29, సెప్టెంబర్ 2009, మంగళవారం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం
క్రితంలో తెలిపిన పద్దతులు పాటించి శరీరాన్ని క్రమబద్దం చేసుకున్న తరువాత ప్రయోగాలు ప్రారంభించాలి.నల్ల తుమ్మచెట్టుకు పూజచేసి చెట్టునుండి దాని లేత ఆకులు లెతకాయలూ పూలూ బంక పై బెరడు సమభాగాలుగాసేకరించాలి.వాటిని శుభ్రంచేసి ఆరబెట్టి దంచి చూర్ణాలు చేసుకుని అయిదుభాగాలు సమానంగా కలపాలి.తరువాత మొత్తంపొడిని పలుచని నూలు బట్టలో వస్త్రఘాళితం పట్టి మొత్తంతో సమంగా కండ చక్కెర పొడి కలిపి నిలువవుంచుకోవాలి.రోజూ ఉదయం పరగడుపును ఆవుమూత్రం సేవించిన గంట తరువాత చూర్ణం ఒక టీ స్పూన్ మోతాదుగాఅరచేతిలో వేసుకుని కొద్దికొద్దిగా చప్పరించి ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా పటిక బెల్లం కలిపి తాగాలి.ఇది పూర్తిగాజీర్ణమైన తరువాతే ఆహారం సేవించాలి.

బొటన వ్రేలిలో బోలెడంత శక్తి.

బొటన వ్రేలిలో బోలెడంత శక్తి.
హస్తప్రయోగ భాదితులైన యువకులంతా ముందుగా ప్రతిరోజూ రెండుపూటలా ఆహారానికి ముందు ఒక చేతిని మోచేతివద్ద వంకర లేకుండా చాచి పెట్టుకుని ఆ చేతి బొటనవేలును అడుగునుండి పై వరకు రెండవచేతి వేళ్ళతో వందసార్లు నొక్కి వదలాలి.తరువాత రెండవ చేతి బొటనవేలిని లూడా అలాగే నొక్కి వదలాలి.ఈ చిన్న ప్రక్రియ వల్ల అంతులేనంత మానసిక శక్తి పెరగడం మీరు గమనించవచ్చు.
బొటనవేలు నొక్కితే మనోశక్తి ఎలా పెరుగుతుంది ? అని మీకు సందేహం కలగవచ్చు .తలలో ఉండే దైవశక్యులకు ప్రతిరూపమైన భ్రుకుటిలోని అజ్గాచక్రం తలలోని సహస్రార చక్రం.ఈ రెండింటి మూలస్తానాలూ బొటనవేళ్ళలో దాగివుంటాయ్.అందువల్ల వాటిని నొక్కి వదలడం ద్వారా ఆ రెండు చక్రాలు చైతన్యవంతమై మనసులోని భయాలనూ ఆందోళనలను తొలగించి క్రమంగా అంతులేని మనో శక్తిని మనకందిశ్తాయి..ఇది చదివినప్పటికన్నా చేసిన తరువాత స్వానుభవం ద్వారా ఇది యధార్దమని మీరు తెలుసుకొనగలుగుతారు.
ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టి మనోశక్తిని పెంచుకుంటే తద్వారా శారీరక శక్తిని పొందవచ్చు.

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు

వీర్యంలో జీవకణాలులోపాలు--చిట్కాలు
(1)*ఈ ప్రక్రియ ప్రారంబించినరోజు నుండి 100రోజులు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి.
(2)*రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాలి. రాత్రి నిద్ర పోయేముందు ఒక రాగిచెంబులో పెద్దగ్లాసు నీరుపోసి
ఉదయంలేవగానే వేరే నీటితో నోరు పుక్కిలించి తరువాత ఆచెంబు లోనినీటిలొఒక టీస్పూను త్రిఫల రసాయనచూర్ణం కలిపి తాగాలి మీఅరిచేతులలోని అరికాళ్ళలోని 8 గ్రంధులపైన 10 నిమిషాలపాటు ఒత్తిడి కలిగించాలి
(3)*మర్రిఊడ,పుల్లల తో గాని మర్రికొమ్మల పుల్లలతో గాని పండ్లు తోమకోవాలి.
(4)*తూర్పుముఖంగా కూర్చుని ఆసనాలు,ముద్రలు, ప్రాణాయామము,ద్యానముచేయాలి.
(5)*5గంటలకులోహపానీయము ఒకగ్లాసు మోతాదుగా గోరువెచ్చగా సేవించాలి
లొహపానీయం తయారీవిధానము--మేలిమి బంగారం15గ్రా"..(999)వెండి30గ్రా"..చిలుములేని
స్వచ్చమైనరాగి60గ్రా"..ఈమూడు లోహాలను ఆరుగ్లాసుల మంచినీటిలో20ఎండు కిస్ మిస్ పండ్లు 2 అంజురుముక్కలను ఒకఎండుఖర్జూరము వేసి ఉదయము వరకు నానబెట్టి ఈపండ్లు తిని ఆనీళ్ళుతాగాలి.
(6)*6-15to6-30నువ్వులనూనెతో గోరువెచ్చగా శరీరమంతా మర్ద్నాచేయాలి
(7)*7-00గంటలకు సుఘంద స్నానచూర్ణంతో స్నానంచేయాలి.
(8)*శతావరీ లేహ్యము ఒకచెంచామోతాదుగా తిని తరువాత రెండు కప్పుల ఆవుపాలలొ అశ్వగంధ,శిలాజిత్ కలిపినపొడిఒకచెంచాకలిపి ఉదయం8-00గంటలకు తాగాలి
(9)*1-00to10-00గంటలమద్యఎవరి అరుగుదలను బట్టి వారు భొజనము చేయవచ్చు
***భోజనములోవాడవలసినపదార్దాలు***
పాలిష్ తక్కువగా ఉన్నబియ్యం,ఆవుపాలు , ఆవునెయ్యి , ఉసిరికాయ, కొబ్బరిపచ్చడి, క్యారెట్, బీట్ రూట్,
దోసకాయ, నీరుల్లి, నువ్వులపొడి, నువ్వులనూనె, గంగపాయిలకూర, బచ్చలికూర, బూడిదగుమ్మడికాయ,
అరటికాయ, పాలకూర,నేతిలో వేయించిన మినపవడియాలు,అప్పడాలు, మిరియాలు, మునగపువ్వు
మునగాకు, మునగకాయల కూర, నేతిలో వేయించిన వెల్లులి, అల్లంసుఖనాముఖి చారు , సైంధవలవణం
మజ్జిగ, గేదెనెయ్యి, లేతబెండకాయలు, బార్లీపాయసం, గోధుమపాయసం, బియ్యంపాయసం,మినపసునుండలు
నేతి మినపగారెలు, మొదలైనపదార్దాలతో లబ్యమయ్యేవి అనుకూలమయ్యేవి, సేవించవచ్చు.
** ఆహారంతరువాత అరచెంచా హింగ్వాష్టక చూర్ణం నీటితో వేసుకోవాలి**
*ఉదయం8-00to8-10గంటలమద్యలో టెన్నిస్ రబ్బరుబంతిని తీసుకుని దాని ఆసనమునకు వ్రుషణములకు
మద్యన ఉండెటట్లు పెట్టి 10నిముషాలపాటు ఒక కుర్చిపైకూర్చోవాలి కుర్చునేటప్పుడు వదులుగావుండెబట్టలు
ధరించాలి. ఈబంతి ఆసనము, మరియు ,వ్రుషణములు మద్యభాగములో ఒత్తిడి కలిగించడంవలనవీర్య ప్రసరణ
సక్రమంగా జరుగుతుంది
మద్యాహ్నం ఒంటిగంటకు__ఆకలిని జీర్ణశక్తినిబట్టి ఆక్రోపళ్ళు, అరిటిపళ్ళు, ఆపిల్ పళ్ళు, ద్రాక్సపళ్ళు, దానిమ్మపళ్ళు, నేరేడు పళ్ళు, మర్రిపళ్ళు, రావిపళ్ళు, మేడిపళ్ళు, మామిడిపళ్ళూ నేరుగాకాని రసం
తీసుకునిగాని తాగవచ్చు.
కూరగాయలు__క్యారెట్ బీట్ రూట్ టొమేటో కలిపి తీసినరసం ఒకచెంచాతేనె కలిపి తాగాలి.
* సాయంత్రం4-00గంటలకు శతావరి రసాయంతినాలి అశ్వగంధ సేవించాలి
*సాయంత్రం5-00గంటలకు ఏదో ఒక పాయసం తాగాలి లేక రెండు నేతి గారెలు తినాలి.
*సాయత్రం6-45నిముశాలకు అరిచేతులకు అరిపాదాలకు ఒత్తిడి కలిగించాలి
*రాత్రి7-00గంటలకు పైనతెలిపినపదార్దాలతో ఆహారం సేవించాలి
*10-00గంటలకు నిద్రపోయే ముందు బాధంపాలు తాగాలి
***********

