒకటి చొప్పున రెండు పూటలూసేవిస్తే
వాంతులు తగ్గిపొతాయి

చలువమిరియాలతొ--కలరానిర్మూలన

చలువమిరియాలురెండున్నరగ్రాములు,మామూలుమిరియాలు
2గ్రా..,వేపపువ్వు
రెండున్నరగ్రాములు,సైందవలవణం10గ్రా..
కలిపి కొంచెం నలగ్గొట్టి ఒకలీటరు నీటిలొవేసి అరలిటరు కషాయానికి
మరిగించి వడపోయాలి
ఈ కషాయాని అరగంఅటకు ఒకసారి50గ్రా..పెద్దలకు తాగించాలి.
ఈవిధంగా కషాయం అంతా అయిపొయేవరకు ప్రతి
అరగంఅటకు ఒకసారి
సెవిస్తే కలరారోగం నిమిషాల మీద తగ్గిపోతుంది

24, ఆగస్టు 2009, సోమవారం

ఎండుమిరపకాయలతొ--కలరానిర్మూలన

ఎండుమిరపకాయల్ని రోటిలోవేసి తగినన్ని నీరుపోసిమెత్తటి
ముద్దలానూరాలి ఈముద్దను బఠానీగింజంత మోతాదుగాపెద్దలకు
సెనగగింజంత
మోతాదుగా పిల్లలకు జొన్నగింజంతమోతాదుగా
పసిపిల్లలకు తయారుచేసినీడలొ గలికిఆరబెట్టి నిల్వ వుంచుకోవాలి
ఆపదసమయంలొ తయారుచేసినవెంట్నేకూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ మాత్రలను గంటకు ఒకటిచ్చొప్పున మింగి అనుపమానంగా
లవంగకషాయం పెద్దలకు50గ్రా..పిల్లలకు25గ్రా..
పసిపిల్లలకు10గ్రా..
మోతాదుగా తాగించాలి.ఇలా రోగస్తాయినిబట్టి 5మాత్రలు మింగితే
ప్రాణాలపై ఆశవదులుకున్న ఆఖరిసమయంలొకూడా ఈమాత్రలు
కలరా రోగులను కాపాడతాయని పెద్దలుసెలవిచ్చారు.
లవంగకషాయంతయారీవిధానం:-ఒకగ్లాసులొ 3to4లవంగాలు
వేసి సగానికి మరిగించి వడపోసుకోవాలి ఈకషాయాన్ని చల్లగా
చేసిపైన తెలిపినట్లు ఉపయోగించుకోవాలి

సొంటితో

సొంటి దోరగావేయించిదంచినపొడి3గ్రా..
ప్రత్తిగింజలపొడి3గ్రా..,నల్లనువ్వులపొడి3గ్రా..వీటిని
నాటు ఆవుమూత్రంతో మెత్తగానూరి ఆముద్దను వాచివున్న
వ్రుషణంపై పట్టులాగవేసి బట్టతోకడుతూవుంటేనాలుగైదుపట్లు
వేసేటప్పటికి అండకోశాలవాపు,పోటు హరించుకుపోతాయి

ఆముదంతో--విరేచనం

4చెంచాల వంటాముదం,2చెంచాలతేనె,2చెంచాలఅల్లంరసం
కలిపి 3సార్లుపొంగించి దించి గోరువెచ్చగా అయిన తరువాత
తెల్లవారుఝామున అండవ్రుద్ది(బుడ్డ)రోగులుసేవించాలి.
దీనివల్లసుఖవిరోచనంజరిగి అండవాయువు ఉపశమనం కల్గుతుంది

ఒరిబీజ(బుడ్డ)నివారణ--ఆహారనియమాలు

పాటించవల్సినవి:-సుఖవిరోచనం,లేక ఇనేమాచేసుకోవడం
చెమతరప్పించడం,ఆహారంలొఆముదంవాడటం,
రోజూగోమూత్రం సేవించడం,మునక్కాయ,పొట్లకాయ,
గలిజేరుకూర,ఉల్లిగడ్డ,వెల్లుల్లి,తేనె,మజ్జిగ,గోరువెచ్చనినీరు,
కుండలొకాచిననేయ్యివాడటం,తాంబూలంవేసుకోవడం ,వంటివిపాటించాలి
పాటించకూడనివి:-మాంసం,పెరుగు,మినుములు,
ఉడకని,చల్లని,అన్నము
బచ్చలికూర,త్వరగా అరగని పదార్దాలు సేవించరాదు.

