29, ఆగస్టు 2009, శనివారం

కీళ్ళవాతానికి

వావిలాకులు,చింతాకులు,జిల్లేడాకులు,గుంటగలగరాకులు,
మనగాకులు,దొరికితేపెద్దచెన్నంగి(కసివింద),గానుగాకులు,
ఒక్కొక్కటీ100గ్రా"సేకరించాలి నువ్వులనూనే700గ్రా"
కళాయిలొపొసి మరిగించాలి అదివేడెక్కగానే పైన సేకరించిన
ఆకులన్నిచిన్నముక్కలుగా తరిగివేయాలి ఆకులరసం నూనెలొ
కలిసిపోయేటప్పుడు ఆకులు పగులుతు చిటపటమని శబ్దం
వస్తుంది నూనెబిందువులు పైకిఎగిరి చేతులపై పడే అవకాశం
ఉంది కాబట్టి కొంచెందూరంగా వుండి చేయాలి
ఆకులునల్లగా మాడినూనెమిగిలిన తరువాత దించి బట్టలొ
వడపోసుకోవాలి అందులో దోరగా వేయించి దంచి వస్త్రఘుళ్ళితం
పట్టిన మిరియాలపొడి30గ్రా" పిప్పళపొడి30గ్రా" మెత్తగానూరిన
గడ్డకర్పూరంపొడి40గ్రా"కలిపి మూతపెట్టాలి ఆపదార్దమంతా
నూనెలో కలిసిపోయి చల్లారిన తరువాత ఒకగాజుసీసాలొనిల్వ
ఉంచాలి
ఇలావాడాలి:-కీళ్ళవాతంసంక్రమించినపుడు వేళ్ళగుణుపులవద్ద
చేతులమణికట్టు వద్ద, కాళ్ళచీలమండెలవద్ద,మొచేతులవద్ద,
మోకాళ్ళవద్ద వాచివుంటుంది అక్కడముట్టుకుంటేభరించలేనంత
నొప్పిపుడుతుంది పై తైలాన్ని విడిగా గిన్నెలోకి తీసుకుని
గోరువెచ్చగా వేడిచేసి నిదానంగా మ్రుదువుగా ఆ వాపులపైన
సున్నితంగా రుద్దాలి రోగులు కళ్ళుమూసుకుని బాధను బరించాలి
ఈ నూనె అన్నివాపులకు పట్టించాలి తరువాత పైన తెలిపిన
ఆకులు ఒకఅరకేజీ తీసుకుని రెండు కేజీలనీటిలో వేసికొంచెం
పసుపు వేసిమూతపెట్టి మరిగించాలి పాత్రను దించి సగం
మూతను సగం తీస్తే ఆవిరి పైకి వస్తుంది కీళ్ళవాతంసోకిన
అవయవానికి ఈఆవిరి తగిలేటట్లు చేయాలి దీనివల్ల పైన
పూసిన తైలం లోపలికి ఇంకి లోపలపేరుకుపోయిన వాతం
అనేకుళ్ళిన పదార్దాన్ని కరిగించి చెమట రూపంలొ తోసివేస్తుంది
ఇలా జరిగినపుడు మొదటి 4to5రోజులు రోగికి తీవ్రమైననొప్పి
కలుగుతుంది దాన్నిఓపికగా బరించాలి ఈ విధంగా
ఆవిరిపట్టిన తరువాత ఒక పొడి నూలు బట్టను తీసుకుని
మరిగించిన నీటిలొ ముంచి పిండి ఆబట్టతొ వాపుల పైన
కాపడంపెట్టాలి। ఆతరువాత ఆయాభాగాలకు వ్యాయామంచేయాలి

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online