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

జలుబు

వాము10గ్రా, పాతబెల్లము40గ్రా, ఈరెండూ కలిపి మెత్తగా దంచి అరలీటరు మంచినీటిలో వేసి,పావులీటరుమిగిలేవరకు
మరిగించి దించి వడగట్టుకోవాలి. అదిచల్లరిన తరువాత ఒకమోతాదుగా ఉదయంతాగాలి అదేవిధముగాకచుకుని
సాయంత్రం కూడా తాగాలి. ఈ విధముగా తాగితే జలుబు, పడిశము, గొంతులో శ్లేషము పూర్తిగా తగ్గటమేకాక
అగ్నిదీప్తి కలిగి బాగా ఆకలి పుట్టి జీర్ణశక్తి పెరుగుతుంది

జలుబు

మంచి పసుపు, పటికబెల్లం సమభాగాలుగా తీసుకుని నిప్పులమీద వేసి ఆపొగను పీల్చాలి
రోజూ రెండు లేక మూడు సార్లు చేస్తె ఎంత తీవ్రమైన జలుబైనాతగ్గిపోతుంది

తుమ్ములు

దెశవాళీగులాబీ పూలరేకలు100గ్రా
నువ్వులనూనె...........................100గ్రా
తీసుకుని నూనె పొయ్యి మీద పెట్టి మరిగిస్తు గులాబి రేకలను అందులో వేస్తూ మొత్తము రేకలు
నల్లగామాడిపోయి నూనెమత్రమే మిగిలినతరువాత దించి వడపోసి నిలువచేసుకోవాలి
ఈతైలము రెండుపూటలా రెండు చుక్కలు ముక్కుల్లొ వేస్తూవుంటే అధికముగా వచ్చె తుమ్ములు
నివారించబడతాయి

23, సెప్టెంబర్ 2009, బుధవారం

ధూపం

స్త్రీలు యోనిని ముందుగా గోరువెచ్చని నీటితో కడిగి తరువాత మంచి గంధంకలిపిన నీటితోకడిగి
తరువాత సాంబ్రణి పొగ వేస్తూ వుంటె యోని యెల్లపుడు మంచి వాసనతో గుభాళి స్తూ
సంభోగంలో బర్తకు ఇంపుగా రతి ప్రేరకంగా ఉంటుంది

రజస్వల కాని ఆడపిల్లలకు

ప్రతీ రోజూ మామిడిచెట్టు బెరడుతో తీసిన రసం వడపోసి ప్రతీరోజూ 20గ్రా మోతాదుగా ఆవుపాలు తోకలిపి
తాగిస్తే గర్బదోషం తొలగిపోయి రజస్వల అవుతారు

స్త్రీ ల సమస్యలు

ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం స్నానంచేయడానికి ఒకగంట ముందుగా పెరుగుతో యోనిని కడుగుకుంటూవుంటె
క్రమంగా వదులుగా వున్న యోని బిగువుగా వుంటుంది

బూరుగు జిగురు సంపాదించి దాన్ని మెత్తటి చూర్ణం లా దంచి జల్లెడపట్టి వస్త్రఘుళితం చేసి తరువాత సుతిమెత్తని
చూర్ణంలో నీరు కలిపి గంధంలా నూరి ఆగంధాన్ని యోని పై లేపనం చేయ్యాలి

ఇలా కొద్దిరోజులు చేస్తే పదిసార్లు ప్రసవించిన స్త్రీ కైన యోని గట్టిపడి కన్యక యోనిలా అవుతుంది

21, సెప్టెంబర్ 2009, సోమవారం

అన్ని నొప్పులకూ - అర్జునాంజనము

వాజలైన్ ఒక పౌను,ఫైరాఫిన్ మైనము మూడు ఔన్సులు,మెంతాల్ రెండు ఔన్సులు,కర్పూరము రెండు ఔన్సులు,కాజీపుట్ తైలము రెండు ఔన్సులు,మొరాస్టిక్ తైలము రెండు ఔన్సులు,యూకలిప్టస్ తైలము రెండు ఔన్సులు,ఓమ పువ్వు ఒక ఔన్సు,పిప్పరమెంట్ పువ్వు రెండు ఔన్సులూ తీసుకోవాలి.