కరక్కాయతొ---ఒరిబీజ(బుడ్డ)నివారణ

కరకబెరడు,సొంటి,గసగసాలు,తెగడ,వీటినిసమబాగాలుగా
తీసుకుని దంచిపొడిచేసి ఆపొడిని మేలిరకమైన వంటాముదంతొ
కలిపి మెత్తగానూరి లేహ్యంలాగా తయారుచేసుకుని నిల్వుచేసుకొవాలి
ఈలేహ్యాన్ని రోజూపరగడుపున 5గ్రా..మోతాదుగా తింటూవుంటే
అన్నిరకాల అండవ్రుద్దులు అద్రుశ్యమైపోతాయి

వాకుడుతో---ఒరిబీజ(బుడ్డ్)నివారణ

వాకుడుచెట్టువేర్ల పై తోలు10గ్రా..మిరియాలు7,కలిపిమెత్తగానూరి
దీన్ని ఒకమొతాదుగా పరగడున మంచినీటితొ 7రోజులు సెవిస్తె
ఒరిబీజ(బుడ్డ్)నివారణమౌతాయి

ఒరబీజం--నివారణ

కరక్కాయముక్కలు 3గ్రా..దోరగావేయించినపిప్పళ్ళు3గ్రా..
సైంధవలవణం3గ్రా.. వీటిని దంచి చూర్ణంచేసి ఒకచెంచా
వంటాముదంతో కలిపి పరగడుపునసేవిస్తే బుడ్డలు హరించుకుపోతాయి

ఒరబీజ-లేపనాలు,కట్లు

  • ఈతచెట్టుబొర్రలొ ఉండె గుజ్జును మెత్తగా నూరి ఒరబీజంపైనకట్టుకట్టాలి
.లేతకొబ్బరిని మెత్తగతురిమి కొంచెంవేడిచేసి బట్టలొపరిచి వాచిన
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.గోగూర గానిబంతిఆకులుగానినీటిఆవిరిపైఉడకబ్బెట్టితొక్కిగోరువెచ్చగా
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.ఏకట్టు కటినా రోజుకునాల్గుగైదు కట్లుమార్చాలి.
ఈవిధంగా చెస్తే క్రమంగావాపు పోటు తగ్గిపోతాయి

గర్బస్రావం జరకుండా--ఏంచేయ్యాలి

దానిమ్మచెట్టువేర్లు,ఆకులు,మానుపైబెరడు,పువ్వు,కాయ
వీటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా దంచి ఆపదార్దానికి
నాలుగురెట్లు నీరుపోసి ఒకవంతుకషాయం మిగిలేవరకూ
మరగబెట్టాలి వడపోసి శుబ్రమైన పాత్రలొపోసి దానికి రెండురెట్లు
కండచెక్కెర కలిపి చిన్నమంటపై తేనెపాకం వచ్చేవరకూ మరిగించి
దించి చల్లార్చి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ దానిమ్మపాకాన్ని
రోజుకు నాల్గుగైదు సార్లు5గ్రా...మోతాదుగా ఒకకప్పు మంచినీటితో
కలిపి తాగితే గర్బస్రావం జరగదు*ఈపాకం రక్తవిరేచనాల సమస్య కూడా
పోగొడుతుంది

23, ఆగస్టు 2009, ఆదివారం

వాక్ సౌందర్యానికి

మాటలుపూర్తిగా రాని పిల్లలకు మూగ,చెవిటి,కఫంఅధికంగా
ఉండి మూర్ఛ రోగముండే పిల్లలకు కాళు ,చేతులు చచ్చుబడి
నరాలబలహీనతతో బాధపడెపిల్లలకు,నత్తి,నంగి,స్వరబేధములతో
అవస్తపడె చిన్నారులకు ఈ వాగ్దేవీరసాయనం అద్బుతంగాపనిచేస్తుంది
తయారీవిధానం:-వసకొమ్ములను కావలిసినన్ని తెచ్చి ఒకరోజంతా
మంచినీటిలో నానబెట్టి తీసి తుడిచి మెత్తగానలగగొట్టి దంచి జల్లించి
వస్త్రఘూళితం చేసి అతి మెత్తని వసచూర్ణంతయారుచేసుకోవాలి
ఈచూర్ణాన్నిశుబ్రంచేసిన కొత్తకుండలొపోసి తగినంత తేనె కలిపి పిసికి
ఆముద్దకుపైన రెండు అంగుళాఎత్తుగవుండేటట్లు మరికొంత తేనెపోసి
పైన మట్టిమూకుడు మూసి దళసరి నూలుబట్ట3to4 వరుసలు
మూతపైన పరిచి తాడుతో గట్టిగా గాలిచొరబడకుండా కట్టుకట్టాలి .
ఈ పాత్రను గాలిచొరబడకుండా40రోజులపాటువుంచి తీసి వేరే గాజుపాత్ర
లోనిలువచేసుకోవాలి
దీన్నిపిల్లల వయసునుబట్టి అరగ్రాము నుండి ప్రారంభించి కొద్దికొద్దిగా
పెంచుతూ 1,or 2,గ్రా..మోతాదుగా రెండుపూటలా సెవింపచేస్తుంటె
మంచి ఫలితాలు కలుగుతాయి

