9, సెప్టెంబర్ 2009, బుధవారం

నల్లవెంట్రుకలుకావాలా.....?

కరక్కాయ,ఉసిరికాయ,తాడికాయ,లోహచూర్ణం ఈ వస్తువులను
సమానభాగాలుగా మంచినీళ్ళతొ నూరి రసం తయారుచేయాలి
ఈరసానికి సమానంగా నల్లనువ్వులునూనె కలపాలి తరువాత
ఈరసంఎంతతూకం ఉంటుందొ అంతతూకంగా పచ్చిగుంటగలిజేరు
ఆకు రసం కలిపి బాగా కలియతిప్పాలి ఆపదార్దమంతా మట్టికుండలో
పోసి కట్టెలపొయ్యి మీద సన్నటి మంటమీద మరిగించాలి క్రమంగా
కుండలొ నీరంతాఇంకిపోయి నూనె మత్రమే మిగులుతుంది
ఈనూనెను దించి చల్లారిన తరువాత వడపోసి,ఆనూనెకుండకు
4to5వరుసలు బట్టవేసి గట్టిగాతాడుతొ కట్టి ఆకుండ మూతిచుట్టూ
బంకమట్టితో మెత్తి బంధనము చేసి అదిఆరినతరువాత దానిని
నెలరోజులపాటు భూమిలో పాతిపెట్టాలి నెలతరువాత ఆతైలాన్ని
తలకు బాగామర్దనాచేసి తలకు అరటిఆకును కట్టాలి 3గంటల
తరువాత ఆ ఆకును తీసి త్రిఫల కషాయంతో తలంటుకుని
స్నానంచేయాలి ఇలాచేస్తె క్రమంగా తెల్లవెంట్రుకలు నల్లబడ్తాయి
నల్లవెంట్రుకలు నెరవకుండా నిగనిగలాడతాయి

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online