ఒక పెద్ద పాత్రలో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్ళు బాగా మరిగిన తరువాత వేరొక ఖాలీ అల్యూమినియమ్ పాత్రను మరుగుచున్న నీటి పాత్ర మీద పెట్టి దానిలో మైనపు ముక్కలను వేసి,నీటి ఆవిరికి మైనమును కరిగించాలి.తరువాత దానిలో వాజలైన్ కలపాలి.ఆ రెండూ కలిపిన తరువాత ఆ మిశ్రములో కర్పూరమూ,మెంతాల్ పొడి వేసి కలిపి పాత్రను కిందికి దించి మిగిలిన వస్తువులను ఒక్కొక్కటిగా చేర్చి వేడిగా వుండగానే సీసాలో పోసి నిల్వ వుంచుకోవాలి.

దీనిని తల,నుదురు,మెడ,మోకాళ్ళూ,నడుములు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూస్తూ వుంటే పూసిన పది నిమిషాలలో నొప్పులు మాయమైపోతాయి.

తలనొప్పి తైలము

పిప్పింటాకు రసము ఒక కేజీ(నీళ్ళు కలపకుండా తీసినది),మంచి నువ్వుల నూనె ఒక కేజీ,ఈ రెండింటినీ ఒక పాత్రలో కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపైన నిదానముగా ఆకు రసమంతా ఇరిగిపోయి నూనె మిగిలే వరకూ మరిగించాలి.
తరువాత,పాత్రను దించి చల్లార్చిన తరువాత వడపోసుకుని ఈ తైలమును కొంచెము గోరువెచ్చగా తలకు రుద్దుకుని స్నానము చేస్తూ ఉంటే తలపోటు,తలదిమ్ము త్వరగా తగ్గిపోతాయి.

పిచ్చి వ్యాధులకు

పాల సుగంధి వేళ్ళ మీది బెరడు చూర్ణం 40గ్రాములు,అశ్వగ్రంధ చూర్ణం 20గ్రాములు,పటిక బెల్లం చూర్ణం 60గ్రాములు కలిపి వస్త్రఘాలితం చేసి అతి మెత్తటి చూర్ణంగా తయారు చేసుకోవాలి.ఈ చూర్ణాన్ని పూటకు రెండున్నర గ్రాముల చొప్పున ఒక కప్పు పాలు అనుపానంగా రెండు పూటలా సేవిస్తూ వుంటే మతిభ్రమణం,పిచ్చి,ఉన్మాదం తగ్గిపోయి నిద్ర బాగా పట్టి ఆరోగ్యం చేకూరుతుంది.

నిద్రపట్టనివాళ్ళకు

ఇనుప పాత్రలో యాభై గ్రాములు నువ్వుల నూనె పోసి బాగా మరిగించాలి.అందులో 10గ్రాములు హారతి కర్పూరం వేసి కరిగిన తరువాత,పొయ్యి మీద నుంచి దింపాలి.నూనె చల్లారిన తరువాత రోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్ళకు మర్ధనా చేయించుకుంటే , సుఖమైన నిద్ర పడుతుంది.

అతినిద్రతగ్గటానికి

ఆముదపు చెట్టు పూవుల్ని పాలతో మెత్తగానూరి, కణతలకు పట్టువేసి తలపై కూడాపట్టు వేస్తూ వుంటె
క్రమముగా అతినిద్ర తగ్గిపోతుంది

సరస్వతీతైలము

తయారీవిధానము:- సరస్వతీసమూలం 100గ్రా
గుంటగలగరసమూలం 100గ్రా
పొన్నగంటికూర...............100గ్రా
ఉసిరికాయలరసం............100గ్రా
తెల్లగలిజేరుఆకురసం.......100గ్రా
తీసుకుని ఒక పాత్రలో వేసి దానిలో500గ్రా మంచినీరు,500గ్రానువ్వులనూనె కలిపి చిన్నమంటపైన నూనెమాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి నిలువ వుంచుకోవాలి
వాడేవిధానము:-ఈతైలాన్ని రోజూ తలకు మర్దనా చేసుకుంటు వుంటె తలలో వేడి, విషవాయువులుఅతిచల్లదనము హరించి మెదడు ప్రశాంతమౌతుంది. దీనివలన తలవెంట్రుకలు అందముగా,ఆరోగ్యముగాపెరుగుతాయి

తులసి ( టి )

తులసి ఆకులపొడి 100గ్రా"
పుదీనాఆకులపొడి 100గ్రా"
సుగంధపాలవేళ్ళపొడి100గ్రా"
సొంఠిపొడి......................20గ్రా
దాల్చినచెక్కపొడి.........20గ్రా
ధనియాలపొడి.............20గ్రా
ఆకుపత్రిపొడి................20గ్రా
మిరియాలపొడి............20గ్రా
జాపత్రి పొడి...................20గ్రా
తీసుకుని అన్ని కలుపుకుని నిలువవుంచుకోవాలి
వాడెవిధానము :-ఒక గ్లాసు పాలలొ ఒకచెంచా పొడి కలిపి మరగబెట్టి వడపోసుకుని తగినంత చెక్కెర,మదుమెహరోగులైతేతగినంత తాటిబెల్లం కలుపుకుని రెండు పూటలా తాగాలి

ఉపయోగములు:-ఈ తులసి టీ ప్రతి రోజూ తగితే సర్వ శిరో రోగాలుతగ్గి నరాలకు శక్తి కలుగుతుంది.మెదడుకు
శక్తి వస్తుంది. మనసిక ఆందోళనలు , అనవసర ధుఖము,పాత తలనొప్పులు, తుమ్ములు జ్వరము,దగ్గు,ఆయాసము క్రమముగా తగ్గి పోతాయి

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

పార్శ పు తలనొప్పికి

రాత్రి నిద్దురపోయేముందు 60గ్రా పంచదారగాని కండచెక్కరపొడి గాని
పావులీటరు నీటిలో వేసి కరిగించి మూతపెట్టి మంచంకిందపెట్టుకుని
పడుకోవాలి తెల్లవారుఝామున 5గంటలకు నిద్రలేచి ఆపంచదారనీళ్ళని
ఒకసారి కలుపుకుని తాగాలి ఒక గంటవరకూ మరేమీ తాగకుడదు
తినకూడదు ఈవిధంగా 4to5రోజులు చేస్తె పార్శపు నొప్పి (అరతలనొప్పి)
తగ్గిపోతుంది