ముఖకాంతికి

కలువరేకులపొడి ,అతిమధురంపొడి, మంచిపసుపుకొమ్ములపొడీ,
వేపాకులపొడీ. సంమంగా కలిపి నిలువచేసుకోవాలి ఈమిశ్రమాన్ని
తగినంత తేనెతొ మెత్తగా నూరి ముఖానికి రాసుకుని ఆరినతరువాత
కడుగుకుంటే ముఖసౌందర్యంపెరుగుతుంది

22, ఆగస్టు 2009, శనివారం

బొల్లిమచ్చలు

ఒకపాత్రలొ అరలీటరు మంచినీరు పోసి అందులొ ఉసిరికాయ పెచ్చులు
10.గ్రా..,కాచు10.గ్రా.. వేసి చిన్నమంటపైన పావులీటరు కషాయం
మిగిలే వరకు మరిగించాలి.వడపోసి ఆకషాయాన్ని రెండుభాగాలుగాచేసి
రెండూపూటలా సగం సగం కషాయం తాగేముందు అందులో పావుచెంచా
బావంచాలపొడి కలిపి తాగాలి ఈవిధంగా రోజూచేస్తెబొల్లిమచ్చలు తగ్గి
మామూలు చర్మం లా అవుతుంది

మనోసౌందర్యానికి

కొంతమందికి శరీరంలొ పైత్యం అతిగా ప్రకోపించి తనచుట్టూ వున్నవాళతో
గొడవలు పడుతు ఇబ్బందులు సృష్ఠిస్తుంటారు వారికి
పుచ్చకాయ తెచ్చి సగానికి కోసి లోపలున్న గుజ్జునుకొంతవరకు
తీసి తలకు టోపీ లాగా అమర్చాలి ఇలా15 నిముషాలు పాటుచేస్తే
పుచ్చకాయలొని చలువగుణం తలలోకి ప్రవేశించి పైత్యాన్ని తగ్గించటంతొ
పాటూ మనోసౌందర్యాన్నిపెంపొందిస్తుంది
పుచ్చకాయ దొరకకపోతే ముడిపెసలు నీటిలొ నానబెట్టి ఉడకబెటి
మెత్తగా పప్పులాగ రుబ్బి ఆముద్దను చల్లగా అయిన తరువాత
తలపైన పట్టులాగావేయాలి ఇలాచేయడంవల్ల తలలోని పైత్యం
తగ్గిమామూలు మనుషులౌతారు

మొటిమలు--నివారణ

(1).మంజిష్ఠ,తేనె కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
(2).మద్దిచెట్టు బెరడు,తేనే
కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
(3).జాజికాయ,చందనం
కలిపి మెత్తగానూరిన మిశ్రమం గాని
రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకుని ఉదయం
గోరువెచ్చని నీటితోకడుగుతూ వుంటే మొటిమలు తగ్గి
ముఖసౌందర్యంపెరుగుతుంది

21, ఆగస్టు 2009, శుక్రవారం

చుండ్రు-నివారణ

మందారపూలు మెత్తగాదంచి బట్టలోవేసి పిండినరసం పావుకేజి
నువ్వులనూనె
పావుకేజి కలిపి చిన్నమంటపైన నూనె మత్రమే
మిగిలే వరకు మరిగించి వదపోసి నిలువవుంచుకోవాలి
రోజూ ఈ తైలాన్ని తలకు రాస్తుంటె క్రమంగా చుండ్రు తగ్గిపోతుంది

అతిచెమత,అతిదుర్వాసన--తగ్గుతకు

కరక్కాయలపొడి,తులసిఆకులపొడి,వేపాకుపొడి,
మారేడుఆకులపొడి,తగినన్నినీరు కలిపి మెత్తగానూరి
స్నానానికి గంటముందు శరీరమంతా నలుగుపెట్టుకోవాలి
ముఖ్యంగా చంకలు,తొడలు,గజ్జలు,పిరుదులు,గొంతు,మెడ,
పొట్ట ఈభాగాలలో బాగారుద్ది అదిపూర్తిగా ఆరినతరువాత
గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే క్రమంగాఅతిచెమత,అతిదుర్వాసన
తగ్గిపోయి చర్మసౌందర్యం పెరుగుతుంది

మంచి వెంట్రుకలకు -మంచి నియమాలు

అతికారం,అతిఉప్పు, వెంట్రుకలను పాడుఛేస్తుంది.
బాగా తగ్గించి వాడాలి.షాంపులను,సబ్బులను,తలకు,రుద్దవద్దు.
రోజూ కూరలతయారీలో నువ్వులనూనె వాడండి.బెల్లం,నువ్వులతో
చేసిన లడ్లు,కొబ్బరిలడ్లు,మినుపసున్నుండలు,పాతబెల్లంతయారు
చేసినవి.రెండుపూటలా బిడ్డలతో తినిపించండి.తలస్నానంచేసినప్రతిసారి
దువ్వెన శుబ్రంచేయాలి దిండ్లపైకవర్లు మారుస్తుండండి

దంత రోగాలకు-ధారుడ్యమైన పండ్ల పొడి.

