29, సెప్టెంబర్ 2009, మంగళవారం

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు
(1)*ఈ ప్రక్రియ ప్రారంబించినరోజు నుండి 100రోజులు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి.
(2)*రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాలి. రాత్రి నిద్ర పోయేముందు ఒక రాగిచెంబులో పెద్దగ్లాసు నీరుపోసి
ఉదయంలేవగానే వేరే నీటితో నోరు పుక్కిలించి తరువాత ఆచెంబు లోనినీటిలొఒక టీస్పూను త్రిఫల రసాయనచూర్ణం కలిపి తాగాలి మీఅరిచేతులలోని అరికాళ్ళలోని 8 గ్రంధులపైన 10 నిమిషాలపాటు ఒత్తిడి కలిగించాలి
(3)*మర్రిఊడ,పుల్లల తో గాని మర్రికొమ్మల పుల్లలతో గాని పండ్లు తోమకోవాలి.
(4)*తూర్పుముఖంగా కూర్చుని ఆసనాలు,ముద్రలు, ప్రాణాయామము,ద్యానముచేయాలి.
(5)*5గంటలకులోహపానీయము ఒకగ్లాసు మోతాదుగా గోరువెచ్చగా సేవించాలి
లొహపానీయం తయారీవిధానము--మేలిమి బంగారం15గ్రా"..(999)వెండి30గ్రా"..చిలుములేని
స్వచ్చమైనరాగి60గ్రా"..ఈమూడు లోహాలను ఆరుగ్లాసుల మంచినీటిలో20ఎండు కిస్ మిస్ పండ్లు 2 అంజురుముక్కలను ఒకఎండుఖర్జూరము వేసి ఉదయము వరకు నానబెట్టి ఈపండ్లు తిని ఆనీళ్ళుతాగాలి.
(6)*6-15to6-30నువ్వులనూనెతో గోరువెచ్చగా శరీరమంతా మర్ద్నాచేయాలి
(7)*7-00గంటలకు సుఘంద స్నానచూర్ణంతో స్నానంచేయాలి.
(8)*శతావరీ లేహ్యము ఒకచెంచామోతాదుగా తిని తరువాత రెండు కప్పుల ఆవుపాలలొ అశ్వగంధ,శిలాజిత్ కలిపినపొడిఒకచెంచాకలిపి ఉదయం8-00గంటలకు తాగాలి
(9)*1-00to10-00గంటలమద్యఎవరి అరుగుదలను బట్టి వారు భొజనము చేయవచ్చు
***భోజనములోవాడవలసినపదార్దాలు***
పాలిష్ తక్కువగా ఉన్నబియ్యం,ఆవుపాలు , ఆవునెయ్యి , ఉసిరికాయ, కొబ్బరిపచ్చడి, క్యారెట్, బీట్ రూట్,
దోసకాయ, నీరుల్లి, నువ్వులపొడి, నువ్వులనూనె, గంగపాయిలకూర, బచ్చలికూర, బూడిదగుమ్మడికాయ,
అరటికాయ, పాలకూర,నేతిలో వేయించిన మినపవడియాలు,అప్పడాలు, మిరియాలు, మునగపువ్వు
మునగాకు, మునగకాయల కూర, నేతిలో వేయించిన వెల్లులి, అల్లంసుఖనాముఖి చారు , సైంధవలవణం
మజ్జిగ, గేదెనెయ్యి, లేతబెండకాయలు, బార్లీపాయసం, గోధుమపాయసం, బియ్యంపాయసం,మినపసునుండలు
నేతి మినపగారెలు, మొదలైనపదార్దాలతో లబ్యమయ్యేవి అనుకూలమయ్యేవి, సేవించవచ్చు.
** ఆహారంతరువాత అరచెంచా హింగ్వాష్టక చూర్ణం నీటితో వేసుకోవాలి**
*ఉదయం8-00to8-10గంటలమద్యలో టెన్నిస్ రబ్బరుబంతిని తీసుకుని దాని ఆసనమునకు వ్రుషణములకు
మద్యన ఉండెటట్లు పెట్టి 10నిముషాలపాటు ఒక కుర్చిపైకూర్చోవాలి కుర్చునేటప్పుడు వదులుగావుండెబట్టలు
ధరించాలి. ఈబంతి ఆసనము, మరియు ,వ్రుషణములు మద్యభాగములో ఒత్తిడి కలిగించడంవలనవీర్య ప్రసరణ
సక్రమంగా జరుగుతుంది
మద్యాహ్నం ఒంటిగంటకు__ఆకలిని జీర్ణశక్తినిబట్టి ఆక్రోపళ్ళు, అరిటిపళ్ళు, ఆపిల్ పళ్ళు, ద్రాక్సపళ్ళు, దానిమ్మపళ్ళు, నేరేడు పళ్ళు, మర్రిపళ్ళు, రావిపళ్ళు, మేడిపళ్ళు, మామిడిపళ్ళూ నేరుగాకాని రసం
తీసుకునిగాని తాగవచ్చు.
కూరగాయలు__క్యారెట్ బీట్ రూట్ టొమేటో కలిపి తీసినరసం ఒకచెంచాతేనె కలిపి తాగాలి.
* సాయంత్రం4-00గంటలకు శతావరి రసాయంతినాలి అశ్వగంధ సేవించాలి
*సాయంత్రం5-00గంటలకు ఏదో ఒక పాయసం తాగాలి లేక రెండు నేతి గారెలు తినాలి.
*సాయత్రం6-45నిముశాలకు అరిచేతులకు అరిపాదాలకు ఒత్తిడి కలిగించాలి
*రాత్రి7-00గంటలకు పైనతెలిపినపదార్దాలతో ఆహారం సేవించాలి
*10-00గంటలకు నిద్రపోయే ముందు బాధంపాలు తాగాలి
***********

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online