తలనొప్పికి

తులసిఆకులను నీడలో ఆరబెట్టి దంచి జల్లించి వస్త్ర్ఘుళ్ళితంచేసి అతిమెత్తని చూర్ణాన్నితయారుచేసి నిలువ చేసుకోవాలి
రోజూ రెండు లేకమూడుపూటలా చిటికెడు పొడిని ముక్కులతో లోపలికి పీలుస్తువుండాలి ఈ చిన్నప్రయోగం వల్ల
ఎంతకాలంనుంచి వేధిస్తున్న జలుబు, దగ్గు, పడిశము, తుమ్ములు, తలనొప్పి, తగ్గిపోతాయి

తలరోగాలకు(తలనొప్పి)

రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నువ్వులనూనె రెండుచుక్కలు చెవులలొను
రెండుచుక్కలు ముక్కులలోను వేయాలి. గుక్కెడునూనెను నోటిలోను వేసుకునిఐదునిమిషాలు పుక్కిలించాలి
ఇలాచేయడంవల్ల ఈతైలము తలలొ సర్వశిరో భాగాలకు చేరి మలిన,వ్యర్ద పదార్దాలు,మలినవయువులు,ఉష్ణవయువులు
నిలువ వుండకుండావాటిని కరిగిస్తు శిరస్సు ను పరిశుభ్రంగా ఉంచుతుంది ఖర్చులెని కష్టంలేనిఈ ఒక్క సులువైన
యోగంతొ భవిష్యత్తులొ రక్తపోటు,గుండెపోటు,పక్షపాతం,మూర్చ,అపస్మారము,కండరాలక్షయం మొదలైన నరముల
సంబందిత రోగాలు దరిచేరకుండా తమనుతాము కాపాడుకోవచ్చు

17, సెప్టెంబర్ 2009, గురువారం

స్ఠనాల గట్టితనానికి

దానిమ్మ కాయ పై బెరడును ఆవనూనెలో కలిపి నాన బెట్టి మెత్తగానూరి,ఆ రసాన్ని పలుచటి గుడ్డలో వడపోసుకుని , ఆ రసంతో చన్నుల మీద లేపన చేస్తూ వుంటే , వాలుపోయిన చన్నులు కూడా గట్టిగా మారతాయి.

లింగ దృఢత్వానికి

సైంధవ లవణం,తేనే,పావురముల రెట్ట ఈ మూడూ సమభాగాలుగా కలిపి మెత్తగా నూరి లింగం(పురుషుని మర్మావయవం) మీద ముందు మణి భాగాన్ని వదలి,వెనుక భాగమంతా పట్టిస్తూ వుంటే క్రమంగా లింగ బలహీనత హరించి లింగం దృడంగా,లావుగా మారుతుంది.

నవ యౌవనానికి - సురతరు తైలం

ఆవుపాలు 10గ్రాములు , ఆవు నెయ్యి 10గ్రాములు,ఉసిరిక కాయల రసము 10గ్రాములు ,దేవదారు పట్ట నుంచి తీసిన నూనె 20గ్రాములు,ఇవన్నీ కలిపి , బాగా చిలకారించి,ప్రతిరోజూ ఉదయమే తాగాలి.ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వ్రుద్ది కలిగి శరీరం బంగారు చాయతో ప్రకాశిస్తుంది.బుద్ది బ్రుహస్పతి వలే అభివ్రుద్ది చెందుతుంది.రెండవ నెలలో ఈ ఔషదాన్ని రెట్టింపు చేసి అనగా 100గ్రాములు మోతాదులో తాగిన యెడల ,వాత , పిత్త ,కఫ,అనే త్రిదోషాలు,సర్వనేత్ర వ్యాధులూ హరించి పోతాయి.

మూడవ నెలలో రెండవ నెలలో రెండవ నెలకన్నా రెట్టింపు చేసి అనగా 200గ్రాములు,మోతాదులో తాగిన యెడల నవ యౌవనము ప్రాప్తిస్తుంది.సూర్యుడి వంటి కాంతిటో ,దేవతలతో సమానమైన శరీరంతో ప్రకాశిస్తారు.ఇది సులభమైన అధిక ఫలము నిచ్చే దివ్య రసాయన తైలము.

సంభోగ శక్తి కోసం

  • బురుగు బంకను మెత్తటి చూర్ణంగా తయారుచేసి పూటకు రెండున్నర గ్రాములు మోతాదుగా,రెంుపూటలా మేక పాలతో కలిపి తాగుతూ ఉంటే ,రోజుకు ఎన్ని సార్లైనా సంభోగం చేసే శక్తి కలుగుతుంది.
  • అశ్వగంధ రెండున్నర గ్రాములు.యష్టి మధుకం రెండున్నర గ్రాములు , కలిపి పాలు,పటిక బెల్లంతో రెండుపూటలా తీసుకుంటే ప్రతిరోజూ సంభోగం చేసే శక్యి చేకూరుతుంది.
  • బార్లీ గింజలు 20గ్రాములు తీసుకుని అరలీటరు నీళ్ళలో పోసి పొయ్యి మీద పెట్టి పావు లీటరు నీరు మిగిలే వరకూ సన్న మంట మీద మరగబెట్టాలి.తరువాత ఆ కషాయాన్ని వడపోసుకుని నలభై రోజుల పాటు తాగుతూ ఉంటే,శరీరంలోని అమిత వేడి హరించి,వీర్యం గట్టి పడి సంభోగ శక్తి పెరుగుతుంది.

వీర్య స్తంభనకు

కుసుమ నూనెను లింగానికి(ముందు భాగం వదిలి)లేపనం చేస్తూ వుంటే నరాలకి శక్తి కలిగి,ఎక్కువ సేపు వీర్యాన్ని స్తంభింపజేసే అవకాశం ఏర్పడుతుంది.
ఎర్ర గన్నేరు వేరు తెచ్చి,నెయ్యిలో వేసి వేయించాలి.వేరు తీసివేసి నెయ్యిని వడపోసుకోవాలి.ఆ నేయిని లింగానికి(ముందు భాగాన్ని వదలి)రోజూ లేపనం చేస్తూ వుంటే , లింగం బలమూ,వీర్య స్తంభనా కలుగుతాయి.
  • రేగిచెట్టు జిగురు సంపాదించి , సంభోగ సమయంలో,బొడ్డుకు పూసుకుంటే వీర్య స్తంభన జరిగి ఎక్కువ సేపు రతిలో పాల్గొనవచ్చు.
  • ప్రతిరోజూ,అతిమధురం 5గ్రా,తేనె 5గ్రా,కలిపి సేవింి వెంటనే ఆవుపాలు ఒక గ్లాసు తాగుతుంటే విశేషంగా వీర్య స్తంభన జరుగుతుంది.