పొంగించిన పటికపొడి 50గ్రాములు , మెత్తగా నూరి జల్లించని తుమ్మ బొగ్గుల పొడి 50గ్రాములు తీసుకుని ఈ మూడింటినీ కలిపి మరొకసారి జల్లించుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
ఈ పండ్ల పొడితో రోజూ పళ్ళు తోమి పావుగంట ఆగి కడుగుతూ వుంటే కదిలే పళ్ళు కూడా గట్టి పడతాయి.పళ్ళ పై ఉండే గారా , పాచి పూర్తిగా తొలగిపోతాయి మరియూ దాంతాలకు మెరుపు వస్తుంది.

రక్తపోటుకు - రంజైన పానీయం....


కావలసిన పదార్దాలు :- అల్లంరసం రెండు చెంచాలు,ధనియాల రసం రెండుచెంచాలు,నిమ్మరసం రెండు చెంచాలు,నీరు ఒక గ్లాసు..
తయారీ విధానం :-అల్లాన్ని మంచినీటితో దంచి రసం తీసి గాజు పాత్రలో పోసి కొంచెం సేపు నిలవ ఉంచాలి.అడుగున ముద్దలాగా పేరుకుని అసలైన రసం పైకి తెలుతుంది.అలా పైకి తేలిన ఆ నిజ రసాన్ని జాగ్రత్తగా వుంచుకొని రెండు చెంచాల మోతాదుగా గ్రహించాలి.అలాగే ధనియాలు,మంచినీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి రెండు చెంచాల రసం తీసుకోవాలి.అదే విధంగా నిమ్మ పండును పిండి విత్తనాలు లేకుండా రెండు చెంచాల రసం తీసుకోవాలి.ఈ మొత్తాన్ని మంచినీటితో కలపాలి.
వాడే విధానం :- రక్తపోటు తక్కువగా ఉన్నవారు పై మోతాదులో సగం మోతాదుగా రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు సేవించాలి.అధికంగా ఉన్నవారు పూర్తిమోతాదుగా రెండుపూటలా తాగాలి.ఇలా నలభై రోజులు సేవిస్తూ కారం,ఉప్పు,ఆహారంలో బాగా తగ్గించి మనసును ప్రసాంతంగా ఉంచుకుని జాగ్రత్తగా ఉంటే రక్తపోటు పూర్తిగా అదుపులోకి వస్తుంది...

కొవ్వును తగ్గించే - గో మూత్రం

ఏడు సార్లు వడపోసిన ఆవు మూత్రం లేదా ఆవు మూత్రంతో వండిన గోమూత్ర ఆర్కం 20 గ్రాములు,మంచితేనె 10గ్రాములు,త్రిఫలకల్పం పొడి 10గ్రాములు కలిపి రోజూ పరగడుపున సేవిస్తుంటే శరీరంలో అతిగా అనవసరంగా పెరిగిన కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది...............

అందమైన, ఆరోగ్యమైన-

నీదలో ఎండించిన లేతతుమ్మ ఆకులపొడి 100గ్రా;
తామరగింజలపప్పుపొడి 20గ్రా;కండచెక్కరపొడి 120గ్రా..
కలిపివుంచుకోవాలి.గర్బిణీ స్త్రీలకు మూడునెలలునిండీ
నాల్గోనెల మొదలైనరోజునుండి 40రోజులపాటుపావుచెంచా
పొడి ఒకకప్పు వేడిపాలలొ కలిపిగోరువెచ్చగా తాగితె అందమైన
సంతానంతానం కల్గుతుంది

గర్బిణీ స్త్రీ లకు -ఆకలితగ్గితే

ఓమ 50గ్రా;సొంటి50గ్రా; పిప్పళ్ళు50గ్రా;జీలకర్ర50గ్రా;
సైంధవలవణం 25గ్రా" తీసుకుని దోరగా వేయించిజల్లించి
నిలువచేసుకొవాలి పూటకు పావుచెంచాపొడి మోతాదుగా
ఒకచెంచా తేనెతొ కలిపి ఆహారానికి గంటముందు తీసుకుంటే
బాగా ఆకలి పుడుతుంది

About

shotmix


ShoutMix chat widget

online