12, అక్టోబర్ 2009, సోమవారం

స్వైన్ ప్లూ జాగ్రత్తలు

త్రాగనీటి నియమాలు--మంచినీటిని శుబ్రమైన పాతలో పోసి చిన్నమంటపైన వేడిచెయ్యాలి.
చేసినతరువాత మూతపెట్టి పాతలో నీరు సహజంగా చల్లబడెవరకు మూతతీయకుండా ఉంచాలి
ఈ విధంగాకాచి చల్లార్చిన నీటిని మాత్రమేవాడాలి
గొరువెచ్చని నీటిని రోగులకు త్రాగించడంవల్ల జఠరాగ్ని దెబ్బతినకుండా ప్రజ్వరిల్లుతుంది
శరీరంవ్యాది పెరగకుండా అణిగిపోతుంది.అంతేకాకుండా ఉదరంలో చేరిన కఫం వేడినీటి వల్ల ముక్కలుముక్కలుగా
చేదింపబడి విరేచనం ద్వారా బహిష్కరింపబడుతుంది దనితోపాటు విషమించబోయే ఉదరగతమైన పిత్తము, వాతము
అనులోమగతికి చేరతాయి.రోగులకు దప్పికి కూడా తీరుతుంది.
ఇలావేడినీరు తాగకుండా రోగులు చల్లనీరు సేవిస్తే పైన చెప్పిన సుగుణాలకు వ్యతిరేకంగా శరీరంలోదుర్గుణాలు
సంభవిస్తాయి అంతేకాకుండా చల్లనీటివల్ల జ్వరం అతిత్వరగా వ్రుద్దిచెందుతుంది
ఆహారనిమాలు--రోగికి సహజంగా ఆకలి లేనప్పుడు ఆహారం ఇవ్వకూడదు.అలాగే ఆకలి పుట్టినప్పుడు ఆజీర్ణకరమైన
ఆహారంఇవ్వకూడదు.పలుచగా కాచినగంజి పై తేటను వంచితాగితె ఏరకమైన జ్వరాలు కలుగకుండా, ప్రాణశక్తి
క్షీణించకుండా కాపాడుతుంది

1 కామెంట్‌:

About

shotmix


ShoutMix chat widget

online