14, సెప్టెంబర్ 2009, సోమవారం

పేనుకొరుకుడు

*చేదు పొట్లాకు రసం వెంట్రుకలు రాలిపోయిన చోట రెండుపూటలా రుద్దుతూ వుంటె 3to7రోజులలో
తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*కొబ్బరినూనెలొ ఎండు పొగాకు చితగ్గొట్టి వేశి నానబెట్టి తరువాత బాగా పిసికి వడకట్టి ఆనూనెను
రోజు తలకు రాస్తూవుంటె వెంట్రుకలు మొలుస్తాయి
*నేలములక వేరు తేనెతొ కలిపి మెత్తగా నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా రుద్దుతూ వుంటె
తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*పల్లేరుపూలు, నువ్వులపూలు, తేనె, నెయ్యి, సమంగా కలిపి నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా
రుద్దుతూ వుంటె తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి
*మందారపూలు నల్ల ఆవుమూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరు కుడుపైన రెండుపూటలా
రుద్దుతూ వుంటె తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి

తెల్లవెంట్రుకలు నల్లగాచేసుకోండి

బోడసరం చెట్టు పూలు తెచ్చి నీడలొ ఎండబెట్టి దంచి చూర్ణంచేసుకోవాలి
దానితో సమానంగా కండచెక్కెర పొడి కలిపి ఉంచుకొని ఆచూర్ణాన్ని రోజు
ఉదయం రెండున్నర గ్రాముల మోతాదుగా వుంటే ఆరునెలల నుండి
సంవత్సరం లోపు తెల్ల వెంట్రుకలన్ని శాశ్వతంగా నలుపెక్కుతాయి
అంతేగాకుండా యౌవ్వనం స్థిరంగా నిలిచివుంటుంది కంటిద్రుష్టి అమోఘంగా పెరుగుతుంది

*ఈ యోగం వాడెటప్పుడు స్త్రీ పురుషులు అమిత శ్రంగారాన్ని విడిచిపెట్టాలి
ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన విధంగా చలికాలంలొ ప్రతిరోజు ఒకసారి
వర్షాకాలంలొ వారానికి ఒకసారి వేసవికాలంలో పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే ఆరోగ్యవంతులైన
వారు శ్రుంగారంలో పాల్గొనాలి ఈనియమాన్ని పాటిస్తు ఆహారంలో చింతపండు నిషేదించాలి దానికి బదులుగా
ఉసిరికాయల ముక్కలను వేసుకోవచ్చు ఇంకా ఆవుపాలు, ఆవునేయ్యి, ఆవుపెరుగు, ఆవువెన్న, పుష్కలంగా
వాడుకోవచ్చు*

*ఇదివాడిన స్త్రీ తో పురుషుడు సంభోగించినా పురుషుడితో స్త్రీ సంభోగించినా జీవితాంతం వారిని మరిచిపోలేనంత
అమరసౌక్యం కలుగుతుంది

కలబంద తైలం

కలబందగుజ్జు 100గ్రా
గుంటగలరాకురసం100గ్రా
నువ్వులనూనె (లేక) మంచి కొబ్బరినూనె 300గ్రా
తీసుకుని అన్ని కలిపి మెత్తగా పిసికి గుజ్జులాగా చేసి చిన్న మంటపైన
నూనె మాత్రమేమిగిలేటట్లు మరగబెట్టాలి .
పొయ్యి మీదనుండి దించడానికి పావుగంటముందు
100గ్రా. గంధ కచ్చూరాల పొడి వేసి తరువాత దించుకోవాలి చల్లబడిన తరువాత
పలచని బట్టలో వడ పోసుకుని నిలువచేసుకోవాలి
వాడేవిధానము::- ఈ తైలాన్ని ప్రతీరోజు తగినంత మోతాదుగా తల వెంట్రుకల కుదుళ్ళుకు
ఇంకేటట్లుగా మర్దనా చేసుకోవాలి ఇలాచేస్తూవుంటే తలలో దురద, పుండ్లు, జిడ్డు తగ్గిపోయి
వెంట్రుకులక మంచి బలము, రంగు సంక్రమిస్తాయి

చుండ్రు నివారణకు

మంచికబ్బరినూనె అరకిలొ అందులో 5 నిమ్మపండ్లరసంకలిపి, పొయ్యి మీద పెట్టి సన్నటి సెగ మీద మరిగించాలి
రసము ఇగిరి నూనె మాత్రమే మిగిలిన తరువాత పాత్రను దించి చల్లార్చి వడపోసుకోవాలి

రోజు ఉదయం గాని సాయంత్రం గాని ఈతైలాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత కుంకుడుకాయపౌడర్
తొ తలస్నానం చేయ్యాలి తరువాత ఎట్టిపరిస్తితులలోనూ నూనె రాయకూడదు

ఈవిధంగాచేస్తూవుంటె చుండ్రు , వెంట్రుకలు రాలిపోవడం తలలో దురద,పేలు,ఇలాంటివన్ని పోయి,
వెంట్రుకలు నల్లగా బలంగా పెరుగుతాయి

తలవెంట్రుకల రక్షణకు

కరకచూర్ణము100గ్రా"
ఉసిరిక
చూర్ణము100గ్రా"
తాడికాయల
చూర్ణము100గ్రా"
లోహభస్మం
100గ్రా"
వీటన్నింటినీ నీళ్ళతో మెత్తగానూరి ౩౦౦ గ్రా"రసంతీయాలి.
ఆ రసాన్ని ఒక కుండలో పోసి అందులొ ౩౦౦ గ్రా"నువ్వులనూనె పోసి
౩౦౦ గ్రా"గుంటగలగర రసము కలిపి బాగా గిలక్కొట్టి పొయ్యి మీద పెట్టాలి
సన్నటిమంట మీదమరిగిస్తు గరిటతో కలియబెడుతువుండాలి కుండలొ నీరంతా ఇంకిపోయి నూనె మాత్రమే మిగులుతుంది పొయ్యి మీదినుంచి దించి చల్లార్చిన తరువాత వడబోసి నూనెను వేరుచెయ్యాలి.
ఈ నూనెను మళ్ళి కొత్తకుండలో పోసి కుండపైన మూతపెట్టి గుడ్డతోచుట్టి భూమి లో5 అడుగులు గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి.
ఈవిధంగా నెలరోజు లపాటు భూమిలోనే వుంచి 31వ రోజు కుండను బయటకుతీయ్యాలి
ఈతైలాన్ని ప్రతీరోజు తలకు బాగామర్దనాచెసి అరటిఆకు తో తలకు కట్టుకట్టి
3గంటలపాటు అలాగే వుంచాలి
ఆ తరువాత ఆకు తీసివేసి ,కరక ,ఉసిరి ,తాని కాయలతో తయారుచేసిన
కషాయంతో తలంటుకుని స్నానంచేయాలి
ఈ విధంగా వారంరోజులు చేసెటప్పటికి తెల్లవెంటృకలు నల్లగా అవుతాయి
*ఎప్పటికీతెల్లబడవు*

ఊడినవెంట్రుకలు తిరిగి మొలుచుటకు

కానుగపూవుల రసాన్నిగాని ఉల్లిగడ్డల రసాన్నిగాని ముల్లంగిదుంపల రసాన్నిగాని ప్రతీ రోజూ రాత్రి నిద్రించే ముందు వెంట్రుకలు ఊడిపోయిన చోటబాగాఇంకిపోయేలాగా రుద్దాలి ఉదయం పైన తెలిపిన కషాయంతో
కడుగుతూ ఉండాలి దీనితోపాటు ఫార్మసీలో దొరికే కేశామ్రుతము,
కేశవ్రుద్దీకర లేపనము వాడుతూ వుంటే క్రమక్రమం గా వెంటృకలు
ఊడినచోట తిరిగి మొలుస్తాయి

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

హస్తప్రయోగపీడితులకు

పెన్నెరుదుంపలు,నువ్వులు,మినుములు,ఎనుగుపల్లేరు కాయలు,
పిల్లిపీచర దుంపలు ఒక్కొక్కటి50 గ్రా"తీసుకుని ఒక మయ్యిపాత్రలొవేసి ఆపదార్దాలు మునిగేవరకు ఆవుపాలుపోసి చిన్నమంటపైన ఆపాలన్నీ ఉడికిపోయేవరకూ మరిగించాలి తరువాత ఆపదార్దాలను తీసిఎండలొ ఎండబెట్టాలి ఈవిధంగాకనీసం7సార్లు చేసి బాగాఎండించి దంచి పొడిచేసుకోవాలి పలుచని బట్టలొ వస్రఘూళితంచెయాలి తరువాత 2లీటర్ల ఆవుపాలు తిసుకుని పొయ్యిమీద పెట్టి ఈపాలలొ పై చూర్ణాన్ని పోసి చిన్నమంటపై మరిగిస్తూ గరిటతో కలియబెడుతూవుండాలి పాలు చూర్ణం రెండూకలిసిపోయి కోవాలా ఐనతరువాత క్రిందకి దించాలి తరువాత వేరే కళాయి పాత్రలొ 450గా"ఆవునేయ్యి వేసి చిన్నమంటపైన మరగబెడుతూ పైన తయారైన కోవా ముద్దను ఆనేతిలో వేసిదోరగా వేయించాలి తరువాత పాత్రను దింపి చల్లారినతరువాత ఆకోవాఎంత తూకం ఉందో దానికి రెండు రెట్లు పటికబెల్లంపొడిని కలిపి మొత్తంపదార్దాన్ని బాగా కలిపి ఆముద్దను20గ్రా"తూకం ఉండెలా చిన్నచిన్ని లడ్లు మాదిరిగా తయారుచేసి నిలువ ఉంచుకోవాలి రోజూ ఉదయం సాయంత్రం ఆహారానికి రెండు గంటలముందు ఒక లడ్డు తిని ఒక కప్పు గోరువెచ్చిని ఆవుపాలు తాగుతూ ఉండాలి ఈవిధంగా చేస్తూకనీసం40to60రోజులు బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళి కాని హస్తప్రయోగ పీడితులు వివాహా పర్యాంతం కనీసం ఆరు నెలలు లడ్లు సేవిస్తూ పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి ఇలాచేస్తె అమితమైన వీర్య పటుత్వం దేహ దారుడ్యంకలిగి యవ్వనము,కాంతి, తేజస్సుపెరుగుతాయి

10, సెప్టెంబర్ 2009, గురువారం

చెముడువుంటే...?

మారేడు పండులో ఉన్న గుజ్జుని తీసుకొని ఆవు మూత్రంలో వేసి బాగా పిసకాలి।దానికి సమానమ్గా,నువ్వుల నూనెను మేక పాలను కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి సెగ మీద వండాలి।పాత్రలో ఉన్న నీళ్ళు ,మేకపాలు,నూనెలో ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలిన తరువాత దించి,చల్లార్చిన తరువాత,పలచటి కాటన్ గుడ్డలో వడకట్టి,జాగ్రత్త చేసుకోవాలి.ఆ నూనెని ప్రతిరోజూ మూడు , నాలుగు చుక్కలు చొప్పున చెవుల్లో వేసుకుంటే క్రమక్రమంగా చెముడు తగ్గిపోతుంది.

చెవిరోగాలకు

ఉమ్మెత్తాఅకులరసం100గ్రా" నువ్వులనూనె200గ్రా" కలిపి
పొయ్యిమీదసన్నటి మంట మీద వండాలి వండేటప్పుడు అందులొ ఏడుజిల్లేడుఆకులు వేయాలి

క్రమంగా పాత్రలోని ఉమ్మెత్తరసం,జిల్లేడుఆకులరసం ఇగిరిపోయి
నూనె మాత్రమే మిగులుతుంది దీనిని చల్లార్చినతరువాత వడపొసుకోవాలి
దీన్ని అవసరంవచ్చినప్పుడు చెవిలొ రెండు చుక్కలు మాత్రమే వేయాలి
దీనివల్ల సమస్త చెవి వ్యాదులు నిస్సందేహంగా తగ్గిపోతాయి

చెవిరోగాలకు

ఉత్తరేణి చెట్టు సమూల రసం 100గ్రా"ఉత్తరేణి చెట్టును అకాల్చిన బూడిద 100గ్రా" మంచి నువ్వులనూనె200గ్రా" మంచినీరు200గ్రా:
ఇవన్ని కలిపి పొయ్యి మీదపెట్టి తైలంమాత్రమే మిగిలేవరకు చిన్నమంట
పైన మరిగించి వడపోసి నిల్వ చేసుకొవాలి
ఈతైలాన్ని రోజు రెండుపూట్లా చెవులలొనాలుగైదు చుక్కలవేస్తె
చెవిలో ఏ సమస్య ఐనాతగ్గిపోతాయి

చెవిరోగాలకు

సన్నరాష్ట్రము,తిప్పతీగ,ఆముదమువేరు,దేవదారుచెక్క,సొంఠి,
ఈ ఐదు సమభాగాలుగా తీసుకుని దంచి,చూర్ణం చేసి నిల్వవుంచుకోవాలి
ఈ చూర్ణాన్ని పూటకు రెండు గ్రాములు మోతాదుగా రెండుపూటలా
ఆహారానికి అరగంట ముందు లేక గంట తరువాత ఒక చెంచా తేనెతొ
కలిపి సేవిస్తూ వుంటె చెవిపోటు,హోరు చెవిలోకురుపులు,చీము
చెముడు సమస్యలు తగ్గిపోతాయి

చెవిరోగాలకు

లేతవేపాకులను30గ్రా" తీసుకుని మెత్తగానలుగకొట్టి దానిలో20గ్రా"
మంచి తేనె ను కలిపి ఈరెండింటినీ రోటిలొవేసి మెత్తగా నూరి ఆముద్దను
పలుచని బట్టలో వేశి రసం పిండుకుని సీసాలోపోసి నిలువవుంచుకోవాలి
ఈరసాన్ని చీము కారుతూ వున్నచెవిలో రోజుకు మూడుసార్లు పెద్దలకు
నాలుగైదుచుక్కలు,పిల్లలకు రెండు,మూడు చుక్కలు వేస్తూవుంటె
వారంరోజులలొ చెవి నుండికారే చీము సమస్య పూర్తిగాతగ్గుతుంది

చెవిరోగాలకు

ముల్లంగిదుంపలను మెత్తగా దంచి ఆముద్దను పలుచని బట్టలోవేసి
పిండి తీసిన రసం100గ్రా" పరిశుద్దమైన ఆవాలనూనె100గ్రా"
తీసుకుని కలిపి మట్టిపాత్రలొ పొయ్యిమీదపెట్టి చిన్న మంటపైన
నూనె మాత్రమే మిగిలే వరకూ మరిగించి దించి చల్లార్చి నిలువవుంచుకోవాలి
ఈద్రవాన్ని చుక్కలువేసే సిసాలోపొసి ఏచెవి సమస్య ఉన్నవారైనా
ఉదయం రాత్రి సమయాలలో ప్రతిరోజూ నాలుగైదు చుక్కలు వేసుకుని
దూది పెట్టుకొంటూవుంటే క్రమముగా చెవిపోటు,చెవిలొచీము,చెవినొప్పి
చెవిలోహోరు,చెవిఎండిపోవడం,చెవుడు సమస్యలు నివారించబడతాయి

చెవిరోగాలకు

వర్షాకాలంలోను,చలికాలంలోను పరిశుబ్రమైన గోరువెచ్చని నువ్వులనూనె
ఎండాకాలంలో
పరిశుబ్రమైన వంటాముదం ప్రతీరోజూ క్రమంతప్పకుండా
నిద్రలేచిన తరువాత రెండు,మూడుచుక్కలువేసుకుని చెవి తమ్మెలను
కదిలించాలి ఈఅలవాటు వల్ల పెద్దపెద్ద చెవి రోగాలు రాకుండాకాపాడుకోవచ్చు

9, సెప్టెంబర్ 2009, బుధవారం

వెంట్రుకలురాలకుండా

గోరింటపూలు,ఆకులు దంచి రసం తీసికొబ్బరినూనెతొ
కాచి వడపోసి ఆనూనెను తలకు రాసుకుంటూవుంటే
వెంట్రుకల కదుళ్ళు గట్టిపడి ఊడిపోవడం ఆగుతుంది
*తెల్లవెంట్రుకలు కూడా నల్లగానిగనిగలాడుతూ అందంగాఉంటాయి

నల్లవెంట్రుకలుకావాలా.....?

కరక్కాయ,ఉసిరికాయ,తాడికాయ,లోహచూర్ణం ఈ వస్తువులను
సమానభాగాలుగా మంచినీళ్ళతొ నూరి రసం తయారుచేయాలి
ఈరసానికి సమానంగా నల్లనువ్వులునూనె కలపాలి తరువాత
ఈరసంఎంతతూకం ఉంటుందొ అంతతూకంగా పచ్చిగుంటగలిజేరు
ఆకు రసం కలిపి బాగా కలియతిప్పాలి ఆపదార్దమంతా మట్టికుండలో
పోసి కట్టెలపొయ్యి మీద సన్నటి మంటమీద మరిగించాలి క్రమంగా
కుండలొ నీరంతాఇంకిపోయి నూనె మత్రమే మిగులుతుంది
ఈనూనెను దించి చల్లారిన తరువాత వడపోసి,ఆనూనెకుండకు
4to5వరుసలు బట్టవేసి గట్టిగాతాడుతొ కట్టి ఆకుండ మూతిచుట్టూ
బంకమట్టితో మెత్తి బంధనము చేసి అదిఆరినతరువాత దానిని
నెలరోజులపాటు భూమిలో పాతిపెట్టాలి నెలతరువాత ఆతైలాన్ని
తలకు బాగామర్దనాచేసి తలకు అరటిఆకును కట్టాలి 3గంటల
తరువాత ఆ ఆకును తీసి త్రిఫల కషాయంతో తలంటుకుని
స్నానంచేయాలి ఇలాచేస్తె క్రమంగా తెల్లవెంట్రుకలు నల్లబడ్తాయి
నల్లవెంట్రుకలు నెరవకుండా నిగనిగలాడతాయి

లిక్విడ్ హెర్బల్ షాంపు

కుంకుడుకాయలపొడి,గుంటగలగరాకు,నిమ్మకాయచెక్కలు,టీపొడి
వీటిని గుప్పెడు తీసుకుని ఒకగ్లాసు వేడినీటిలోవేయాలి
తరువాత బాగా గిలక్కొట్టి వడపోసుకుని షాంపులాగావాడుకోవచ్చు

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

గమనిక


మన బ్లాగులొని కొన్ని ఫొటొలను అప్ లోడ్ చేసాను
ఇదికేవలం సరదాకొసంమాత్రమే ఎవరికైనా
అబ్యంతరంఉన్నయెడల సూచిస్తే తొలగించబడును
మీ
నాగబ్రహ్మారెడ్డి

మూలికలషాంపు*


*ఉసికకాయతొక్కలపొడి,వేపాకులపొడి,తెల్లచందనంపొడి,బాదంపప్పుపొడి,
యష్ఠిమధుకంపొడి, వీటినిసమభాగాలుగా తీసుకుని అన్నికలిపి గాలిచొరబడని డబ్బాలొ బద్రపరుచుకోవాలి స్నానానికి వెళ్ళెముందు
జుట్టును పాయలుగా విడదీసి ఈ పొడిని జుట్టుకుదుళ్ళమద్య చల్లాలి
10నిముషాలతరువాత సన్నటిపళ్ళుకలిగిన దువ్వెనతొ దువ్వెయ్యాలి
అప్పుడు ఈ పొడితోపాటు వెంట్రుకలను అంటిపెటుకున్న జిడ్డు మురికి
బయటకువచ్చేస్తుంది తర్వాత కుంకుడుకాయరసంతో తలారాస్నానం
చేయవచ్చు

ఆయుర్వేదషాంపు


కొత్తకుంకుడుకాయలపైపెచ్చులపొడి100గ్రా"శీకాకాయలపొడి100గ్రా"
ఉసిరికకాయలపొడి100గ్రా"
మారేడుపండుగుజ్జుపొడి100గ్రా"వీటిని విడివిడిగాపొడిచేసి అన్నికలిపి నిలువచేసుకోవాలి
వాడేవిధానము:-ఒకపెద్దగ్లాసువేడినీటిలొ మగవారికి౩చెంచాలు,ఆడవారికి6చెంచాలుపొడివేసి దానిలొ ఒకనిమ్మపండురసంపిండిమూతపెట్టి౩గంటలునిల్వ ఉంచి ఆతరువాతమూతతీసిచెంచాతొ కలిపితె మంచివాసన,నురుగువస్తుంది దీన్నికొద్దికొద్దిగాచేతులలోతీసుకుని తలకురుద్దుకుంటూ స్నానముచెయ్యాలి వారానికి ఒకటి లేదారెండుసార్లు ఈ విధంగాచేస్తె పైపదార్దాల జీవగుణము కేశమూలల్లొకి చొచ్చుకుపోయి వెంట్రుకులకుదుళ్ళనుగట్టిపరుస్తుందిఅంతేగాకతలలో కురుపులు,పుండ్లు,దురదలు చుండ్రు సమస్యలను నివారిస్తుంది వెంట్రుకులుకు చక్కటినునుపు,నిగారింపు,ద్రుడత్వము,ఇస్తుంది
వెట్రుకలను సంపూర్ణ ఆరొగ్యముగా కాపాడుతుంది

వెంట్రుకలాఅరోగ్యానికి

ఒకగ్లాసు నీటిలొ ఒకచెంచాత్రి ఫల కల్పచూర్ణమునుకలిపిరాత్రినుండిఉదయంవరకునానబెట్టి ఉదయం ఆనీటిని నాలుగోవంతు మిగిలేవరకు చిన్నమంటపై మరిగించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత తలపైన ఆకషాయాన్నిసున్నితంగా మర్దనా చేస్తూలోపలికి ఇంకిపోయెటట్లుచేయాలిదీనివల్లవెంట్రుకలుకుదుళ్ళు గట్టిపడి తల పరిశుబ్రమైచక్కటికేశసంపద కలుగుతుంది
*దీనితీపాటు లోపలికిసేవించడానికి కేశామ్రుతము,త్రిఫల రసాయనము,తలస్నానాకి కేశవ్రుధీకర లేపనము ఫార్మసీలోతయారైనవివాడుతూవుంటేక్రమంగామంచిపలితాలుపొందవచ్చు

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

రెడ్డివారినానుబాలు ఇదిఎరుపు తెలుపు రంగుల్లొ చాలాచిన్నదిగా
ఉండెరకంఒకటి అర అడుగుఎత్తు పెరిగెరకంఒకటి అన్నిప్రాంతాల్లొ
దొరకుతుందిదీన్ని పచ్చిదిగాతెచ్చి కడిగి దంచి రసంపిండి
పావుకప్పుమోతాదుగా ఒకచెంచా కండచెక్కెరపొడి కలిపి రెండుపూట్లా
సేవిస్తే సకల మూత్రావయాలుబలపడడమేకాక వీర్యవ్రుద్ది కల్గుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

తెల్లగలిజేరుఆకుకూరలాగా వండుకుతింటే లేదా
పప్పులొవేసి కూరలాగా వండుకు తిన్నా
మూత్రావయాలుబలపడడమేకాకవీర్యవ్రుద్దికలగుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

కొండపిండికూర దీని ఆకులను కూరలాగ వండుకుని
తింటే మూత్రావయాలుబలపడటమేకాక వీర్యవ్రుద్దికలుగుతుంది

మూత్రగ్రంధి(వీర్యవ్రుద్ది)కి

చిన్నలేకపెద్దపల్లేరుఔషాదులను సమూలంగాతెచ్చిశుబ్రంచేసి
ముక్కలుగా తరిగి నీడలొ గాలి తగిలేచొట ఆరబెట్టి నిల్వుచేసుకోవాలి
నెలకు ఒకసారి తగినంత పదార్దాన్ని తీసుకుని దంచి పొడి
చేసుకోవాలి
ఒకగ్లాసు నీటిలో ఒకచెంచా పొడివేసి ఒకకప్పు కషాయానికిమరిగించి
వడపోసి గోరువెచ్చగాఉన్నప్పుడుఒకచెంచామంచితేనెకలిపిసేవించాలి
దీనివలన మూత్రావయాలు బలపడటమేకాక హస్తప్రయోగపీడితులు
కోల్పోయినవీర్యం కూడా పునరుద్దరించబడుతుంది

3, సెప్టెంబర్ 2009, గురువారం

మన ముఖ్యమంత్రి ఇకలేరు


మన ముఖ్యమంత్రి శ్రీ రాజశెఖర్ రెడ్డి గారి అకాలమరణానికి చింతిస్తూ
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతుని ప్రార్ధిస్తూ.....
మీ
నాగబ్రహ్మారెడ్డి

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించాలంటారు ఎందుకు?

ఇంటిలో ప్రతీరోజూ తులసి మొక్కని పూజించినా, పూజించక పోయినా తులసిమొక్కని మాత్రము తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే తులసి యొక్క ఔషధ గుణములను ద్రుష్టిలో ఉంచుకుని మన పెద్దలు పెరటిలో తులసి మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తులసి నుండి వచ్చే గాలి పీల్చినట్లయితే కలరా వంటి వ్యాధులు దరి చేరవు.
ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే లక్శణం తులసికి వుంది. అందుకే అన్ని రకముల అవకాశములు ప్రయత్నించిన
తరువాత ఆఖరి ప్రయత్నముగా తులసి తీర్ధము నోటిలో పోస్తారు.

About

shotmix


ShoutMix chat widget

online